Akkineni Nagarjuna: అక్కినేని అభిమానులు రీసెంట్ గా ‘లెనిన్’ బ్లాక్ బస్టర్ తో ఎంత మంచి జోష్ లో ఉన్నారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అక్కినేని వారసుడికి సరైన హిట్ లేదని బాధ పడుతున్న నేపథ్యం లో, 70 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టి, కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టి, అక్కినేని ఫ్యామిలీ లో సంతోషాన్ని నింపాడు. ఇక రీసెంట్ గా అక్కినేని నాగార్జున పుట్టినరోజు సందర్భంగా తన వందవ సినిమా గ్లింప్స్ వీడియో తో ఫ్యాన్స్ లో ఉన్న ఉత్సాహాన్ని రెట్టింపు చేసాడు. కచ్చితంగా ఈ చిత్రం నాగార్జున కెరీర్ లో ల్యాండ్ మార్క్ గా నిలుస్తుందని అంతా అనుకున్నారు. ఇలా అభిమానులంతా సంతోషిస్తున్న సమయం లో నాగార్జున ఒక షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే తమిళ హీరో సూర్య, హెచ్. వినోద్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇది సూర్య కి 49 వ చిత్రం. ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం అక్కినేని నాగార్జున ని సంప్రదించినట్టు, వినోద్ చెప్పిన కథ బాగా నచ్చడంతో నాగార్జున కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రం లో హీరోయిన్ గా ‘డీసీ’ ఫేమ్ వామికా గబ్బి ఎంపికైనట్టు తెలుస్తోంది. ఈ ఏడాది లోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లబోతుందట. అయితే నాగార్జున విలన్ క్యారెక్టర్స్ చేయడం అభిమానులకు అసలు ఏ మాత్రం నచ్చడం లేదు. గత ఏడాది ఆయన సూపర్ స్టార్ రజినీకాంత్ హీరో గా నటించిన ‘కూలీ’ చిత్రంలో విలన్ గా నటించాడు.
నాగార్జున క్యారెక్టర్ అసలు బలంగానే లేదని, అంతటి వీక్ విలన్ క్యారెక్టర్ ఎప్పుడూ చూడలేదని సోషల్ మీడియా లో అక్కినేని ఫ్యాన్స్ తీవ్రమైన అంసంతృప్తి వ్యక్తం చేశారు. నిన్నటి తరం లో బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ లో ఒకరైన నాగార్జున ఇలాంటి రెగ్యులర్ విలన్ రోల్స్ లో కనిపించడం దురదృష్టకరమని, ఆయన తోటి సీనియర్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ , వెంకటేష్ వంటి వారు, ఇప్పటికీ హీరోలుగా చేస్తూ వందల కోట్ల గ్రాస్ వసూళ్లను కొల్లగొడుతూ ముందుకు దూసుకెళ్తుంటే, నాగార్జున మాత్రం ఇలాంటి పాత్రలకు షిఫ్ట్ అవ్వడం బాధాకరం అంటూ ఫ్యాన్స్ తమ ఆవేదన వ్యక్తం చేశారు. ‘కూలీ’ తో పోయింది, మళ్లీ క్యారెక్టర్స్ ఇక చేయదు అనేలోపు, ఇప్పుడు ఈ వార్త రావడం అభిమానులను బాగా డిస్టర్బ్ చేస్తోంది.