Rohit Naidu: ‘అగ్ని పరీక్ష 2’ షో లో సామాన్యుడిగా పరిచయమై, తన అద్భుతమైన టాలెంట్ తో అంచలంచలుగా ఎదుగుతూ, షో స్టీలర్ గా నిల్చిన రోహిత్ నాయుడు పేరు, ఇప్పుడు సోషల్ మీడియా లో సంచలనంగా మారింది. ఎక్కడ చూసిన ఈయన గురించే చర్చ. ‘బిగ్ బాస్’ హౌస్ లోకి అడుగుపెట్టే కంటెస్టెంట్ కి ఎలాంటి లక్షణాలు ఉండాలి అని ట్రైనింగ్ తీసుకొని వచ్చినా కూడా రోహిత్ రేంజ్ లో ఆడలేరేమో అని సోషల్ మీడియా లో విశ్లేషకులు ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఫిజికల్ టాస్కుల్లో అయినా, బ్రెయిన్ కి సంబంధించిన టాస్కుల్లో అయినా, డిబేట్స్ లో అయినా, ఈ ‘అగ్ని పరీక్ష 2’ లో రోహిత్ నాయుడు కి పోటీ ఇచ్చే కంటెస్టెంట్ ఒక్కరు కూడా లేకపోవడం గమనార్హం. ప్రతీ ఎపిసోడ్ లోనూ టాస్కులు ఆడడమే కాకుండా , ప్రతీ టాస్కు గెలవడం ఇతని స్పెషాలిటీ.
ఇలాంటి కంటెస్టెంట్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెడితే, తన తోటి కంటెస్టెంట్స్ కి వణుకు పుట్టిస్తాడని, బిగ్ బాస్ చరిత్ర లోనే ది బెస్ట్ కంటెస్టెంట్ గా ఇతను నిలిచిపోతాడని, ఇతనిపై ప్రేక్షకుల్లో అంచనాలు ఎవ్వరూ ఊహించని రేంజ్ లో ఉన్నాయి. అయితే ఇంతకీ ఎవరు ఈ రోహిత్ నాయుడు?, ఇతని బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? అనేది స్పష్టంగా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ప్రస్తుతం ‘అగ్ని పరీక్ష 2’ లో మిగిలిన 14 మంది కంటెస్టెంట్స్ లో అత్యధిక శాతం మంది సోషల్ మీడియా లో మంచి ఫాలోయింగ్ ని సంపాదించుకున్న వాళ్ళే ఉన్నారు. కొంతమంది కంటెస్టెంట్స్ కి ఇన్ స్టాగ్రామ్ లో మిలియన్ల సంఖ్యలో ఫాలోయర్స్ కూడా ఉన్నారు. కానీ రోహిత్ నాయుడు ఆ క్యాటగిరీ కి సంబంధించిన వాడు కాదు.
మన లాగానే ఒక సాధారణమైన వ్యక్తి. ‘అగ్ని పరీక్ష 2’ లోకి రాకముందు ఇతనికి పట్టుమని 100 మంది ఫాలోయర్స్ కూడా లేరు. అకౌంట్ కూడా ప్రైవేట్ లో ఉండేది. అలాంటి అతి సామాన్యమైన వ్యక్తిగా అడుగుపెట్టిన రోహిత్, ‘అగ్నిపరీక్ష 2’ లో తన సత్తా చాటి , 46 వేల మంది ఫాలోయర్స్ ని సంపాదించుకున్నారు. ఇతను తన తోటి కంటెస్టెంట్స్ లాగా బలమైన పీఆర్ టీం ని పెట్టుకోలేదు. స్కూల్స్ కి , కాలేజీలకు వెళ్లి పిల్లల్ని నాకు ఓటు వేయండి వంటి క్యాంపైన్ కూడా చేయడం లేదు. కేవలం తన ప్రతిభ ని మాత్రమే నమ్ముకున్నాడు. అందుకే నేడు ఆయన ఓటింగ్ లో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. ‘బిగ్ బాస్ 10’ లోకి అడుగుపెట్టబోతున్నాడు. ఒక సాధారణ మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఐటీ ఉద్యోగి, నేడు తన ఉద్యోగాన్ని కూడా రిస్క్ లో పెట్టి కెరీర్ పరంగా బలమైన నిర్ణయం తీసుకున్నాడు. దానికి తగ్గ ఫలితం ఎంజాయ్ చేయబోతున్నాడు. ఇతను బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన తర్వాత ఎలా ఆడుతాడో చూడాలి.