Deepika Padukone: పాన్ ఇండియా లెవెల్ లో లేడీ సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్న హీరోయిన్స్ లిస్ట్ తీస్తే, అందులో దీపికా పదుకొనే పేరు కచ్చితంగా ఉంటుంది. ఈమె పేరు ని చూసి థియేటర్స్ కి కదిలే ఆడియన్స్ లక్షల్లోనే ఉంటుంది. ఆమెకంటే ఒక ఫ్యాన్ బేస్ ఉంది, కచ్చితంగా ఆమె ఓపెనింగ్స్ కి ఉపయోగపడుతుంది, లాంగ్ రన్ లో కూడా ఆమె ప్రభావం ఉంటుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అయినా, ఒక మేల్ సూపర్ స్టార్ కి ఉన్నంత క్రౌడ్ పుల్లింగ్ కెపాసిటీ ఉండదు కదా. భేదభావాలు పక్కన పెడితే, అదే నిజం. ఉదాహరణకు ‘స్పిరిట్’ వివాదాన్నే తీసుకుందాం. ప్రభాస్ , సందీప్ వంగ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం లో హీరోయిన్ పాత్ర కోసం ముందుగా దీపికా పదుకొనే ని సంప్రదించారు. ఆమె నటించేందుకు ఒప్పుకుంది, ఏడాదిన్నర పాటు సందీప్ వంగ తో స్టోరీ డిస్కషన్స్ లో కూడా కూర్చుంది.
కానీ రెమ్యూనరేషన్ విషయం లో విభేదించి ఈ సినిమా నుండి తప్పుకుంది. ఆ తర్వాత ఆమె తన పీఆర్ టీం తో స్టోరీ ని లీక్ చేసినందుకు, సందీప్ వంగ ఆమెపై ఫైర్ అవుతూ కొన్ని పోస్టులు కూడా వేశాడు. అది అప్పట్లో పెద్ద కాంట్రవర్సీ అయ్యింది. అయితే ఈ అంశం పై రీసెంట్ దీపికా పదుకొనే ఒక ఈవెంట్ లో మాట్లాడుతూ ‘ఈమధ్యనే ఒక పెద్ద హీరో సినిమాలో నటించే అవకాశం వచ్చింది. రెమ్యూనరేషన్ నా రేంజ్ కి తగ్గ అడిగాను. ఆ హీరో కంటే నా ట్రాక్ రికార్డు గొప్పది, బ్రాండ్ పెద్దది కాబట్టే డిమాండ్ చేశాను. కానీ మేకర్స్ మేము ఆ హీరో కి ఇంత రెమ్యూనరేషన్ ఇస్తున్నాము, మీకు ఇంత మాత్రమే ఇవ్వగలం అని చెప్పారు. అయితే నాకు వర్కౌట్ అవ్వదు లేండి అని చెప్పి తప్పుకున్నాను’ అని చెప్పుకొచ్చింది దీపికా పదుకొనే.
ఇంతకీ ఆమె డిమాండ్ చేసిన రెమ్యూనరేషన్ ఏ రేంజ్ లో ఉందంటే, ప్రభాస్ తో సమానమైన రెమ్యూనరేషన్ ఇవ్వడమే కాకుండా, సినిమా బిజినెస్ లో 10 శాతం వాటా అడిగింది. అంతే కాకుండా కేవలం 6 గంటలు మాత్రమే పని చేస్తానని, అంతకు మించి చేసేది లేదని తెగేసి చెప్పింది. ప్రభాస్ తో సమానమైన రెమ్యూనరేషన్ అడిగేంత సత్తా దీపికా పదుకొనే కి ఉందా?, ప్రభాస్ ఊరు పేరు లేని డైరెక్టర్ తో సినిమా చేసినా , మొదటి రోజు అవలీలగా 100 కోట్ల గ్రాస్ ఓపెనింగ్ పెట్టగలడు. రాజాసాబ్ చిత్రం అందుకు బెస్ట్ ఉదాహరణ. కానీ దీపికా లేడీ ఓరియెంటెడ్ సినిమాకు కేవలం ఆమె బ్రాండ్ మీద 100 కోట్ల గ్రాస్ ఓపెనింగ్ పెట్టేంత సత్తా ఉందా?, మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపం లో తెలియజేయండి.
View this post on Instagram