Rashmi Gautam: బుల్లితెర పై టీవీ షోస్ లో యాంకర్ గా కొనసాగుతూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ని సొంతం చేసుకున్న రష్మీ గురించి తెలియని వాళ్లంటూ ఎవ్వరూ ఉండరు. ఒకప్పుడు చిన్న చిన్న షోస్ కి యాంకర్ గా వ్యవహరిస్తూ, అడపాదడపా సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ చేస్తూ కెరీర్ ని నెట్టుకొచ్చిన రష్మీ కి , ‘జబర్దస్త్’ షో ద్వారా మంచి క్రేజ్ దక్కిందనే చెప్పాలి. ఈ షో ద్వారా వచ్చిన క్రేజ్ తో ఆమెకు అనేక టీవీ షోస్ లో యాంకర్ గా వ్యవహరించే అవకాశాలు వచ్చాయి. ఈటీవీ , మాటీవీ అని తేడా లేకుండా అన్ని చానెల్స్ లోనూ ఈమె యాంకర్ గా పని చేసింది. చాలా పెద్ద రేంజ్ కి వెళ్ళింది. అలా టీవీ షోస్ ద్వారా వచ్చిన క్రేజ్ తో ఈమె సినిమాల్లో హీరోయిన్ గా నటించే రేంజ్ కి ఎదిగింది.
కానీ ఈమె హీరోయిన్ గా చేసిన సినిమాల్లో కేవలం ‘గుంటూరు టాకీస్’ మాత్రమే సూపర్ హిట్ గా నిల్చింది. మిగిలిన సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఈమధ్య కాలం లో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన హీరోయిన్స్ అందరికంటే రష్మీ ఎంతో అందంగా , హాట్ గా ఉంటుంది. అయినప్పటికీ ఈమెకు ఎందుకు అవకాశాలు రావడం లేదో అర్థం కావడం లేదంటూ సోషల్ మీడియా లో ఈమెని అభిమానించే వాళ్ళు కామెంట్స్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఇన్ స్టాగ్రామ్ లో ఈమె అప్లోడ్ చేసే కొన్ని హాట్ ఫొటోస్ ని చూస్తే , హీరోయిన్స్ కి ఏ మాత్రం తీసిపోవట్లేదు అనే భావన కచ్చితంగా కలుగుతుంది. రీసెంట్ గా ఈమె ఒక ఓడలో సముద్రం మధ్యలోకి వెళ్లి , ఫోటో షూట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఆ వీడియో లో రష్మీ అందాలను చూసిన కుర్రాళ్ళు మెంటలెక్కిపోతున్నారు.
ఈ వీడియో ని అభిమానులు షేర్ చేస్తూ , కొన్ని ఎడిటింగ్స్ కూడా చేశారు. నాకు బీచ్ ని చూపిస్తావా అని రష్మీ అడిగితే , బీచ్ కే నిన్ను చూపిస్తా అంటూ హీరో డైలాగ్ చెప్తున్నట్టుగా ఎడిట్ చేసిన ఈ వీడియో కి సోషల్ మీడియా లో భారీ రేంజ్ లో వ్యూస్ వచ్చాయి. దాన్ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి. ఈ వీడియో లో రష్మీ అందాన్ని చూస్తుంటే , ఆ డైలాగ్ పర్ఫెక్ట్ గా సూట్ అయ్యిందని అనిపిస్తోంది. ఇక రష్మీ కెరీర్ విషయానికి వస్తే , నిన్న మొన్నటి వరకు ఈమె ‘జబర్దస్త్’, ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ షోస్ కి యాంకర్ గా వ్యవహరిస్తూ వచ్చింది . కానీ ఇప్పుడు కేవలం ‘జబర్దస్త్’ కి మాత్రమే యాంకర్ గా పనిచేస్తోంది. ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ షో కి ఈమెకు బదులుగా ప్రదీప్ రంగం లోకి దిగాడు.
View this post on Instagram