Mahesh Babu: మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ‘వారణాసి’ ఈ సినిమాతో ఇలాగైనా సరే సూపర్ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోవాలనే లక్ష్యంతో ముందుకు దూసుకెళ్తుండటం విశేషం… వారణాసి సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిన నేపథ్యంలో మహేష్ బాబు తన తదుపరి సినిమాల విషయంలో కూడా చాలా స్పెషల్ కేర్ తీసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఇప్పటికే కొంతమంది దర్శకులతో మంతనాలు జరుపుతున్నారు. ఆయన ఎవరితో ముందుగా సినిమా చేస్తాడు అనే విషయంలో సరైన క్లారిటి రావడం లేదు. ఇంకా ఇప్పటికే ఒక ఇద్దరు దర్శకులు అతని దగ్గరికి బౌండెడ్ స్క్రిప్ట్ పట్టుకొని వచ్చారట. అందులో సందీప్ రెడ్డివంగా ఒకరు కాగా, మరొకరు ఆదిత్య ధర్ కావడం విశేషం… అనిమల్ సినిమాతో స్టార్ట్ డైరెక్టర్ గా మారిన సందీప్ రెడ్డి వంగ ప్రస్తుతం ప్రభాస్ తో స్పిరిట్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన తర్వాత మహేష్ బాబుతో ఒక సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే మహేష్ బాబు మాత్రం ఇప్పటికీ సందీప్ రెడ్డి వంగ కి ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.
ఇక ఈ గ్యాప్ లోనే దురంధర్ సినిమాతో సూపర్ సక్సెస్ లను సాధించిన ఆదిత్య ధర్ తో సైతం సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా మహేష్ బాబు ఆదిత్య ధర్ కి కూడా ఏమీ చెప్పలేదట.
ఇక వీళ్లిద్దరిలో మహేష్ బాబు ఎవరితో ముందుగా సినిమా చేస్తాడు అనేదే ఇప్పుడు చర్చనియంశంగా మారింది. ప్రస్తుతం ఆదిత్య ధర్ కి వేరే కమిట్ మెంట్స్ కూడా ఉన్నాయి. కానీ అతనికి మహేష్ బాబు అంటే ఇష్టం ఉండడంతో అతనితో సినిమా చేయాలి అని అనుకుంటున్నాడట.
కానీ మహేష్ బాబు నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే తప్ప తను ఆ సినిమా మీద కూర్చో లేడు. కాబట్టి ఇప్పుడు మహేష్ బాబు కోసం ఇద్దరు దర్శకులైతే ఎదురుచూస్తున్నారు. మహేష్ ఆ ఇద్దరు దర్శకులలో ముందుగా ఎవరితో సినీ చేస్తాడనేది చర్చనీయాంశంగా మారింది…