Homeఆధ్యాత్మికంToday 10 August 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారు ఈ రోజు జాగ్రత్త..

Today 10 August 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారు ఈ రోజు జాగ్రత్త..

Today 10 August 2026 Horoscope: జ్యోతిష శాస్త్రం ప్రకారం సోమవారం ద్వాదశ రాశులపై ఆరుద్ర నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు అనుకోకుండానే ధన లాభం ఉండనుంది. మరికొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.. మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి ఉద్యోగులకు ఈరోజు కార్యాలయంలో అనుకూలమైన వాతావరణం ఉంటుంది. తోటి వారి సహకారం ఉండడంతో […]

Today 10 August 2026 Horoscope: జ్యోతిష శాస్త్రం ప్రకారం సోమవారం ద్వాదశ రాశులపై ఆరుద్ర నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు అనుకోకుండానే ధన లాభం ఉండనుంది. మరికొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి ఉద్యోగులకు ఈరోజు కార్యాలయంలో అనుకూలమైన వాతావరణం ఉంటుంది. తోటి వారి సహకారం ఉండడంతో కొన్ని ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. స్నేహితుల సహాయంతో అప్పులను తీరుస్తారు. మహాశివుడి ఆశీస్సులు ఉండడంతో వ్యాపారులకు ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు ఉంటాయి.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు డబ్బును ఈరోజు ఎవరికీ అప్పుగా ఇవ్వద్దు. ఎందుకంటే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అనవసరపు ఖర్చులకు కూడా దూరంగా ఉండాలి. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఇలాంటి సమయంలోనే తమ నైపుణ్యాన్ని ప్రదర్శించడం ద్వారా కాస్త ఉపశమనం ఉండే అవకాశం ఉంది. వ్యాపారులు కొత్త వ్యక్తులను అప్పుడే నమ్మకుండా ఉండాలి.

మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి ఈరోజు మెరుగుపడుతుంది. గతంలో కంటే ఇప్పుడు అనుకున్న పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సివస్తుంది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లడం వల్ల కొన్ని ముఖ్యమైన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు ఈరోజు పిల్లల కెరీర్ విషయంలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఎవరికైనా అనవసరపు వాగ్దానాలు ఇవ్వద్దు. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. అయితే ఉచితంగా వచ్చే డబ్బు కోసం ఆశపడొద్దు. సమాజంలో గుర్తింపు లభిస్తుంది.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారు ఈ రోజు కార్యాలయాల్లో ప్రశంసలు పొందే అవకాశం ఉంది. కొందరు పదోన్నతులు పొందుతారు. వ్యాపారులకు అన్నిట్లోనూ శుభ ఫలితాలు రానున్నాయి. కుటుంబ సభ్యుల మద్దతు ఉండడంతో అధిక లాభాలు పొందుతారు. ఆరోగ్య విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలి. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు.

కన్య రాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారు ఈ రోజు బడ్జెట్ నిర్వహణలో సమర్థవంతంగా ఉంటారు. కొన్ని ఖర్చులకు దూరంగా ఉంటారు. ఉద్యోగులకు అదనపు ఆదాయం ఏర్పడుతుంది. వ్యాపారులకు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. కుటుంబ సభ్యుల మద్దతు ఉండడంతో లాభాలు పెరుగుతాయి. ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. స్నేహితులతో సరదాగా ఉంటారు. విహారయాత్రలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు కొత్త ప్రాజెక్టులను చేపడతారు. వ్యాపార నిర్ణయాలు తీసుకునేటప్పుడు పెద్దలను సంప్రదించడం మంచిది. ఆరోగ్య విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉండకూడదు. వ్యాపారులు ఆదాయాన్ని పెంచుకుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు ఈరోజు తోటి వారితో సంయమనం పాటిస్తారు. ప్రణాళిక ప్రకారం ఖర్చు చేయడం వల్ల అదనపు ఖర్చు ఉండదు. పొదుపు విషయంలో ప్రత్యేక నిర్ణయాలు తీసుకుంటారు. కొన్ని సమస్యలకు ఈ రోజు పరిష్కారం లభిస్తుంది. వ్యాపారులు దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఇవి ఆర్థిక ప్రయోజనాలను ఇస్తాయి. అనవసరపు వివాదాల్లోకి తలదూర్చకుండా ఉండాలి.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారికి ఈ రోజు అన్ని రకాలుగా కలిసివస్తుంది. కొందరికి మహాశివుడు ఆశీస్సులు ఉండడంతో ముఖ్యమైన ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేస్తారు. లక్ష్యాలను సాధించేందుకు తోటి వారి సహకారం తీసుకుంటారు. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. శుభకార్యాలు నిర్వహించేందుకు సిద్ధమవుతారు.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఇంటికి సంబంధించిన వస్తువులను కొనుగోలు చేస్తారు. జీవిత భాగస్వామితో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. అయితే సొంత వాహనాలపై వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. పూర్వీకుల ఆస్తికి సంబంధించి శుభవార్తలు వింటారు. ఉద్యోగులకు కార్యాలయాల్లో కలిసి వస్తుంది.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారికి ఈ రోజు అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది. వ్యాపారులకు తోటి వారి సహకారం ఉండటం వల్ల అధిక లాభాలు పొందుతారు. ఉద్యోగులు అనుకున్న ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేస్తారు. ఎవరికైనా డబ్బు ఇచ్చే ముందు ఆలోచించాలి. తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు ఈ రోజు మానసిక ఒత్తిడి నుంచి బయటపడతారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తారు. కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టులను పూర్తి చేయడానికి తోటి వారి సహకారం తీసుకుంటారు. కుటుంబ సభ్యుల సహకారంతో అన్ని పనులను పూర్తి చేస్తారు. అనుకోని అదృష్టం ఉండడంవల్ల వ్యాపారులో ఎక్కువ లాభాలు పొందుతారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper