Amaravati Capital : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం దూకుడు మీద ఉంది. ముఖ్యంగా అమరావతి విషయంలో వరుస నిర్ణయాలు తీసుకుంటుంది. 2028లో తొలిదశ పనులు పూర్తిచేసి ప్రారంభోత్సవం చేయాలన్న సంకల్పంతో ఉంది రాష్ట్ర ప్రభుత్వం. అలాగే విజయవాడ, అమరావతి మధ్య భవిష్యత్తులో కృష్ణా నదిపై వంతెనల నిర్మాణాల పైన కూడా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అమరావతి పరిధిపై ఇప్పటికే స్పష్టత ఇచ్చారు. విజయవాడ, గుంటూరు కలిపి మెగా సిటీగా రాజధాని పైన పరిశీలన చేయాలని నిర్ణయించారు. తాజాగా అమరావతి ప్రణాళికలు,, నిర్ణయాల అమలుపైన సి ఆర్ డి ఏ అధారిటీ సమీక్ష చేసింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది.
* 29 గ్రామాలతోనే రాజధాని..
ఇప్పటివరకు 29 గ్రామాలే రాజధాని పరిధిగా ఉండేది. అయితే ఇప్పుడు విజయవాడ, గుంటూరు కలిపి మెగాసిటీ చేయాలనే ప్రణాళికను పరిశీలన చేసి.. నిర్ణయాలు తీసుకోవాలని డిసైడ్ అయ్యారు. నిర్మాణంలో ఉన్న భవనాలు, రోడ్ల పైన అధికారులు వివరాలు సమర్పించారు. ఇన్నర్ రింగ్ రోడ్, రైల్వే లైన్ నిర్మాణానికి భూమిని కూడా సేకరిస్తున్నారు. మరోవైపు అమరావతి రాజధాని నిర్మాణ పనులను ఇప్పుడు చంద్రబాబు పర్యవేక్షిస్తున్నారు. పనుల్లో జాప్యం జరుగుతుండడం పై దృష్టి పెట్టారు. కేవలం 29 గ్రామాల పరిధితో మహానగరం నిర్మాణం అనేది అసాధ్యమని.. ఒకవైపు అమరావతి నిర్మాణం చేపడుతూనే… పరిధి పెంచుకుంటూ విజయవాడ, గుంటూరుకు విస్తరించాలన్నది ప్రభుత్వ ప్రణాళికగా తెలుస్తోంది.
* కేంద్రం సాయం..
మరోవైపు కేంద్ర ప్రభుత్వం అమరావతి రాజధానికి 1100 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఇక్కడ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శాశ్వత గృహ వసతి కల్పించనుంది. దీని ద్వారా వివిధ శాఖల అధికారులు అమరావతిలో స్థిరపడేందుకు… నగర పరిపాలన వ్యవస్థ వేగంగా విస్తరించినందుకు మార్గం సుగమం కానుంది.. కేంద్ర ప్రభుత్వ సాయాన్ని తీసుకోవడం ద్వారా ప్రాధాన్యత ప్రాజెక్టుగా ప్రపంచం గుర్తించేలా చూస్తున్నారు. మరోవైపు 29 గ్రామాలతో మహానగరం నిర్మించడం అసాధ్యమని.. భవిష్యత్తులో అటు విజయవాడ.. ఇటు గుంటూరు ను కలుపుతూ నిర్ణయం తీసుకోవడం వల్ల.. ఆ రెండు నగరాలకు ప్రాధాన్యం ఇచ్చినట్లు అవుతుంది. అక్కడ అభివృద్ధికి ఊతం ఇచ్చినట్లు అవుతుంది. ఈ ప్రకటన రెండు నగరాల అభివృద్ధికి గేమ్ చేంజర్ గా మారుతుంది అనడం ఎటువంటి అతిశయోక్తి కాదు.