Mahesh Babu Birthday: నేడు సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా టాలీవుడ్ సెలబ్రిటీలందరూ ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియా లో పోస్టులు వేస్తున్నారు. చిరంజీవి , పవన్ కళ్యాణ్ , జూనియర్ ఎన్టీఆర్ వంటి వారు మహేష్ బాబు కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ వేసిన ట్వీట్లు బాగా వైరల్ అయ్యాయి. అభిమానులు ఈ ట్వీట్స్ కి ఎంతో సంతోషిస్తున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ వేసిన ట్వీట్ కి మహేష్ బాబు ఫ్యాన్స్ లోని ఆనందం కట్టలు తెంచుకుంది. స్పెషల్ గా మహేష్ బాబు చేసే చారిటీ ని పవన్ కళ్యాణ్ మెచ్చుకుంటూ , వారణాసి కోసం అందరి లాగానే నేను కూడా ఎదురు చూస్తున్నాను వంటి కామెంట్స్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. టాలీవుడ్ టాప్ 2 హీరోలుగా పిలవబడే ఈ ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఈ అనుబంధాన్ని చూసి , ఇరువురి హీరోల అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
ఇక అభిమానుల సంబరాల గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. నేడు మహేష్ పుట్టినరోజు సందర్భంగా , ఆయన కెరీర్ లో మైల్ స్టోన్ గా నిల్చిన ‘దూకుడు’ చిత్రాన్ని గ్రాండ్ గా రీ రిలీజ్ చేశారు. ఫ్యాన్స్ థియేటర్స్ లో మహేష్ కొత్త సినిమాకు ఏ విధంగా అయితే సంబరాలు చేసుకుంటారో , అంతకు మించి దూకుడు రీ రిలీజ్ కి సంబరాలు చేసుకుంటున్నారు. కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ తోనే 2 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రానికి , మొదటి రోజు మొత్తం కలిపి 3 నుండి 4 కోట్ల రూపాయిల మధ్యలో గ్రాస్ వసూళ్లు వస్తాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.
ఇదంతా పక్కన పెడితే పశ్చిమ గోదావరి జిల్లాలోని నర్సాపురం లోని ఒక థియేటర్ లో దూకుడు మూవీ ని రీ రిలీజ్ చేయగా, జనసేన పార్టీ ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ ని మహేష్ అభిమానులు ముఖ్య అతిథిగా స్వాగతించారు. ఈ సంబరాల్లో పాల్గొని , అభిమానుల సమక్షం లో కేక్ కట్ చేసిన బొమ్మిడి నాయకర్, ఫ్యాన్స్ పట్టుకొచ్చిన ‘బాబు తర్వాతే ఎవరైనా ‘ అనే బ్యానర్ ని పట్టుకొని ఫోటోలకు ఫోజులు ఇచ్చాడు బొమ్మిడి నాయకర్. దీని పై మహేష్ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తుంటే , పవన్ ఫ్యాన్స్ మాత్రం బొమ్మిడి నాయకర్ పై తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అసలు బ్యానర్ మీద ఏమి రాసున్నారో కూడా చూసుకోకుండా , ఇలాంటివి ఎలా చేస్తాడు అంటూ ఆయనపై మండిపడుతున్నారు. సోషల్ మీడియా లో సంచలనం రేపుతున్న ఈ ఫోటో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.
Narsapuram Janasena MLA… #Varanasi @urstrulyMahesh pic.twitter.com/iT3QQ6SrfN
— Nikhil_Prince (@Nikhil_Prince01) August 9, 2026