Bigg Boss Telugu 10: సుమారుగా 25 వేల మంది ఔత్సాహికులు ‘బిగ్ బాస్ 10’ లో కంటెస్టెంట్స్ గా పాల్గొనేందుకు దరఖాస్తులు చేసుకోగా , వారి నుండి కేవలం 15 మందిని మాత్రమే ‘అగ్ని పరీక్ష 2’ లో ఫైనల్ రౌండ్ కి తీసుకున్నారు. ఈ ‘అగ్నిపరీక్ష 2’ కి సంబంధించిన ఆడిషన్స్ ప్రక్రియ ఎపిసోడ్స్ ని గత మూడు రోజులుగా మీరంతా చూస్తూనే ఉండుంటారు. అగ్నిపరీక్ష కి ఎంపిక చేస్తున్న కంటెస్టెంట్స్ బాగానే ఉన్నారు కానీ , వాళ్ళతో జడ్జీలు వ్యవహరిస్తున్న తీరు ఆడియన్స్ కి నచ్చడం లేదు. అయితే ఆడిషన్స్ పూర్తి అయ్యాక , ఎంపికైన 15 మంది కంటెస్టెంట్స్ కి అనేక టాస్కులు నిర్వహించారు. ఆ టాస్కుల్లో అద్భుతంగా పెర్ఫార్మన్స్ ఇచ్చినవాళ్లు బిగ్ బాస్ 10 లోకి ఎంట్రీ ఇస్తారు. ఇప్పటికీ 5 మంది కంటెస్టెంట్స్ కి సంబంధించిన ఎంపిక ప్రక్రియ పూర్తి అయ్యిందట.
వీరికి ‘వోట్ అప్పీల్’ చేసుకునే అవకాశం కూడా కల్పించారు జడ్జీలు. ముందుగా ఓటు అప్పీల్ చేసుకున్న కంటెస్టెంట్ ‘రాజా కుమారి దయానా’. ఈరోజు ప్రసారమయ్యే ఎపిసోడ్ లో ఈమెని మీరంతా చూడొచ్చు. జియో హాట్ స్టార్ లో ఈరోజుటికి సంబంధించిన ఎపిసోడ్ అప్లోడ్ అయ్యింది. ఈ యాప్ ని ఉపయోగించేవాళ్ళు ఇప్పటికే ఆ ఎపిసోడ్ ని చూసే ఉంటారు. ఆమె స్టోరీ జడ్జీల చేత కంటతడి పెట్టించింది , ఆడియన్స్ కి కూడా ఈమె తెగ నచ్చేసింది. మారుమూల పల్లెటూరి నుండి ఎన్నో అవమానాలు పొంది, బిగ్ బాస్ 10 లోకి రావడమంటే సాధారణమైన విషయం కాదు. కచ్చితంగా ఈమెకు టైటిల్ విన్నర్ గా నిలిచే అవకాశాలు కూడా ఉన్నాయి. అదే విధంగా ఓటు అప్పీల్ చేసుకున్న రెండవ కంటెస్టెంట్ శ్రేష్టి వ్యాకరణం. ఈమెని కూడా ఈరోజుటి ఎపిసోడ్ లో మీరంతా చూడొచ్చు.
చాలా స్టైలిష్ లుక్స్ తో , అందంగా హాట్ గా కనిపించే ఈ అమ్మాయి కూడా ‘అగ్ని పరీక్ష 2’ లో గెలిచి , ఓటు అప్పీల్ చేసుకుంది. ఈమె కూడా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాలు చాలానే ఉన్నాయి. ఇక తెలంగాణ రైతు బిడ్డ సింగర్ ఝాన్సీ ని ఇది వరకే మీరంతా ఆడిషన్స్ లో చూసే ఉంటారు. ఈమె కూడా ‘అగ్ని పరీక్ష 2’ లో గెలిచి ఓటు అప్పీల్ చేసుకుంది. అదే విధంగా హేమంత్ , రోహిత్ వంటి కంటెస్టెంట్స్ కూడా ఓటు అప్పీల్ చేసుకున్నారట. వీళ్ళతో పాటు మరో 5 మంది ఓటు అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది. 10 మంది ఓటింగ్ లైన్ లో ఉంటారు , ఆడియన్స్ నుండి అత్యధిక ఓట్లు సంపాదించుకున్న టాప్ 5 కంటెస్టెంట్స్ ని హౌస్ లోకి పంపిస్తారు , ఒక ఇద్దరినీ మాత్రం జడ్జీల ఛాయస్ మీద పంపుతారు.