Anand Devarakonda: టాలీవుడ్ లోనే కాదు, ఏ ఇండస్ట్రీ లో అయినా ఒక హీరో , హీరోయిన్ కలిసి వరుసగా రెండు మూడు సినిమాలు చేస్తే , వాళ్ళ మధ్య ఎదో జరుగుతోంది , కచ్చితంగా వీళ్ళు ప్రేమలో ఉన్నారు అంటూ మీడియా లో అనేక కథనాలు పుట్టిస్తుంటారు. ఇది కొత్తేమి కాదు , అయితే రూమర్స్ అనుకున్న ఎన్నో సందర్భాలు నిజం అయ్యాయి, కొన్ని మాత్రం రూమర్స్ గానే మిగిలిపోయాయి. విజయ్ దేవరకొండ , రష్మిక పెళ్లి చేసుకున్నప్పుడు , సోషల్ మీడియా లో ఆనంద్ దేవరకొండ , వైష్ణవి చైతన్య జంట కూడా పెళ్లి చేసుకోబోతుంది అంటూ ఒక వార్త ప్రచారమైంది. అంతే కాకుండా రెండు మూడు సందర్భాల్లో వీళ్లిద్దరు కలిసి కొన్ని ప్రైవేట్ ఫంక్షన్స్ కి వెళ్లడం వంటివి కూడా వీళ్ళ మధ్య ఎదో జరుగుతోంది అనే అనుమానాలు అభిమానుల్లో ఏర్పడ్డాయి.
రీసెంట్ గానే వీళ్లిద్దరి కాంబినేషన్ లో ‘ఎపిక్’ అనే చిత్రం విడుదలైంది. ‘బేబీ’ వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడం తో , మంచి అంచనాల నడుమే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. కానీ ఈ సినిమా ఆ అంచనాలను అందుకోవడం లో పూర్తిగా విఫలం అయ్యింది. మూడు రోజులకు కలిపి కనీసం 10 కోట్ల గ్రాస్ వసూళ్లను కూడా రాబట్టలేకపోయింది ఈ చిత్రం. కానీ విడుదలకు ముందు ఈ సినిమా ప్రొమోషన్స్ లో హీరో , హీరోయిన్ చాలా చురుగ్గా పాల్గొన్నారు. అందులో భాగంగా వైష్ణవి చైతన్య ఒక ప్రముఖ టీవీ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా, ఆ ఇంటర్వ్యూ లో యాంకర్ అడిగిన కొన్ని ప్రశ్నలకు వైష్ణవి చెప్పిన సమాదానాలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారాయి. మీరు , ఆనంద్ ప్రేమలో ఉన్నారని చాలా కాలం నుండి ఒక వార్త ప్రచారం లో ఉంది , దీనిపై మీ అభిప్రాయం ఏంటి అని అడుగుతుంది యాంకర్.
దీనికి వైష్ణవి సమాధానం చెప్తూ ‘ఈ వార్త విన్నప్పుడు నేను , ఆనంద్ నవ్వుకున్నాం. కలిసి రెండు సినిమాల్లో నటించేలోపు ఇలాంటి వార్తలు రావడం సహజమే. ప్రస్తుతం నా ఫోకస్ మొత్తం సినిమాల మీదనే ఉంది. పెళ్లి ఇప్పట్లో చేసుకునే ఉద్దేశ్యం లేదు. కానీ ఆనంద్ దేవరకొండ మరో రెండేళ్లలో పెళ్లి చేసుకోబోతున్నాడు. మా ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉన్న విషయం వాస్తవమే కానీ , మీరు అనుకుంటున్నట్టు అంతకు మించి ఏమి లేదు’ అంటూ చెప్పుకొచ్చింది వైష్ణవి చైతన్య. దీంతో త్వరలోనే వీళ్లిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు అంటున్న వస్తున్న వార్తలకు చెక్ పడింది.