Dark Chocolate Trailer: మన టాలీవుడ్ లో థ్రిల్లర్ సినిమాలకు ఆడియన్స్ అమితాసక్తి చూపిస్తారు అనే సంగతి తెలిసిందే. కమర్షియల్ , కామెడీ , ఎంటర్టైన్మెంట్ సెంటిమెంట్ సినిమాలను ఎక్కువగా ఇష్టపడే మన టాలీవుడ్ ఆడియన్స్ , థ్రిల్లర్ సినిమాలకు ఈమధ్య కాలంలో బాగా అలవాటు పడ్డారు. అందుకే కొంతమంది చిన్న డైరెక్టర్ కూడా పెద్ద సినిమాల రేంజ్ లో వసూళ్లను రాబడుతూ దుమ్ము లేపుతున్నారు. అలాంటి సినిమాలు అద్భుతంగా ఆడడంతో , మేకర్స్ థ్రిల్లర్ జానర్ సినిమాలను తెరకెక్కించేందుకు మరింత ఆసక్తి చూపిస్తున్నారు. అలా తెరకెక్కించిన సినిమానే ‘డార్క్ చాకలేట్’. కాసేపటి క్రితమే ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ని విడుదల చేయగా, దానికి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా , ఎలాంటి హంగులు ఆర్భాటాలు లేకుండా , ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్టు ట్రైలర్ ని చూస్తుంటే తెలుస్తోంది.
ముఖ్యంగా బోల్డ్ కామెడీ , వెరైటీ రోల్స్, కొత్త తరహా సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇప్పటి వరకు రానా దగ్గుబాటి సమర్పణ లో వచ్చిన సినిమాలు టాలీవుడ్ లో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాయి. ఈ చిత్రానికి కూడా ఆయన సమార్పుకుడిగా వ్యవహరించడం తో , ఆడియన్స్ లో అంచనాలు మరింత పెరిగాయి. బిందు మాధవి , విశ్వ దేవ్ రాచకొండ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు శశాంక్ శ్రీవాస్తవ దర్శకత్వం వహించారు. ‘ఫైర్ స్టార్’ అనే ఎలిమెంట్ చుట్టూ సాగే ఈ కహాలో టాలీవుడ్ లోని స్టార్స్ కల్చర్ ని కూడా చూపించబోతున్నారని అర్థం అవుతోంది. అయితే ఈ సినిమా పూర్తి కథ గురించి కానీ , పాత్ర గురించి కానీ మేకర్స్ రెవీల్ చేయలేదు. దీంతో అసలు ఈ సినిమాలో ఏముందో తెలుసుకునే ఆత్రుత ఆడియన్స్ లో మరింత పెరిగింది. ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యి చాలా రోజులు అయ్యింది.
కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు అడ్డంకులను తొలగించుకొని వచ్చే నెల 13 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరి ట్రైలర్ లో చూపించిన కొత్తదనం సినిమాలో కూడా ఉంటుందా?, ప్రేక్షకుల అంచనాలను మించుతుందా లేదా అనేది తెలియాలంటే 13 వ తేదీ వరకు ఆగాల్సిందే. బిందు మాధవి కి సోషల్ మీడియా లో కావాల్సినంత క్రేజ్ ఉంది కానీ , సినిమాల పరంగా మన టాలీవుడ్ లో ఆమెకు సక్సెస్ రేట్ చాలా తక్కువే. ఈ చిత్రం తో ఆమె సక్సెస్ ని అందుకొని ముందుకు వెళ్తుందో లేదో చూడాలి.