Homeఎంటర్టైన్మెంట్Irumudi Movie: 'ఇరుముడి' కి తలనొప్పిగా మారిన మరో కొత్త సవాల్.. ఇలా అయితే థియేట్రికల్...

Irumudi Movie: ‘ఇరుముడి’ కి తలనొప్పిగా మారిన మరో కొత్త సవాల్.. ఇలా అయితే థియేట్రికల్ రన్ కష్టమే!

Irumudi Movie: మాస్ మహారాజ రవితేజ నటించిన ‘ఇరుముడి’ చిత్రం బాక్స్ ఆఫీస్ వసూళ్ల సునామీ ఇప్పట్లో ఆగే సూచనలు కనిపించడం లేదు. ఈమధ్య కాలం లో గొప్ప గొప్ప పాన్ ఇండియన్ సినిమాలు కూడా వీకెండ్ తర్వాత చల్లారిపోతున్నాయి. మళ్లీ మరో వీకెండ్ వచ్చే వరకు ఎంత పాన్ ఇండియన్ సినిమా అయినా చిల్లర వసూళ్లను ఏరుకోవడమే. అలాంటి పరిస్థితులు ఉన్న ఈరోజుల్లో, ‘ఇరుముడి’ చిత్రానికి వర్కింగ్ డేస్ లో కూడా కళ్ళు చెదిరిపోయే రేంజ్ […]

Irumudi Movie: మాస్ మహారాజ రవితేజ నటించిన ‘ఇరుముడి’ చిత్రం బాక్స్ ఆఫీస్ వసూళ్ల సునామీ ఇప్పట్లో ఆగే సూచనలు కనిపించడం లేదు. ఈమధ్య కాలం లో గొప్ప గొప్ప పాన్ ఇండియన్ సినిమాలు కూడా వీకెండ్ తర్వాత చల్లారిపోతున్నాయి. మళ్లీ మరో వీకెండ్ వచ్చే వరకు ఎంత పాన్ ఇండియన్ సినిమా అయినా చిల్లర వసూళ్లను ఏరుకోవడమే. అలాంటి పరిస్థితులు ఉన్న ఈరోజుల్లో, ‘ఇరుముడి’ చిత్రానికి వర్కింగ్ డేస్ లో కూడా కళ్ళు చెదిరిపోయే రేంజ్ గ్రాస్ వసూళ్లు నమోదు అవుతున్నాయంటే,సాధారణమైన విషయం కాదు. పుష్ప 2, #RRR , ఓజీ వంటి చిత్రాలకు కూడా ఈ రేంజ్ గ్రాస్ వసూళ్లు చూడలేదని, 100 ఏళ్లకు ఒకసారి ఇలాంటి అద్భుతమైన సెన్సేషనల్ బ్లాక్ బస్టర్స్ వస్తుంటాయని, ట్రేడ్ విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు.

9 వ రోజున కూడా ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల నుండి 8 కోట్ల 35 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇప్పటి వరకు వందేళ్ల తెలుగు చలన చిత్ర చరిత్ర లో ఒక మీడియం రేంజ్ బడ్జెట్ మూవీ కి ఈ రేంజ్ డైలీ కలెక్షన్స్ రావడం ఎప్పుడు చూడలేదని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఓవరాల్ గా ఇప్పటి వరకు ఈ చిత్రానికి 95 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు, 161 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. మరో నాలుగు వారాల పాటు ఈ చిత్రం ఎలాంటి ఢోకా లేకుండా థియేటర్స్ లో భారీ గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ చిత్రానికి ఒక పెద్ద సవాల్ ఒకటి ఎదురైంది. ఈ సినిమా హిట్ అవుతుందని నిర్మాతలు కూడా గట్టిగా నమ్మారు కానీ, ఈ రేంజ్ హిట్ అవుతుందని మాత్రం ఊహించలేదు.

అందుకే విడుదలకు ముందు నెట్ ఫ్లిక్స్ సంస్థకు కేవలం 14 కోట్ల రూపాయలకు ఈ చిత్రాన్ని అమ్మేశారు. ఒప్పందం ప్రకారం థియేటర్స్ లో విడుదలైన నాలుగు వారాల తర్వాత నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేసుకునే అవకాశం మేకర్స్ ఇవ్వాలి. అయితే ఈ సినిమా థియేట్రికల్ రన్ మాత్రం ఇప్పుడు అద్భుతంగా ఉంది. మరో 100 కోట్ల గ్రాస్ వసూళ్లను లాంగ్ రన్ లో రాబట్టే అవకాశాలు ఈ చిత్రానికి పుష్కలంగా ఉన్నాయి. ఇలాంటి సమయం లో సెప్టెంబర్ 18 న ఈ చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేస్తే, భారీ నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. థియేట్రికల్ రన్ ఆగిపోవచ్చు, అందుకే మేకర్స్ ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ సంస్థ తో చర్చలు జరిపి, ఓటీటీ విడుదల తేదీని పొడిగించే ప్రయత్నం చేస్తున్నారట. మరి నెట్ ఫ్లిక్స్ సంస్థ అందుకు ఒప్పుకుంటుందో లేదో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper