Raviteja: మాస్ మహారాజ రవితేజ నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఇరుముడి’ బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవశ్రామ్ లేదు. వరుసగా 6 డిజాస్టర్ ఫ్లాప్స్ తర్వాత ఇక రవితేజ పని అయిపోయింది , ఇక ఆయనకు రెమ్యూనరేషన్స్ ఇచ్చి సినిమాలు తీసే నిర్మాతలు రారు అని అనుకుంటున్న సమయం లో వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతాలను నెలకొల్పుతూ ముందుకు దూసుకెళ్తోంది. ఈమధ్య కాలం లో పాన్ ఇండియన్ స్టార్ హీరోలుగా పిలవబడే ఎంతో మందికి సూపర్ స్టార్స్ కి కూడా ఈ రేంజ్ థియేట్రికల్ రన్ రాలేదు. 20 కోట్ల రూపాయలకు ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ని కొనుగోలు చేస్తే , ఇప్పటి వరకు 140 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టింది.
ఇప్పటికీ కూడా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద చాలా డీసెంట్ రన్ ని సొంతం చేసుకుంటూ ముందుకెళ్తోంది. ఇకపోతే ఈ చిత్రానికి రవితేజ రెమ్యూనరేషన్ 60 కోట్ల రూపాయిల వరకు ఉంటుందట. ఇది ఆయన అదృష్టం అనే చెప్పాలి. రవితేజ కి రెమ్యూనరేషన్ రూపం లో డబ్బులు ఇచ్చుకోలేక, నైజాం ప్రాంతానికి సంబంధించిన థియేట్రికల్ రైట్స్ ని ఇచ్చారు మైత్రీ మూవీ మేకర్స్. కేవలం 7 కోట్ల వర్త్ రైట్స్, కానీ కలెక్షన్స్ ఇప్పటి వరకు ఈ ప్రాంతం నుండి 60 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. మరో మూడు నుండి నాలుగు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు మేకర్స్. అంటే ఈ సినిమా 64 కోట్లు చేస్తే, ఆ డబ్బులు మొత్తం రవితేజ జోబులోకే వెళ్ళింది. ఈ సినిమాతో ఆయన రేంజ్ కూడా భారీ రేంజ్ లో పెరగడంతో , రవితేజ తన తదుపరి చిత్రాలకు ఏకంగా 35 నుండి 40 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం.
‘ఇరుముడి’ చిత్రం లాగా , ప్రతీ సినిమా అదే రేంజ్ లో సక్సెస్ అవుతుందనే గ్యారంటీ లేదు. మొదటి రోజు కనీసం 80 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టేంత సత్తా ఉన్న హీరో కి అయితే , నిర్మాతలు కళ్ళు మూసుకొని 35 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ఇవ్వడానికి రెడీ గా ఉంటారు. కానీ రవితేజ కి ఇప్పుడు అంత రేంజ్ లేదు అనేదే ట్రేడ్ అభిప్రాయం. కానీ ఆయన మాత్రం అసలు వెనక్కి తగ్గడం లేదు. ఒకవేళ రవితేజ తదుపరి చిత్రం కూడా ఇరుముడి లాగా ప్రభంజనం సృష్టిస్తే , ఆ తర్వాతి సినిమా నుండి నిర్మాతలు రవితేజ కోరినంత రెమ్యూనరేషన్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఆయన మార్కెట్ ఎలా ఉండబోతుంది అనేది.