Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు త్వరలోనే ఫ్యూజులు ఎగిరిపోయే రేంజ్ అప్డేట్ రాబోతుంది. ఇక పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయిపోయాడు , ఆయన నుండి సినిమాలు రావడం కష్టమే , ఓజీ 2 నే పవన్ కళ్యాణ్ చివరి చిత్రం కావొచ్చు అంటూ సోషల్ మీడియా లో అనేక ఊహాగానాలు మొదలయ్యాయి. కానీ అందులో ఎలాంటి నిజం లేదని లేటెస్ట్ గా ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న కొన్ని వార్తలు వింటుంటే తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే సమంత భర్త రాజ్ నిడిమోరు పవన్ కళ్యాణ్ కోసం ఒక పవర్ ఫుల్ సబ్జెక్టు ని రెడీ చేసాడట. త్వరలోనే పవన్ కళ్యాణ్ ని కలిసి ఈ కథ ని వినిపించబోతున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో ఒక వార్త బలంగా వినిపిస్తోంది. రాజ్ & డీకే సామాన్యమైన దర్శకులు కూడా.
రీసెంట్ గానే రాజ్ కథ అందించిన ‘మా ఇంటి బంగారం’ చిత్రం కమర్షియల్ గా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. అదే విధంగా పాన్ ఇండియా లెవెల్ మూవీ లవర్స్ ని అమితంగా ఆకర్షించిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ కి దర్శకత్వం వహించింది వీళ్ళిద్దరే. దీంతో పాటు బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ తో వీళ్ళు తెరకెక్కించిన ‘ఫర్జీ’ అనే వెబ్ సిరీస్ కూడా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిల్చింది. ఈ రెండు వెబ్ సిరీస్ లకు అమెజాన్ ప్రైమ్ వీడియో లో అత్యధిక వ్యూస్ వచ్చాయట. కేవలం వెబ్ సిరీస్ లు మాత్రమే కాదు , బాలీవుడ్ లో స్త్రీ , స్త్రీ 2 వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్స్ కి కూడా వీళ్ళు కథని అందించారు. అలాంటి పొటెన్షియల్ ఉన్న డైరెక్టర్స్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.
ఒకవేళ పవన్ కళ్యాణ్ ఒప్పుకొని ఈ సినిమా చేస్తే మాత్రం , కచ్చితంగా ఓజీ 2 ని మించిన క్రేజ్ ఈ చిత్రానికి దక్కుతుంది అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇలాంటి సబ్జెక్టు ఓరియెంటెడ్ సినిమాలకు మార్కెట్ లో మామూలు రేంజ్ క్రేజ్ లేదు. అలాంటి సినిమాలు పవన్ కళ్యాణ్ లాంటి సూపర్ స్టార్ తో చేస్తే , బాక్స్ ఆఫీస్ రేంజ్ ఆకాశమే హద్దు అనేలా ఉంటుంది. మరి ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళ్తుందా లేదా అనేది రాబోయే రోజుల్లో చూడాలి. ఇకపోతే గత 20 రోజుల నుండి కేరళ లో చికిత్స తీసుకుంటున్న పవన్ కళ్యాణ్ నేడే ఆంధ్ర ప్రదేశ్ కి తిరిగొచ్చాడు. ఇక ఎప్పటి లాగానే ఆయన రాజకీయ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనబోతున్నాడు.