Prabhas: వరుణ్ తేజ్ హీరో గా నటించిన ‘కొరియన్ కనకరాజ్’ చిత్రం రీసెంట్ గానే భారీ లెవెల్ లో విడుదలై మొదటి ఆట నుండే మంచి బ్లాక్ బస్టర్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ ని అందుకుంటూ వస్తున్న వరుణ్ తేజ్ కి ఈ సినిమా సక్సెస్ మంచి బూస్ట్ ని ఇచ్చిందనే చెప్పాలి. 13 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ని జరుపుకున్న ఈ చిత్రానికి, కేవలం రెండు రోజుల్లోనే 9 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఈరోజుటితో బ్రేక్ ఈవెన్ మార్కుని కూడా అందుకోనుంది ఈ చిత్రం. కలెక్షన్స్ సంగతి పక్కన పెడితే , ఈ సినిమా లో కమెడియన్ సత్య సీనియర్ ఎన్టీఆర్ ని ఇమిటేట్ చేస్తూ చేసిన కామెడీ పై సోషల్ మీడియా లో నందమూరి ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
కావాలని ఉద్దేశపూర్వకంగా పీఆర్ టీం తో ఎన్టీఆర్ ‘యుగపురుషుడు’ చిత్రం లోని ఒక సన్నివేశాన్ని విడుదలకు ముందు బాగా వైరల్ చేసి , సినిమాకు ప్రమోషన్ అయ్యేలా చేసారని , ఇది కచ్చితంగా తప్పేనని, ఎట్టిపరిస్థితిలోనూ మూవీ టీం క్షమాపణలు చెప్పి, ఆ సన్నివేశాన్ని తొలగించాలంటూ సోషల్ మీడియా ద్వారా నందమూరి ఫ్యాన్స్ డిమాండ్ చేశారు. కానీ మూవీ టీం అసలు పట్టించుకోలేదు కావాలని ఉద్దేశపూర్వకంగా చేసింది కాదని , ఇంతకు ముందు చాలా మంది హీరోలు గొప్పవాళ్ళని ఇమిటేట్ చేశారని , మేము కూడా ఆ స్పోర్టివ్ స్పిరిట్ తోనే చేశామని వరుణ్ తేజ్ వివరణ ఇచ్చాడు. ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రం గురించి రెబల్ స్టార్ ప్రభాస్ కాసేపటి క్రితమే తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీ లో మాట్లాడడం హాట్ టాపిక్ గా మారింది.
ఆయన మాట్లాడుతూ ‘వరుణ్ తేజ్ , మేర్లపాక గాంధీ , రితిక నాయక్ , సత్య వంటి వారికి ఇలాంటి సూపర్ హిట్ లభించడం నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తోంది. ఈ సందర్భంగా మా యూవీ క్రియేషన్స్ కి , ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు ప్రభాస్. ఒకపక్క సీనియర్ ఎన్టీఆర్ సన్నివేశానికి సంబంధించిన వివాదం కొనసాగుతున్న సమయం లో ప్రభాస్ కూడా ఈ చిత్రం గురించి పాజిటివ్ గా ట్వీట్ వెయ్యడం హాట్ టాపిక్ గా మారింది. యూవీ క్రియేషన్స్ ప్రభాస్ హోమ్ బ్యానర్ అనే సంగతి అందరికీ తెలిసిందే. ఆయన అన్నయ్య ప్రభోద్ , మరియు ప్రభాస్ స్నేహితులు కలిసి ఈ బ్యానర్ ని స్థాపించారు. ఈ బ్యానర్ నుండి ఈ సినిమా విడుదలైనా ప్రభాస్ నుండి కచ్చితంగా పోస్ట్ పడాల్సిందే , అలా ‘కొరియన్ కనకరాజ్’ గురించి కూడా వేసాడు.