Bigg Boss 10 Telugu: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో త్రిగున్ ఇచ్చినంత నెగెటివ్ కంటెంట్ బిగ్ బాస్ హిస్టరీ లోనే ఎవ్వరూ ఇవ్వలేదని చెప్పొచ్చు. నిన్న మొన్నటి వరకు రోహిత్ ని టార్గెట్ చేయడం కోసమే బిగ్ బాస్ కి వచ్చాను అన్నట్టుగా ప్రవర్తించిన త్రిగున్ , ఇప్పుడు తన ఫోకస్ ని ముకేశ్ వైపు కి షిఫ్ట్ చేసాడు. వీకెండ్ ఎపిసోడ్స్ కి ముందు వరకు సెలబ్రిటీస్ అందరూ ఒకే గ్రూప్ గా ఉంటూ వచ్చారు. అందరూ కలిసి రోహిత్ మీద ఎగబడేవారు. కానీ వీకెండ్ తర్వాత సమీకరణాలు మొత్తం మారిపోయాయి. నామినేషన్స్ ఎపిసోడ్ రోజున సుధీర్ రెడ్డి ఇచ్చిన ట్విస్ట్ కి త్రిగున్ ఇప్పటికీ కోలుకోలేదు. ఇక ఆ తర్వాత అతని ప్రవర్తన కి ముకేశ్ , వర్షిణి , దేబ్జాని కూడా రివర్స్ అయ్యారు.
వీకెండ్ ఎపిసోడ్ లో రోహిత్ , ముకేశ్ మధ్య జరిగిన గొడవ ని చూసి , ఈ వారం మొత్తం వీళ్లిద్దరి మధ్య ఒక రేంజ్ లో గొడవ జరగబోతుందని అంతా ఊహించారు. కానీ కట్ చేస్తే కెప్టెన్సీ టాస్క్ మొదటి లెవెల్ లో వీళ్లిద్దరు స్నేహితులు అయిపోయారు. అసలు మాట్లాడడానికి ఇష్టపడట్లేదు అని చెప్పుకొచ్చిన వర్షిణి కూడా రోహిత్ కి ఫ్రెండ్ అయిపోయింది. అకస్మాత్తుగా హౌస్ లో వచ్చిన ఈ మార్పులు ప్రేక్షకులను షాకింగ్ కి గురి చేసింది. ఇదంతా పక్కన పెడితే నేడు మధ్యాహ్నం వంటగది లో ముకేశ్ తో త్రిగున్, వంశీ గొడవ వేసుకున్నారు. హౌస్ మొత్తానికి చెందాల్సిన ఫుడ్ లో త్రిగున్ కొంత భాగాన్ని దాచుకున్నాడు. దీన్ని గమనించిన ముకేశ్ ప్రశ్నించడం , ఆ తర్వాత వాదోపవాదాలు జరిగి ఎక్కడికో వెళ్ళిపోయింది. వంశీ కూడా నోరు జారడం అందరినీ షాక్ కి గురి చేసింది.
త్రిగున్ ఒక్కసారి ట్రిగర్ అయితే అతని నోటి నుండి ఎలాంటి పదాలు వస్తాయో గతం లో మనం రోహిత్ విషయం లో చూసే ఉంటాము. ఇప్పుడు ముకేశ్ పైన కూడా ఆయన అదే స్థాయిలో నోరు పారేసుకున్నాడు. ఆయన మాట్లాడుతూ ‘నీకు బుర్ర బుద్ధి సిగ్గు లేదు’ అంటూ మాట్లాడడం , వంశీ కూడా అందుకు మాటలు కలపడం వంటివి హౌస్ లో రణరంగం వాతావరణాన్ని క్రియేట్ చేశాయి. ఇక వంశీ అయితే ఈడు పెద్ద హీరో అనుకుంటున్నాడు , ఆమె హీరోయిన్(వర్షిణి), వీళ్లిద్దరు ఒక్కసారిగా మన మీదకు ఎక్కి తొక్కితే భరించాలా ? అంటూ త్రిగున్ తో అంటాడు. నిన్న మొన్నటి వరకు ఎంతో సైలెంట్ గా ఉన్న వంశీ , నేటి ఎపిసోడ్ లో ఎందుకో అవసరానికి మించి రెచ్చిపోయాడని అనిపిస్తోంది.