Homeఎంటర్టైన్మెంట్Dont Trouble The Trouble Review: 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' మూవీ ఫుల్ రివ్యూ.....

Dont Trouble The Trouble Review: ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ మూవీ ఫుల్ రివ్యూ.. పేరులో ‘ట్రబుల్’ ఉన్నప్పుడే అర్థం చేసుకోవాల్సింది!

Dont Trouble The Trouble Review: మలయాళం స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ చిత్రం పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడిన సంగతి అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఈ సినిమాకు రాజమౌళి కుమారుడు కార్తికేయ నిర్మాతగా వ్యవహరించడం తో పాటు, ప్రీ రిలీజ్ ఈవెంట్ కి జూనియర్ ఎన్టీఆర్ ని ముఖ్య అతిథిగా తీసుకొని రావడం తో , ఈ సినిమా గురించి సోషల్ మీడియా లో […]

Dont Trouble The Trouble Review: మలయాళం స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ చిత్రం పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడిన సంగతి అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఈ సినిమాకు రాజమౌళి కుమారుడు కార్తికేయ నిర్మాతగా వ్యవహరించడం తో పాటు, ప్రీ రిలీజ్ ఈవెంట్ కి జూనియర్ ఎన్టీఆర్ ని ముఖ్య అతిథిగా తీసుకొని రావడం తో , ఈ సినిమా గురించి సోషల్ మీడియా లో చాలా గట్టిగానే చర్చ జరిగింది. కచ్చితంగా ఈ సినిమాలో విషయం ఉండే ఉంటుంది అనే అంచనాలతో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి వాళ్ళ అంచనాలను ఈ సినిమా అందుకుందా లేదా అనేది ఇప్పుడు ఈ రివ్యూ లో చూడబోతున్నాం.

కథ :

సూరి (ఫహద్ ఫాజిల్) అనే ఒక అనాధ , హైదరాబాద్ లో అంబులెన్సు ని నడుపుకుంటూ తన స్నేహితుడు (వెంకటేష్ కాకుమాను) తో కలిసి చాలా సాధారణమైన జీవితాన్ని గడుపుతూ ఉంటాడు . తనని తానూ ఒక గొప్ప మెజీషియన్ గా చెప్పుకుంటే వచ్చే సూరి కి డబ్బు మీద చాలా ఆశ ఉంటుంది. 24 గంటలు డబ్బు ఎలా సంపాదించాలి అనే ఆలోచిస్తూ ఉంటాడు. ఒక పందెం లో మోసం చేయడం తో పాత బస్తీ కి చెందిన అస్లాం భాయ్ (మహేష్ మంజ్రేకర్) గ్యాంగ్ తో కొత్త చిక్కులు తెచ్చుకుంటాడు. తమకు 25 లక్షలు ఇవ్వకపోతే చంపేస్తామని సూరి ని బెదిరిస్తూ ఉంటారు. దాంతో ఏమి చెయ్యాలో అర్థం కాక , ధనవంతుల కుటుంబానికి చెందిన దివ్య (సారా పాలేకర్) అనే చిన్నారి ని కిడ్నాప్ చేసి , ఆమెని విడిచిపెట్టాలంటే కోటి రూపాయిలు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తాడు. కానీ దివ్య కి మేజికల్ పవర్స్ ఉంటాయి, దాంతో సూరి కి కొత్త చిక్కులు వస్తాయి, అసలు దివ్య మనిషా దెయ్యమా?, సూరి ఈ సమస్య నుండి ఎలా బయటపడ్డాడు అనేది వెండితెర మీద చూడాలి.

విశ్లేషణ :

మంచి పొటెన్షియల్ ఉన్న కాన్సెప్ట్ ని చెడగొట్టడం ఎలా అనేది తెలియాలంటే ఈ సినిమాని చూడాల్సిందే. స్క్రీన్ ప్లే ని డైరెక్టర్ చాలా బోరింగ్ గా నడిపించాడు. కామెడీ కోసం గట్టిగానే ప్రయత్నం చేశారు కానీ , అసలు వర్కౌట్ అవ్వలేదు. సినిమా చివరి 20 నిమిషాలు చాలా బాగుంది. కానీ అప్పటి వరకు ఒక చిన్న పాయింట్ ని పట్టుకొని బాగా సాగదీసినట్టుగా అనిపించింది. ఇది కచ్చితంగా డైరెక్టర్ ఫెయిల్యూర్ అని , సినిమాని ఎంటర్టైనింగ్ గా తీయడం లో అతను విఫలం అయ్యాడని చూసిన ప్రతీ ఒక్కరు అంటున్నారు. ఇక ఫహద్ ఫాజిల్ విషయానికి ఎప్పటిలాగానే ఈ సినిమాలో కూడా ఆయన తన నుండి బెస్ట్ ఇచ్చే ప్రయత్నం చేసాడు. కానీ కథ లో దమ్ము లేనప్పుడు ఫహద్ మాత్రం ఏమి చేయగలడు చెప్పండి. అతని డబ్బింగ్ కూడా ఈ సినిమాలో సరిగా కుదర్లేదు. ఫహద్ లాంటి టాలెంటెడ్ ఆర్టిస్టు కి తెలుగు లో మొదటి సినిమాకు ఆశించిన స్థాయి రెస్పాన్స్ రాదనీ చెప్పొచ్చు.

ఓవరాల్ గా ఈ సినిమాకు మేము ఇస్తున్న రేటింగ్ 2/5..ఫహద్ కోసం చూడాలి అనుకుంటే , ఒక్కసారి చూడొచ్చు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper