Homeటాప్ స్టోరీస్RIP Oracle: దుమ్మెత్తి పోశాడు.. నాశనం అవ్వాలని శపించాడు.. వైరల్ వీడియో

RIP Oracle: దుమ్మెత్తి పోశాడు.. నాశనం అవ్వాలని శపించాడు.. వైరల్ వీడియో

RIP Oracle: ఒకటి కాదు రెండు కాదు.. సంవత్సరాలకు సంవత్సరాలు పనిచేశారు. కొన్ని సందర్భాలలో హైక్స్ లేకపోయినా సరే పని చేశారు. రాత్రింబవళ్లు సంస్థ ఎదగాలని పనిచేశారు. ఇప్పుడు వారి ఒంట్లో శక్తి ఒకప్పటి స్థాయిలో లేదు. యుక్తి అంతకంటే లేదు. వాళ్ల యవ్వనాన్ని.. సామర్థ్యాన్ని మేనేజ్మెంట్ వాడుకుంది. తన ఎదుగుదలకు అనుకూలంగా మార్చుకుంది. ఉద్యోగుల శ్రమతో లక్షల కోట్లకు ఎదిగిన కంపెనీ ఇప్పుడు ఉన్నపలంగా వారిని మెడపట్టి బయటికి గెంటేసింది. ముందు వచ్చిన చెవుల కంటే […]

RIP Oracle: ఒకటి కాదు రెండు కాదు.. సంవత్సరాలకు సంవత్సరాలు పనిచేశారు. కొన్ని సందర్భాలలో హైక్స్ లేకపోయినా సరే పని చేశారు. రాత్రింబవళ్లు సంస్థ ఎదగాలని పనిచేశారు. ఇప్పుడు వారి ఒంట్లో శక్తి ఒకప్పటి స్థాయిలో లేదు. యుక్తి అంతకంటే లేదు. వాళ్ల యవ్వనాన్ని.. సామర్థ్యాన్ని మేనేజ్మెంట్ వాడుకుంది. తన ఎదుగుదలకు అనుకూలంగా మార్చుకుంది.

ఉద్యోగుల శ్రమతో లక్షల కోట్లకు ఎదిగిన కంపెనీ ఇప్పుడు ఉన్నపలంగా వారిని మెడపట్టి బయటికి గెంటేసింది. ముందు వచ్చిన చెవుల కంటే వెనుక వచ్చిన కొమ్ములు వాడి అనే సామెతను నిజం చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద పెట్టుబడులు పెడుతున్న ఒరాకిల్ సంస్థ.. ఉద్యోగులను నట్టేట ముంచింది. ఏఐ మీద పెట్టుబడులు పెడుతున్నట్టు సాకుగా చూపించి వేలాది మంది ఉద్యోగులను తొలగించింది. తద్వారా వారిని రాత్రికి రాత్రే ఇంటికి పంపించింది. చాలామంది ఉద్యోగులు ఉదయాన్నే కార్యాలానికి రావడం. . మెయిల్స్ చూసుకొని ఆందోళన చెందడం వంటి పరిణామాలు కనిపించాయి. వాస్తవానికి ఇటువంటి దుస్థితి ఎవరికీ రాకూడదని ఉద్యోగులుగా పోవడం వారి బేలతనానికి నిదర్శనంగా నిలిచింది.

ఒరాకిల్ సంస్థ ఉద్యోగులను తొలగించిన నేపథ్యంలో చాలామంది తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒక ఉద్యోగి అయితే ఏకంగా ఒరాకిల్ సంస్థ మీద దుమ్ము ఎత్తిపోశాడు. సంస్థ నాశనం కావాలని శాపనార్ధాలు పెట్టాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఉద్యోగులను ఒకప్పుడు భారీగా రిక్రూట్ చేసుకున్న ఒరాకిల్.. ఇప్పుడు అర్ధాంతరంగా రోడ్డు మీద పడడంతో చాలామంది ఉపాధి కోల్పోయారు.

“‘సంస్థ కోసం రెక్కలు ముక్కలు చేసుకుంటున్నాం. అయినప్పటికీ యాజమాన్యానికి ప్రేమ లేదు. రాత్రి పగలు పనిచేసినప్పటికీ యాజమాన్యం ఉద్యోగం నుంచి తొలగించిందంటే ఏమనుకోవాలి. ఉద్యోగం నుంచి తొలగించారు. కనీసం మాట వరసకు కూడా చెప్పలేదు. కార్యాలయంలోకి ప్రవేశించగానే మీరు రాకూడదని చెప్పేశారు. ఇంతకంటే దారుణం మరొకటి ఉంటుందా అని ” ఉద్యోగులు వాపోతున్నారు.

ఆ ఉద్యోగి ఒరాకిల్ సంస్థ మీద దుమ్మెత్తి పోస్తున్న వీడియో దేశవ్యాప్తంగానే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఐటీ సంస్థలు ఉద్యోగుల శక్తి యుక్తులతో ఆడుకోవడం పరిపాటిగా మారిపోయిందని.. ఏ ఐ వల్ల జరిగే ప్రయోజనం ఏమిటో తెలియదు గాని.. లక్షలాదిమంది ఉద్యోగాలు కోల్పోయి ఇలా రోడ్డు మీద పడుతున్నారని.. చివరికి అన్యాయం అయిపోయి కన్నీరు పెడుతున్నారని.. వారి గోస ఐటీ కంపెనీలకు తగులుతుందని నెటిజన్లు పేర్కొంటున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper