Homeఎంటర్టైన్మెంట్Nataraj Master: 'నోరు అదుపులో పెట్టుకో' అంటూ బిందు మాధవి కి నటరాజ్ మాస్టర్ స్ట్రాంగ్...

Nataraj Master: ‘నోరు అదుపులో పెట్టుకో’ అంటూ బిందు మాధవి కి నటరాజ్ మాస్టర్ స్ట్రాంగ్ కౌంటర్.. వీడియో వైరల్..

Nataraj Master: భారీ అంచనాల నడుమ రీసెంట్ గా మొదలైన ‘అగ్ని పరీక్ష 2’ షో వివాదాల నడుమ సాగుతోంది. ముఖ్యంగా జడ్జీలు గా వ్యవహరిస్తున్న నవదీప్ , బిందు మాధవి , అభిజిత్ లపై , అదే విధంగా యాంకర్ గా శ్రీముఖి పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. సామాన్యులకు బిగ్ బాస్ లాంటి భారీ రియాలిటీ షో లో అవకాశం ఇవ్వడం మంచిదే. కానీ వాళ్ళను మనుషులుగా వీళ్ళు అసలు చూడడం లేదు, చాలా […]

Nataraj Master: భారీ అంచనాల నడుమ రీసెంట్ గా మొదలైన ‘అగ్ని పరీక్ష 2’ షో వివాదాల నడుమ సాగుతోంది. ముఖ్యంగా జడ్జీలు గా వ్యవహరిస్తున్న నవదీప్ , బిందు మాధవి , అభిజిత్ లపై , అదే విధంగా యాంకర్ గా శ్రీముఖి పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. సామాన్యులకు బిగ్ బాస్ లాంటి భారీ రియాలిటీ షో లో అవకాశం ఇవ్వడం మంచిదే. కానీ వాళ్ళను మనుషులుగా వీళ్ళు అసలు చూడడం లేదు, చాలా పొగరుగా వ్యవహరిస్తున్నారు అంటూ వీళ్లపై నెటిజెన్స్ మండిపడుతున్నారు. ఇప్పుడు వీళ్ళని విమర్శించే వాళ్ళ జాబితాలోకి నటరాజ్ మాస్టర్ కూడా చేరిపోయాడు. పూర్తి వివరాలు చూస్తే , నిన్నటి ఎపిసోడ్ ఆరంభం లో వచ్చిన చరణ్ అనే కంటెస్టెంట్ జడ్జీలను మాత్రమే కాదు , ప్రేక్షకులను కూడా విపరీతంగా ఆకర్షించాడు.

ఇలాంటి ఆల్ రౌండర్స్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వాలని , మంచి కంటెస్టెంట్ ని పట్టుకొచ్చారు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అది కాసేపు పక్కన పెడితే , జడ్జీలు ఇచ్చిన టాస్క్ లో భాగంగా చరణ్ యాంకర్ శ్రీముఖి తో పాటు , జడ్జీలందరినీ ఇంటర్వ్యూ చేసాడు. ఈ ఇంటర్వ్యూ లో బిందు మాధవి ని ఒక ప్రశ్న అడుగుతూ ‘ఒక కంటెస్టెంట్ మిమ్మల్ని ఇదిగో బాణం, సూర్పనక్క అని అన్నాడు. మీ ఫీలింగ్ అప్పట్లో ఎలా ఉండేది’ అని అడగ్గా , అందుకు బిందు మాధవి సమాధానం చెప్తూ ‘కచ్చితంగా కోపం గానే ఉంటుంది. బిగ్ బాస్ హౌస్ లోనే నా యాంగ్రీ యాంగిల్ తారా స్థాయికి చేరింది. కానీ అలాంటోళ్ళు కూడా ఉండాలి. అప్పుడే మనలో దాగున్న అంతర్గత బలాలు కూడా బయటపడుతుంటాయి’ అంటూ చెప్పుకొచ్చింది బిందు మాదవి. ఆమెని ‘బిగ్ బాస్’ హౌస్ ఓ ఉన్నప్పుడు సూర్పనక్క అని సంబోదించింది నటరాజ్ మాస్టర్ అనే సంగతి అందరికీ తెలిసిందే.

ఈ వ్యాఖ్యలు ఆయన్ని ఉద్దేశించి చేసినవే, అయితే దీనిపై నటరాజ్ మాస్టర్ చాలా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ , బిందు మాధవి కి కౌంటర్ ఇచ్చాడు. కాసేపటి క్రితమే ఆయన విడుదల చేసిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఆయన మాట్లాడుతూ ‘ఆమెని సూర్పనక్క అని సంబోదించింది నేనే. అలాంటోళ్ళు అంటే ఏంటి?, అర్థం కాలేదు , మాటలు జాగ్రత్త , ఏమనుకుంటున్నావ్, ఒక ప్లాట్ ఫార్మ్ లో కూర్చొని ఏదైనా మాట్లాడితే చెల్లుతుంది అనుకుంటున్నావా?, గేమ్ అయిపోయింది , తర్వాత నేను కూడా అనేక ఇంటర్వ్యూస్ లో మాట్లాడాను, అది ముగిసిన అధ్యాయం. ఆ తర్వాత నా పాప పుట్టినరోజు కి నిన్ను ఆహ్వానించాను కూడా, ఇవన్నీ మర్చిపోయి. గేమ్ అయిపోయింది, ఇప్పుడు అతనేదో అడిగాడు ఉత్సాహంతో , అప్పుడు నీ గురించి నువ్వు గొప్పలు చెప్పుకోవాలి కానీ , నా ప్రస్తావన తీసుకొని రావడం ఏంటి?, నాతో పెట్టుకోవద్దు , తెలుసుగా నాతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో’ అని చెప్పుకొచ్చాడు నటరాజ్ మాస్టర్. ఈ వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.

 

View this post on Instagram

 

A post shared by Natraj Kasturinatraj (@natraj_master)

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper