Homeఎంటర్టైన్మెంట్Lingamaneni Ramesh: జనసేన రాజ్యసభ సభ్యుడిగా లింగమనేని రమేష్.. మండిపడుతున్న జన సైనికులు..

Lingamaneni Ramesh: జనసేన రాజ్యసభ సభ్యుడిగా లింగమనేని రమేష్.. మండిపడుతున్న జన సైనికులు..

Lingamaneni Ramesh: రాజ్య సభలో ఖాళీ అయినా స్థానాలకు కూటమి పార్టీ నుండి ఎవరెవరు అభ్యర్థులుగా ఢిల్లీ కి వెళ్లాలో నిర్ణయం తీసుకున్నారు సీఎం చంద్రబాబు నాయుడు , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తెలుగు దేశం పార్టీ నుండి ముగ్గురుని రాజ్య సభకు పంపుతుండగా, జనసేన పార్టీ నుండి ఒకరిని పంపుతున్నారు. రాబోయే మూడేళ్ళలో జనసేన పార్టీ కి మరో మూడు రాజ్యసభ స్థానాలు దక్కనున్నాయి. అయితే జనసేన పార్టీ తరుపున ఎవరు రాజ్యసభ కి వెళ్తున్నారు అనే దానిపై అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. బాలినేని శ్రీనివాస్ లేదా లింగమనేని రమేష్ , వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు రాజ్యసభ కి వెళ్లొచ్చు అని అంతా అనుకున్నారు. కట్ చేస్తే అదే జరిగింది , లింగమనేని రమేష్ ని రాజ్యసభ కి పంపుతున్నట్టు జనసేన పార్టీ నిన్న అధికారిక ప్రకటన చేసింది.

అయితే లింగమనేని రమేష్ పేరు ని ప్రకటించడం పై కొంతమంది జనసైనికుల్లో తీవ్రమైన అసంతృప్తి నెలకొంది. ఎందుకంటే పార్టీ కోసం మొదటి నుండి ఎంతో కష్టపడి పనిచేసిన వారిలో ఎవరికో ఒకరికి ఇవ్వకుండా, అసలు పార్టీ తో సంబంధం ఉందో , లేదో తెలియని తెలుగు దేశం పార్టీ కి సంబంధించిన లింగమనేని రమేష్ ని రాజ్యసభ కు పంపడం ఏంటి?, ఇది సరైన నిర్ణయం కాదు అంటూ పవన్ కళ్యాణ్ ని కొంతమంది జనసైనికులు తప్పుబట్టారు. అయితే లింగమనేని రమేష్ తెలుగు దేశం పార్టీ కి సంబంధించిన వ్యక్తి కాదు. 2014 లో పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినప్పటి నుండి ఆయనకు తోడుగా ఉంటూ వచ్చిన అతి తక్కువమంది లో ఒకరు లింగమనేని రమేష్. జనసేన పార్టీ కి అన్ని రకాల అవసరాలను తీర్చిన వ్యక్తి ఆయన. అంతే కాదు ఆ పార్టీ కి ఆర్థికంగా లింగమనేని రమేష్ చేసిన సేవలు కూడా వర్ణనాతీతం.

అందుకే పవన్ కళ్యాణ్ అతని పేరు ని ప్రకటించడాన్ని అంటున్నారు. ఇకపోతే తనని రాజ్యసభకు ఎంపిక చేసినందుకు గానూ , పవన్ కళ్యాణ్ కి కృతఙ్ఞతలు తెలియజేస్తూ లింగమనేని రమేష్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఆయన మాట్లాడుతూ ‘జనసేన పార్టీ తరుపున రాజ్యసభకు నన్ను ఎంపిక చేసినందుకు మా పార్టీ అధ్యక్షులు , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి కృతఙ్ఞతలు తెలియజేస్తున్నాను. కూటమి తరుపున నా అభ్యర్థిత్వానికి మద్దతు తెలిపిన ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు నాయుడు గార్లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇది నాకు ఒక బలమైన బాధ్యత. సాధారణ పౌరుడి గొంతు ని వినిపించడమే లక్ష్యంగా నేను పని చేస్తాను’ అంటూ చెప్పుకొచ్చాడు రమేష్.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular