SS Rajamouli: దర్శక ధీరుడుగా రాజమౌళికి పేరుంది. ఇంతవరకు ఈయనకు అపజయం అంటే తెలియదు. మహేష్ హీరోగా… ప్రియాంక చోప్రా హీరోయిన్ గా రాజమౌళి దర్శకత్వంలో వారణాసి సినిమా రూపొందుతోంది. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదలవుతుంది. వాస్తవానికి నటనలో మహేష్ కు తిరుగులేదు. అయితే అతని నటన గురించి ఇంతవరకు రాజమౌళి తన అభిప్రాయాన్ని బయటపెట్టలేదు. కాకపోతే తొలిసారి తనకు ఏడుపు వచ్చిందని రాజమౌళి వ్యాఖ్యానించారు. అది కూడా డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక మీద..
రాజమౌళి కుమారుడు ఎస్ ఎస్ కార్తికేయ నిర్మాణంలో.. రాజమౌళి మేనల్లుడు శశాంక్ దర్శకత్వంలో.. కాలభైరవ సంగీత దర్శకుడిగా.. రమా రాజమౌళి కాస్ట్యూమ్ డిజైనర్ గా.. రాజమౌళి ప్రజెంటర్ గా వ్యవహరిస్తున్న డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ నేపథ్యంలో దర్శక ధీరుడు రాజమౌళి కొన్ని ఆసక్తికరమైన సంగతులను ఆ వేదిక మీద నుంచి పంచుకున్నారు.. జూనియర్ ఎన్టీఆర్.. ఫహద్.. దర్శకుడు శశాంక్.. చిన్నారి సారా.. తన కుమారుడు కార్తికేయ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను రాజమౌళి పంచుకున్నారు.
“ఒక 50 ఏళ్ల మహిళ నా వద్దకు వచ్చింది. మీరు ఫహద్ సినిమాలు చూస్తారా అని అడిగింది. ఫాఫా అని కూడా చెప్పింది . దీనినిబట్టి ఫహద్ ఫజిల్ మన ప్రేక్షకులకు ఎంత దగ్గరయ్యాడో.. అతని ట్రాన్స్ సినిమా చూసి చాలా ఆనందపడ్డాను. శశాంక్ నా వద్దకు వచ్చాడు. కథ చెప్పడానికి ప్రయత్నించాడు. నా దగ్గర మూడు గంటల సమయం లేదు. జస్ట్ ఒక లైన్లో చెప్పు అన్నాను. ఒక దయాన్ని కిడ్నాప్ చేసిన మనిషి కదా అని చెప్పాడు. దాంతో నా మైండ్లో వందల ప్రశ్నలు తిరుగుతున్నాయి. దయాన్ని కిడ్నాప్ చేయడం ఎలా సాధ్యం.. అనే ప్రశ్న అడిగి కుతూహలంతో మూడు గంటల పాటు కథ విన్నానని” రాజమౌళి వివరించారు.
రాజమౌళి ఏడ్చేశారు
ఈ సినిమా ఫస్ట్ కాఫీ రాజమౌళి చూశారు. సినిమాకు సంబంధించి చాలా సన్నివేశాలను చూసి నవ్వుకున్నారు. అలాగే చాలా సేపు ఏడ్చారు. చివరికి ఏడ్చి ఏడ్చి ఆయన కళ్ళు ఉబ్బిపోయాయి. రమ కూడా రాజమౌళిని చూసి షాక్ అయ్యారు. ఈ చిత్రంలో ఫహద్ కు పోటీగా చిన్నారి సారా నటించింది. ఆమె తన నటనతో ఆకట్టుకుంది. ఇక కార్తికేయ తనదైన శైలిలో ఈ సినిమాకు సంబంధించి వ్యాపారం చేశారు.. తనకు రూపాయి రావాలని కోరుకునే వ్యక్తి అని.. అలాగే తనను నమ్ముకున్న వాళ్ళు లాభపడాలి అని భావించే వ్యక్తి అని రాజమౌళి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. సారా ఉన్నంత మాత్రాన ఇది చిన్న పిల్లల సినిమా కాదని.. చిన్నపిల్లల మనస్తత్వాన్ని ప్రతిబింబించే సినిమా అని రాజమౌళి వివరించారు.
Confirmation from SS Rajamouli:
No Delay…#Dragon is Coming On Time pic.twitter.com/2XUKUpoFeK
— cinee worldd (@Cinee_Worldd) September 29, 2026