Kalki 2: తెలుగు చలన చిత్ర పరిశ్రమ చిరస్థాయిగా గుర్తుపెట్టుకుని సినిమాల్లో ఒకటి ‘కల్కి 2898 AD’. ప్రభాస్ హీరో గా నాగ్ అశ్విన్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ వెండితెర అద్భుతం , బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద విస్ఫోటనమే సృష్టించింది. మొదటి ఆట నుండే అద్భుతమైన పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రానికి, ఫుల్ రన్ లో ప్రపంచవ్యాప్తంగా 1100 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవర్సీస్ మార్కెట్ లో అయితే ఈ సినిమా రికార్డ్స్ ని పుష్ప2 కూడా అందుకోలేక పోయింది. అలాంటి సినిమాకు సీక్వెల్ అంటే అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. రీసెంట్ గానే ఈ సినిమాకు సంబంధించిన సీక్వెల్ ని మొదలు పెట్టాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. షూటింగ్ జెట్ స్పీడ్ లో వెళ్తోంది, కచ్చితంగా వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని అంతా అనుకున్నారు.
అయితే దీనిపై రీసెంట్ గానే ఒక ఇంటర్వ్యూ లో నాగ్ అశ్విన్ స్పందించాడు. ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు ‘కల్కి 2’ కి సంబంధించిన షూటింగ్ కేవలం 10 రోజులు మాత్రమే జరిగిందని చెప్పుకొచ్చాడు. ఈ షూటింగ్ లో ఇప్పటి వరకు కేవలం అమితాబ్ బచ్చన్ , కమల్ హాసన్ మాత్రమే పాల్గొన్నారని , ప్రభాస్ ప్రస్తుతం స్పిరిట్, ఫౌజీ చిత్రాల షూటింగ్స్ లో బిజీ గా ఉన్నాడని , అవి పూర్తి అయ్యాక ‘కల్కి 2’ సెట్స్ లోకి అడుగుపెడుతాడని చెప్పుకొచ్చాడు నాగ్ అశ్విన్. దీంతో వచ్చే ఏడాది కచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందనుకున్న అభిమానులకు నిరాశే మిగిలింది. అయితే ఈలోపు ప్రీ ప్రొడక్షన్ వర్క్ తో పాటు , ఫైనల్ క్యాస్టింగ్ ని కూడా ఫిక్స్ చేసే పనిలో పడ్డాడట డైరెక్టర్ నాగ్ అశ్విన్.
ఈ చిత్రం నుండి దీపికా పదుకొనే తప్పుకోవడం తో , ఆమె స్థానం లోకి సాయి పల్లవి ని తీసుకున్నారు అంటూ సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున ఒక ప్రచారం జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. కానీ అందులో ఎలాంటి నిజం లేదట. ఇంకా హీరోయిన్ ఎంపిక కోసం వేట జరుగుతూనే ఉందట. అదే విధంగా మొదటి భాగం లో మహాభారతం ఎపిసోడ్ ని కేవలం 5 నిమిషాలు మాత్రమే చూపించారు. కానీ సీక్వెల్ లో ఏకంగా 30 నిమిషాల పాటు మహాభారతం ని చూపించబోతున్నారట. కేవలం 5 నిమిషాలకే వెయ్యి కోట్ల గ్రాస్ వచ్చిందంటే, ఇక 30 నిమిషాలకు ఏ రేంజ్ గ్రాస్ వస్తుందో మీరే ఊహించుకోండి.