Homeఎంటర్టైన్మెంట్Jabardasth Rakesh: గ్రాండ్ గా జరిగిన జబర్దస్త్ రాకేష్, జోర్దార్ సుజాత కూతురు పుట్టినరోజు వేడుక.....

Jabardasth Rakesh: గ్రాండ్ గా జరిగిన జబర్దస్త్ రాకేష్, జోర్దార్ సుజాత కూతురు పుట్టినరోజు వేడుక.. ఫోటోలు వైరల్..

Jabardasth Rakesh: బుల్లితెర పై ఎంటర్టైన్మెంట్ షోస్ తో బాగా ఫేమస్ అయిన కమెడియన్స్ లో ఒకరు రాకేష్. ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ షో ద్వారా రాకింగ్ రాకేష్ గా ఈయన అందించిన ఎంటర్టైన్మెంట్ మామూలుది కాదు. ఇప్పటికీ టీవీ షోస్ లో కొనసాగుతూనే ఉన్నాడు ఈయన. గత కొంతకాలం నుండి స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న ‘కుకూ విత్ జాతి రత్నాలు 2’ షో లో ‘కుక్’ గా అద్భుతమైన వంటకాలను […]

Jabardasth Rakesh: బుల్లితెర పై ఎంటర్టైన్మెంట్ షోస్ తో బాగా ఫేమస్ అయిన కమెడియన్స్ లో ఒకరు రాకేష్. ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ షో ద్వారా రాకింగ్ రాకేష్ గా ఈయన అందించిన ఎంటర్టైన్మెంట్ మామూలుది కాదు. ఇప్పటికీ టీవీ షోస్ లో కొనసాగుతూనే ఉన్నాడు ఈయన. గత కొంతకాలం నుండి స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న ‘కుకూ విత్ జాతి రత్నాలు 2’ షో లో ‘కుక్’ గా అద్భుతమైన వంటకాలను అందిస్తూనే , మరో పక్క కడుపుబ్బా నవ్విస్తూ తిరుగులేని ఎంటర్టైన్మెంట్ అందిస్తూ ప్రేక్షకులకు రాకేష్ ఇంకా బాగా దగ్గరయ్యాడు. ఈ వారం తో ఈ షో ముగియనుంది. ఈ షో టైటిల్ విన్నర్ గా తనూజ నిలబడగా , రాకేష్ టాప్ 5 స్థానం లో ఎలిమినేట్ అయ్యాడు. ఇదంతా పక్కన పెడితే రాకేష్ సోషల్ మీడియా ద్వారా కూడా నెటిజెన్స్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు.

తన వ్యక్తిగత విషయాలకు సంబంధించిన ఫోటోలు , వీడియోలు షేర్ చేస్తూ ఉంటాడు. రీసెంట్ గా ఆయన ఇన్ స్టాగ్రామ్ లో తన కూతురు ఖ్యాతిక పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఫోటోలను అప్లోడ్ చేశాడు. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఎంతో క్యూట్ గా కనిపిస్తున్న ఖ్యాతిక కి నెటిజెన్స్ శుభాకాంక్షల వెల్లువ కురిపిస్తున్నారు. కొన్నేళ్ల క్రితం రాకేష్ ప్రముఖ టీవీ రిపోర్టర్ జోర్డర్ సుజాత ని పెళ్లాడిన సంగతి తెలిసిందే. జబర్దస్త్ కామెడీ షో ద్వారా వీళ్లిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమ గా మారి , పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఎంతో మంచి సాన్నిహిత్యం తో కొనసాగుతూ వస్తున్న ఈ జంటకు సోషల్ మీడియా లో కూడా మంచి క్రేజ్ ఉంది.

వీళ్లిద్దరు కలిసి ఇప్పటికీ కూడా టీవీ షోస్ లో అప్పుడప్పుడు కనిపిస్తూనే ఉంటారు. ఇకపోతే త్వరలోనే ప్రసారం అవ్వబోయే ‘బిగ్ బాస్ 10 ‘ లో కూడా రాకేష్ ఒక కంటెస్టెంట్ గా పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఆయన సతీమణి సుజాత ‘బిగ్ బాస్ 5’ లో ఒక కంటెస్టెంట్ గా పాల్గొన్నది. కానీ దురదృష్టం కొద్దీ ఆమె షో మధ్యలోనే ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది. కానీ రాకేష్ బిగ్ బాస్ షో లోకి వస్తే కచ్చితంగా ఫినాలే వరకు ఉండే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు విశ్లేషకులు. అంతే కాదు కమెడియన్స్ లీగ్ లో మొట్టమొదటి టైటిల్ విన్నర్ గా నిలిచే అవకాశాలు కూడా రాకేష్ కి ఉన్నాయి , చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper