Bigg Boss 10 Telugu: ఈ సీజన్ బిగ్ బాస్ షో నుండి లెక్కలేనంత కంటెంట్ వస్తుందంటే అందుకు ప్రధాన కారణాల్లో ఒకటి త్రిగున్ . ఇతను ఇచ్చే కంటెంట్ మామూలు రేంజ్ లో లేదనే చెప్పాలి. కంటెస్టెంట్స్ పై నోరు జారడం, నారద మహర్షి లాగా ప్రతీ ఇద్దరి మధ్య గొడవలు పెట్టే స్కెచ్చులు వేయడం నాకు వెన్నతో పెట్టిన విద్య అనే రేంజ్ లో ఇన్ని రోజులు త్రిగున్ గేమ్ సాగింది. ఇతని కారణంగా జరిగే గొడవలు చూడడం కోసమే , ఈ సీజన్ బిగ్ బాస్ ని చూసే ఆడియన్స్ సంఖ్య రోజు రోజుకి పెరుగుతూ వెళ్తోంది. టీవీ టెలికాస్ట్ లో ఈ షో ని ప్రతీ రోజు ఎంత మంది చూస్తున్నారో తెలియదు కానీ, జియో హాట్ స్టార్ యాప్ లో ఇప్పటి వరకు ఈ సీజన్ ని 2 కోట్ల 80 లక్షల మంది వీక్షించారట.
పది రోజులు కూడా పూర్తి కాకముందే ఈ స్థాయి వ్యూస్ వచ్చాయంటే , రాబోయే రోజుల్లో ఇంకా ఏ రేంజ్ వ్యూస్ ని సొంతం చేసుకోబోతుందో చూడాలి. ఇదంతా పక్కన పెడితే త్రిగున్ ఈ సీజన్ లో పాల్గొనడం ఈ షో కి చాలా పెద్ద ప్లస్ అయ్యింది. ఇలాంటి విషయం ఉన్న కంటెస్టెంట్ కాబట్టే బిగ్ బాస్ టీం ఏరికోరి త్రిగుణ కి భారీ రెమ్యూనరేషన్ ఇచ్చి ఈ షో కి తీసుకున్నారు. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం త్రిగున్ కి ఒక్కో వారానికి గానూ 3 లక్షల రూపాయిల రెమ్యూనరేషన్ ఇవ్వబోతున్నారా మేకర్స్. ఆటో రామ్ ప్రసాద్ , వర్షిణి తర్వాత , ఆ అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్నది త్రిగునే. ఇప్పటి వరకు ఈయన తెలుగు , తమిళ భాషలకు కలిపి ఎన్నో సినిమాల్లో హీరో గా నటించాడు.
మన చిన్న తనం లో ఉన్నప్పుడు జెనీలియా నుండి ‘కథ’ అనే సినిమా ఒకటి విడుదలైంది గుర్తుందా?, ఆ సినిమాలో హీరో మరెవరో కాదు త్రిగునే. ఈ చిత్రం తర్వాత ఆయన తెలుగు లో అనేక సినిమాల్లో హీరో గా నటించాడు కానీ సక్సెస్ రాలేదు. ఆయన కెరీర్ లో మొట్టమొదటి కమర్షియల్ సక్సెస్ ‘చెన్నై లవ్ స్టోరీ’. ఈ సినిమా తర్వాత వెంటనే ఆయన బిగ్ బాస్ 10 లోకి కంటెస్టెంట్ గా రావడానికి ఒప్పుకోవడం అందరినీ షాక్ కి గురి చేసింది. ఈ షో తర్వాత త్రిగున్ కెరీర్ ఎలా ఉండబోతుందో చూడాలి. ఇకపోతే నేటి ‘బిగ్ బాస్ 10’ ఎపిసోడ్ త్రిగున్ , రోహిత్ ఆడిన ఫిజికల్ గేమ్ ని చూస్తే ఎవరికైనా వణుకు పుట్టాల్సిందే. ఈ రేంజ్ ఫిజికల్ టాస్క్ ఇప్పటి వరకు బిగ్ బాస్ హిస్టరీ లోనే జరగలేదని అంటున్నారు నెటిజెన్స్.