Sandeep Reddy Vanga: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనివిని ఎరుగని రీతిలో గొప్ప విజయాలను సాధిస్తున్న దర్శకులు చాలామంది ఉన్నప్పటికి సందీప్ రెడ్డి వంగ కి ఉన్న గుర్తింపు నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. ప్రస్తుతం ఆయన ప్రభాస్ తో స్పిరిట్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో పాటుగా ‘రోమాంచకం’ అనే ఒక చిన్న సినిమాని వల్ల బ్యానర్ నుంచి ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే వీళ్ళ బ్యానర్ నుంచి వస్తున్న ఈ సినిమా వచ్చేవారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఇలాంటి సందర్భంలో సినిమాకు సంబంధించిన ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. అందులో భాగంగానే సందీప్ రెడ్డివంగా మొదటి సారి మా బ్యానర్ లో వస్తున్న సినిమాకి యూబైఏ సర్టిఫికెట్ వచ్చింది అంటూ రిపోర్టర్స్ కి చెప్పాడు.
దాంతో రిపోర్టర్ సైతం స్పిరిట్ సినిమా కూడా ఇదే వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? అన్నప్పుడు సందీప్ సమాధానం చెబుతూ స్పిరిట్ సినిమా ఎలా ఉన్న కూడా వాళ్ళు ఏ సర్టిఫికెట్ ఇస్తారు. కేవలం ఈ ఒక్క సినిమాకు మాత్రం యూబైఏ సర్టిఫికెట్ వచ్చింది అంటూ చెప్పారు. ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఎందుకంటే సందీప్ నుంచి ఒక సినిమా వచ్చిందంటే చాలా ప్రేక్షకుల్లో విశేషమైన అటెన్షన్ క్రియేట్ అవుతుంది. ఆయన సినిమాల్లో బోల్డ్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందని చాలా మంది చాలా రకాల కామెంట్స్ చేస్తుంటారు. కాబట్టి వాళ్లందరికి షాక్ ఇస్తూ ఆయన కొన్ని కామెంట్లు చేశాడు. ఇక ఏది ఏమైనా కూడా సందీప్ రెడ్డి వంగ రాబోయే స్పిరిట్ సినిమాలో ప్రభాస్ ని ఎలా చూపిస్తాడు.
తను ఏ రేంజ్ సక్సెస్ ని సాధించబోతున్నాడనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ఇక ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సక్సెస్ లు సాధించిన కూడా సందీప్ రెడ్డి వంగ కి వచ్చిన గుర్తింపు ఏ స్టార్ డైరెక్టర్ కి లేదనే చెప్పాలి…