YSRCP: స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఏకగ్రీవాలు జరిగితే ఊరుకునేది లేదని జగన్మోహన్ రెడ్డి నేరుగా తమ పార్టీ నేతలను హెచ్చరిస్తున్నారు. ఎక్కడైనా ఏకగ్రీవాలు జరిగితే అటువంటి వారికి టిక్కెట్ ఇవ్వను అని తేల్చి చెబుతున్నారు. దీంతో ఏంటి ఆత్మవిశ్వాసం అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత పై అందరి దృష్టి ఉంది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి మరోలా ఉంది. స్థానిక ఎన్నికలను ఎలాగైనా అడ్డగించేందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తున్నట్లు స్పష్టమైంది. స్థానిక ఎన్నికలను అడ్డుకునేందుకు వైసిపి అధికారికంగానే కోర్టును ఆశ్రయించింది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న లేళ్ల అప్పిరెడ్డి కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని.. పాత జాబితాతోనే ఎన్నికలకు వెళ్తున్నారని.. అందుకే ఈ ప్రక్రియను నిలిపివేయాలని కోర్టులో దావా వేశారు. దీంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వైఖరి స్పష్టమైపోయింది. ఆ పార్టీ ధీమా మేకపోతు గాంభీర్యం అని తేలిపోయింది.
* సర్ పేరుతో కోర్టులో పిటిషన్..
స్థానిక ఎన్నికల్లో భాగంగా మున్సిపల్ చైర్మన్లు, మేయర్లకు ప్రత్యక్ష పోరు కావడంతో ఇక తమదే అన్నట్టు వ్యవహరిస్తోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఒకే అభ్యర్థితో తేలిపోయిన అంశం కావడంతో కొంతవరకు ప్రభావం చూపించవచ్చు అని అంచనా వేస్తోంది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి చూస్తే పార్టీ ఆశించిన స్థాయిలో పుంజుకోలేదన్న అభిప్రాయానికి వచ్చినట్టు ఉంది. అందుకే ఇప్పుడు ఓటర్ల సమగ్ర సవరణ పేరుతో పిటిషన్ దాఖలు చేసింది. అయితే వైసీపీ లేవనెత్తిన అంశాలను పరిశీలిస్తే దాంట్లో ఎటువంటి బలం లేదని నిపుణులు చెబుతున్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ జరుగుతున్న ప్రతిసారి ఎన్నికలను నిలిపివేయాలనే నిబంధన లేదు. కేవలం ఈ ప్రక్రియలను సాకుగా చూపి ఎన్నికల షెడ్యూల్ ను అడ్డుకోవాలని చూస్తుండడం మాత్రం రాజకీయ వర్గాల్లో ఆశ్చర్యం వ్యక్తం అవుతోంది.
* బలం పెరగకపోవడంతోనే..
సార్వత్రిక ఎన్నికల తర్వాత సైతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ వచ్చింది. పార్టీపై ప్రజల్లో నమ్మకం పోయింది. ఆశించిన స్థాయిలో పుంజుకునే పరిస్థితి కూడా లేదు. మరి కొంతకాలం జాతీయం చేస్తే కొంతవరకు పురోగతి ఉంటుందన్న అంచనాకు వచ్చింది. అందుకే ఎట్టి పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలను అడ్డుకోవాలని చూస్తోంది. అందుకే కోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది. కానీ ఎటువంటి చట్టపరమైన ఇబ్బందులు రాకుండా పటిష్ట చర్యలతో ఎన్నికల ప్రక్రియ ముగించాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.