Junior NTR: don’t trouble the trouble సినిమా ప్రమోషన్ ను నిర్మాత ఎస్ఎస్ కార్తికేయ గట్టిగానే చేస్తున్నారు. అసలే ఆయన బిజినెస్ మాన్. సినిమా వ్యాపార మెలకువలు తండ్రి ఎస్ ఎస్ రాజమౌళి దగ్గర నుంచి బ్రహ్మాండంగా ఒంట పట్టించుకున్నాడు. తద్వారా తనకంటూ ఒక స్థాయిని ఏర్పరచుకున్నాడు.
కార్తికేయ ప్రస్తుతం డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ సినిమాకు నిర్మాతలలో ఒకరిగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాను తెలుగులో భారీగానే విడుదల చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ విడుదల చేస్తోంది అని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై అధికారికంగా క్లారిటీ రాలేదు. ఈ సినిమాను ఎంతకు అమ్మారు.. ఏ స్థాయిలో బిజినెస్ జరుగుతుంది అనే విషయాలు ఇంతవరకు తెలియ రాలేదు. కాకపోతే తెలుగు చిత్ర ప్రశ్నలు పెద్దపెద్ద ప్లేయర్ల ద్వారా ఈ సినిమాను కార్తికేయ విడుదల చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు దిల్ రాజు.. మైత్రి మూవీ మేకర్స్.. సాయి కొర్రపాటి.. కాలభైరవ.. ఇంక చాలామంది అతిరథ మహారధులు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో తన మాట మీద నమ్మకం ఉంచి ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ కు కార్తికేయ ధన్యవాదాలు తెలియజేశాడు. జూనియర్ ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువేనని.. సభాముఖంగా కృతజ్ఞతలు చెప్పాడు. వేదిక మీద కార్తికేయ మాట్లాడుతుండగానే.. ఎన్టీఆర్.. రాజమౌళి.. పహాడ్ మీద పూల వర్షం కురిపించాడు కార్తికేయ. ఇటువంటి ఆలోచనలు చేయడంలో కార్తికేయ దిట్ట.
వారణాసి సినిమాకు సంబంధించి ఆమధ్య రామోజీ ఫిలిం సిటీ లో జరిగిన ఒక వేడుకలో మహేష్ బాబు ఎద్దు మీద నుంచి వచ్చారు. దీని వెనక ప్లాన్ కార్తికేయదే. త్రిబుల్ ఆర్ సినిమాలో ఇంటర్వెల్ ఫైట్ లో ఎన్టీఆర్ బోన్ నుంచి కిందికి దూకే ఆలోచన కూడా కార్తికేయదే అని చెబుతుంటారు. అలాంటి థాట్ నే ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో అమలు చేశారు. ఆకాశం నుంచి పూలజల్లును రాజమౌళి.. జూనియర్ ఎన్టీఆర్.. ఫహద్ మీద కురిపించారు. కార్తికేయ చేసిన ఈ పని చూసి జూనియర్ ఎన్టీఆర్ కు నోటి వెంట మాట రాలేదు. పైగా తన మీద పూలు కురుస్తుంటే జూనియర్ ఎన్టీఆర్ ఆనందం వ్యక్తం చేశారు.
ఈ పని ద్వారా జూనియర్ ఎన్టీఆర్ మీద తనకున్న ప్రేమను కార్తికేయ మరోసారి ప్రదర్శించారు. వేదిక మీద మాట్లాడుతుండగానే ఈ పూల జల్లు కురవడం కార్తికేయ ప్రేమకు నిదర్శనమని అభిమానులు చర్చించుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఈ వీడియో విపరీతంగా ట్రెండింగ్లో ఉంది. ఫ్రీ రిలీజ్ ఈవెంట్లకు నటులు రావడం.. వారు నాలుగు మాటలు చెప్పడం కొత్త విషయం కాదు. కానీ వచ్చిన అతిధులకు బ్రహ్మాండమైన స్వాగతం పలకడం.. వారు ఆనందపడేలా చేయడం అంత ఈజీ కాదు. ఈ పని చేసి కార్తికేయ తన ప్రత్యేకతను మరోసారి నిరూపించుకున్నాడు. ఇదీ రాజమౌళి కొడుకు అంటే అని ఇండస్ట్రీ పెద్దలకు తన స్టామినా చూపించాడు.
View this post on Instagram