Homeఎంటర్టైన్మెంట్Prashant Kishor: ప్రశాంత్ కిషోర్ ను పిలిపించుకుంటున్న జగన్!

Prashant Kishor: ప్రశాంత్ కిషోర్ ను పిలిపించుకుంటున్న జగన్!

Prashant Kishor: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని చూస్తోంది. ఒక విధంగా ఆ పార్టీకి 2029 ఎన్నికలు జీవన్మరణ సమస్యలాంటివి. ఈసారి కానీ ఓడిపోతే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కనుమరుగు కావడం ఖాయం. అందుకే జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు ఆ ఎన్నికలను. పాదయాత్రతో ప్రజల మధ్యకు వెళ్లి వారి అభిమానాన్ని పొందాలని చూస్తున్నారు. అయితే కేవలం ప్రజలతో మమేకం కావడమే కాదు.. వ్యూహాలు ముఖ్యమని భావిస్తున్నారు. అందుకే సరైన వ్యూహకర్త కోసం అన్వేషణ చేస్తున్నారు. అయితే మళ్లీ ప్రశాంత్ కిషోర్ ను తెచ్చుకుంటే మంచిది అని సన్నిహితులు సూచిస్తున్నట్లు సమాచారం. మరోవైపు తెలంగాణలో కేసీఆర్ కు సైతం ప్రశాంత్ కిషోర్ సేవలందిస్తున్న దృష్ట్యా.. ఏపీలో సైతం పీకే సేవలను పొందాలని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో వారిద్దరిది మంచి కాంబినేషన్. మరోసారి దాన్ని రిపీట్ చేయాలని చూస్తున్నట్లు సమాచారం.

* చాలా పార్టీలకు విజయాలు..
ప్రశాంత్ కిషోర్( Prashant Kishor ) ఎన్నికల వ్యూహ కర్తగా చాలా పార్టీలకు విజయాలను అందించారు. 2014లో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చేందుకు అవసరమైన సాయాన్ని కూడా అందించారు తన వ్యూహాలతో. పట్టు తర్వాత మమతా బెనర్జీ, స్టాలిన్ వంటి వారికి సేవలు అందించారు. వారి పార్టీలను అధికారంలోకి తీసుకు రాగలిగారు. ఏపీలో జగన్మోహన్ రెడ్డికి 2019 ఎన్నికల్లో వ్యూహకర్తగా పనిచేసే విజయాన్ని అందించారు ప్రశాంత్ కిషోర్. తెలంగాణలో కెసిఆర్ కు విలువైన సేవలు అందిస్తూ వచ్చారు. మొన్నటి ఎన్నికల్లో కూటమికి సలహాలు అందించారు ప్రశాంత్ కిషోర్. ప్రత్యేక విమానంలో అమరావతికి వచ్చి మరి చంద్రబాబుతో సమావేశమయ్యారు. కూటమి అధికారంలోకి వచ్చేందుకు దోహదపడ్డారు. 2019లో జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత ప్రశాంత్ కిషోర్ రమేష్ దూరమయ్యారు. బీహార్లో సొంత పార్టీని ఏర్పాటు చేసి ఎన్నికల్లో పోటీ చేశారు. కానీ ఓటమి తప్పలేదు ప్రశాంత్ కిషోర్ కు.

* తెలంగాణలోనూ కీలకంగా
రాజకీయ పార్టీ ఏర్పాటు చేసి ఫెయిల్ కావడంతో మళ్ళీ స్ట్రాటజిస్ట్ గా సేవలు అందించాలని నిర్ణయం తీసుకున్నారట ప్రశాంత్ కిషోర్. ఈ తరుణంలో తెలంగాణలో కొత్త పార్టీ పెడుతున్న కవితకు కూడా సలహాలు ఇస్తున్నారు. కెసిఆర్ కు సైతం వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి పనిచేయాలన్న ప్రతిపాదన ప్రశాంత్ కిషోర్ వద్దకు వెళ్లినట్లు తెలుస్తోంది. దీనిపై సానుకూలంగా స్పందించిన పీకే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి వ్యూహకర్తగా సేవలందించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే జగన్మోహన్ రెడ్డితో భేటీ తర్వాత దీనిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular