Bigg Boss 10 Telugu: సరిగ్గా వారం రోజుల్లో ‘బిగ్ బాస్ 10’ మొదలు కానుంది. గతం లో ఏ సీజన్ కి కూడా లేనటువంటి బజ్ ఈ సీజన్ కి ఏర్పడింది. అందుకు ముఖ్య కారణం గత సీజన్ కి బిగ్ బాస్ హిస్టరీ లోనే అత్యధిక టీఆర్ఫీ రేటింగ్స్ రావడమే. అందుకే ఈ సీజన్ ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు మేకర్స్. అందులో భాగంగా నిర్వహించిన ‘అగ్ని పరీక్ష 2’ కి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. గత సీజన్ తో పోలిస్తే , ఈ సీజన్ లో సామాన్యులు ఒక్కొక్కరు చాకులు లాగా ఉన్నారు. వీళ్ళ టాలెంట్ ని చూసిన తర్వాత ‘పాపం, బిగ్ బాస్ హౌస్ లో సెలబ్రిటీల పరిస్థితి ఏంటో’ అనే ఫీలింగ్ నెటిజెన్స్ లో కలుగుతోంది. అయితే ఇప్పటికే ఈ షో లో పాల్గొనబోయే సెలబ్రిటీల జాబితా ని మనమంతా చూశాము. వీరిలో ఎవరెవరికి ఎంత రెమ్యూనరేషన్ ఇస్తున్నారో ఇప్పుడు ఈ స్టోరీ లో చూడబోతున్నాం.
ముందుగా ‘జబర్దస్త్’ పాపులర్ కమెడియన్ ఆటో రాంప్రసాద్ గురించి మాట్లాడుకోవాలి. ఈ సీజన్ లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ అందరికంటే, మంచి ఫ్యాన్ బేస్ ఉన్న కంటెస్టెంట్ ఈయనే. ఒక మాటలో చెప్పాలంటే, ఒకానొక దశలో ‘జబర్దస్త్’ షో ని తన భుజాలపై నడిపించాడు. అలాంటి సత్తా ఉన్న సెలబ్రిటీ కాబట్టే, ఈయనకు వారానికి 4 లక్షల రూపాయిల రెమ్యూనరేషన్ ఇవ్వడానికి ఒప్పుకున్నారు మేకర్స్. అంటే 15 వారాలు హౌస్ లో ఉంటే 60 లక్షలు వస్తాయి అన్నమాట. అందరికంటే ఈయనకే ఎక్కువ రెమ్యూనరేషన్ ఇస్తున్నారని టాక్. ఇక ఆ తర్వాతి స్థానం లో యాంకర్ వర్షిణి నిల్చినట్టు తెలుస్తోంది. ఈమెకు వారానికి రెండున్నర లక్షల రూపాయిల రెమ్యూనరేషన్ ఇవ్వడానికి ఒప్పుకున్నారట మేకర్స్.
ఇక మూడవ స్థానంలో నిల్చిన కంటెస్టెంట్ ముకేశ్ గౌడ. ఇతనికి 2 లక్షల రూపాయిల రెమ్యూనరేషన్ ఇవ్వడానికి ఒప్పుకున్నారట మేకర్స్. ఫ్యామిలీ ఆడియన్స్, ఫిమేల్ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ఉన్న కారణంగానే, ఆయనకు ఇంత రెమ్యూనరేషన్ ఇస్తున్నట్టు తెలుస్తోంది. అదే విధంగా సీరియల్ హీరోయిన్స్ దేబ్ జాన్, చైత్ర లకు కూడా వారానికి చెరో రెండు లక్షల రూపాయిల రెమ్యూనరేషన్ ఇవ్వబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఇక జబర్దస్త్ పొట్టి నరేష్, కృష్ణుడు వంటి వారికి వారానికి ఒకటిన్నర లక్షలు ఇవ్వడానికి మేకర్స్ ఒప్పుకున్నారని టాక్. మిగిలిన కంటెస్టెంట్స్ కృష్ణుడు, ఆదాం టాక్స్ సుధీర్, ఆదిత్ ఈశ్వరన్ , టెంపర్ వంశీ వంటి వారికి కూడా చెరో ఒకటిన్నర లక్షల రూపాయిల రెమ్యూనరేషన్ ఇవ్వబోతున్నారట.