Asus Vivobook ప్రముఖ టెక్ సంస్థ Asus భారత మార్కెట్లో కొత్త Vivobook ల్యాప్‌టాప్‌లను విడుదల చేసింది. Vivobook S14, Vivobook S16, Vivobook 14 Flip, Vivobook S14 Flip, Vivobook 16 మోడళ్లను కంపెనీ పరిచయం చేసింది. వీటిలో మెటల్ బిల్డ్‌తో పాటు MIL-STD-810H మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, AI ఆధారిత ఫీచర్లు ఉన్నాయి.
ధరలు ఇలా..
Asus Vivobook S14 (S5452MA) ప్రారంభ ధర రూ.1,18,990 కాగా, Vivobook S16 (S5652MA) ధర రూ.1,21,990 నుంచి మొదలవుతుంది. Vivobook 14 Flip ధర రూ.1,79,990, Vivobook S14 Flip ధర రూ.1,09,990 నుంచి ఉంటుంది. కొత్త మోడళ్లలో కొన్ని సెప్టెంబర్ 17 నుంచి అందుబాటులోకి రానుండగా, Snapdragon X ఆధారిత S14, S16 మోడళ్లు అక్టోబర్ రెండో వారంలో విక్రయానికి రానున్నాయి.
AI ఫీచర్లతో పవర్‌ఫుల్ స్పెక్స్
Vivobook S14, S16లో Intel Core 7 Series 3 ప్రాసెసర్లు, 17 TOPS వరకు AI పనితీరు అందిస్తాయి. 14, 16 అంగుళాల Full-HD+ IPS డిస్‌ప్లేలు, 16:10 యాస్పెక్ట్ రేషియో, 100 శాతం sRGB కవరేజ్ ఉన్నాయి.
Vivobook 14 Flipలో 360-డిగ్రీ హింజ్, 14 అంగుళాల Full-HD+ ASUS OLED టచ్‌స్క్రీన్, స్టైలస్ సపోర్ట్ ఉన్నాయి. Intel Core Ultra 7 Series 3 355 ప్రాసెసర్, 49 TOPS NPUతో వస్తుంది.
Vivobook S14 Flipలో Snapdragon X ప్రాసెసర్, 45 TOPS NPU, 14 అంగుళాల Full-HD+ OLED టచ్‌స్క్రీన్ ఉన్నాయి. మరోవైపు Vivobook 16లో AMD Ryzen 7 7840HS ప్రాసెసర్, Radeon గ్రాఫిక్స్, 16 అంగుళాల Full-HD+ IPS డిస్‌ప్లే ఉన్నాయి.
Snapdragon X వేరియంట్లు 30 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్ అందిస్తాయని Asus చెబుతోంది. లాంచ్ ఆఫర్‌లో భాగంగా రూ.99కే రూ.5,599 విలువైన ఎక్స్‌టెండెడ్ వారంటీ, యాక్సిడెంటల్ డ్యామేజ్ ప్రొటెక్షన్ ప్యాకేజీని అందిస్తోంది.