Prabhas: బాహుబలి సినిమాతో పాన్ ఇండియాలో పెను సంచలనాన్ని క్రియేట్ చేసిన నటుడు ప్రభాస్… ఈ ఒక్క సినిమాతో ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే నెంబర్ వన్ హీరోగా మారిపోయాడు. ప్రస్తుతం ప్రభాస్ ని మించిన హీరో మరెవరు లేరనేది వాస్తవం… ఇప్పటివరకు తను చేసిన సినిమాలన్నీ అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టినవే కావడం విశేషం…ఇక ఇదిలా ఉంటే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని సైతం తనవైపు తిప్పుకున్న ప్రభాస్ వరుస విజయాలను దక్కించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ తను క్రియేట్ చేసిన సంచలనం అంతా ఇంతా కాదు… ప్రస్తుతం ఆయన హను రాఘవపూడి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. అలాగే సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం లో స్పిరిట్ సినిమాని కంప్లీట్ చేశాడు. ఇక ఏది ఏమైనా కూడా ఈ రెండు సినిమాలతో తన సత్తా ఏంటో చూపించాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఫౌజీ సినిమా డిసెంబర్ మూడోవ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధిస్తాననే కాన్ఫిడెంట్ ను వ్యక్తం చేస్తున్నాడు. ప్రభాస్ ఒక నటుడి విషయంలో మాత్రం చాలా వరకు కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు.
తనను టాప్ ఆర్టిస్టుగా మార్చడానికి ప్రభాస్ విపరీతంగా శ్రమించాడు అంటూ గతంలో కొన్ని వార్తలైతే వచ్చాయి. ఇంతకీ ఆ నటుడు ఎవరు అంటే ప్రభాస్ శ్రీను కావడం విశేషం…కమెడియన్ గా విలన్ గా వైవిద్య భరితమైన పాత్రలను పోషిస్తున్న శ్రీను విషయంలో ప్రభాస్ చాలావరకు ఎక్కువ కేర్ తీసుకున్నాడు.
ప్రభాస్ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ లో నటనకు సంబంధించిన మేలుకువలు నేర్చుకుంటున్నప్పుడు ప్రభాస్ శ్రీను కూడా అక్కడే యాక్టింగ్ నేర్చుకున్నాడు. తద్వారా వీళ్ళిద్దరు చాలా మంచి ఫ్రెండ్స్ గా మారారు. ఇక అప్పటినుంచి ప్రభాస్ శ్రీను సైతం ప్రభాస్ తోనే ట్రావెల్ చేయడం మొదలుపెట్టాడు.
ఈ క్రమంలోనే ప్రభాస్ డేట్స్ చూస్తూ ప్రభాస్ పక్కనే ఉన్నాడు. తద్వారా తనని కూడా ఆర్టిస్ట్ గా సెట్ చేయాలని ప్రభాస్ అనుకొని అతనికి ఇతర దర్శకుల దగ్గర అవకాశాలను ఇప్పించే ప్రయత్నం చేశాడు… ప్రస్తుతం ఇండస్ట్రీలో విలన్ క్యాటగిరి లో ఉన్నవారిలో ప్రభాస్ శ్రీను కూడా ఒకరుగా ఉండటం విశేషం…