Homeఎంటర్టైన్మెంట్Jabardasth Actress Varsha: అర్థరాత్రి అతను నాతో అలా ప్రవర్తించాడంటూ బోరున ఏడ్చిన జబర్దస్త్ వర్ష.....

Jabardasth Actress Varsha: అర్థరాత్రి అతను నాతో అలా ప్రవర్తించాడంటూ బోరున ఏడ్చిన జబర్దస్త్ వర్ష.. వీడియో వైరల్..

Jabardasth Actress Varsha: జబర్దస్త్ కామెడీ షో ద్వారా బాగా పాపులారిటీ ని సంపాదించిన వారిలో ఒకరు వర్ష. కెరీర్ ప్రారంభం లో కొన్ని సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేస్తూ వచ్చిన ఆమె , ఆ తర్వాత జబర్దస్త్ షో లో కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చి బాగా ఫేమస్ అయ్యింది. ముఖ్యంగా ఇమ్మానుయేల్ తో కలిసి ఈమె చేసే కామెడీ బాగా హైలైట్ అయ్యేది. చాలా మంది వీళ్లిద్దరి మధ్య ఉన్నటువంటి కెమిస్ట్రీ ని […]

Jabardasth Actress Varsha: జబర్దస్త్ కామెడీ షో ద్వారా బాగా పాపులారిటీ ని సంపాదించిన వారిలో ఒకరు వర్ష. కెరీర్ ప్రారంభం లో కొన్ని సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేస్తూ వచ్చిన ఆమె , ఆ తర్వాత జబర్దస్త్ షో లో కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చి బాగా ఫేమస్ అయ్యింది. ముఖ్యంగా ఇమ్మానుయేల్ తో కలిసి ఈమె చేసే కామెడీ బాగా హైలైట్ అయ్యేది. చాలా మంది వీళ్లిద్దరి మధ్య ఉన్నటువంటి కెమిస్ట్రీ ని చూసి , కచ్చితంగా వీళ్ళ మధ్య ఎదో నడుస్తుంది అంటూ ప్రచారం కూడా చేశారు. అయితే అందులో ఎలాంటి నిజం లేదని కొన్ని సంఘటనల ద్వారా తెలిసింది. ఇప్పటికీ జబర్దస్త్ మరియు ఇతర ఈటీవీ ఎంటర్టైన్మెంట్ షోస్ లో కొనసాగుతూ వస్తున్న వర్ష, రీసెంట్ గా ‘కిస్సిక్ టాక్స్’ అనే యూట్యూబ్ టాక్ షో ద్వారా నెటిజెన్స్ కి కూడా బాగా దగ్గరైంది.

ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గానే ఈటీవీ లో మొదలైన ‘ఫ్యామిలీ స్టార్స్ 2’ ప్రోగ్రాం లో వర్ష కూడా పాల్గొన్నది. సుడిగాలి సుధీర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ ఎంటర్టైన్మెంట్ షో ప్రతీ ఆదివారం రాత్రి 7 గంటల 30 లక్షలకు టెలికాస్ట్ అవుతుంది. ఈ వారం టెలికాస్ట్ అయ్యే ఎపిసోడ్ కి వర్ష హాజరైంది. ఆ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ని కాసేపటి క్రితమే విడుదల చేశారు. ఈ ప్రోమో లో వర్ష మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఆమె మాట్లాడుతూ ‘ఒక రోజు అర్థ రాత్రి 2 గంటల 30 నిమిషాలు అయ్యింది. ఆ సమయం లో అతను నా గదిలోకి ప్రవేశించి ఎందుకు అలా ప్రవర్తించాడో ఇప్పటికీ నాకు అర్థం కావడం లేదు’ అంటూ కన్నీళ్లు పెట్టుకొని భావోద్వేగానికి గురైంది.

ఆమె మాట్లాడిన మాటలకు ఆ షో కి వచ్చిన మిగిలిన సెలబ్రిటీలు కూడా బాగా ఎమోషనల్ అయిపోయారు. ఆ తర్వాత ఆమె పక్కనే ఉన్నవారు ఓదార్చే ప్రయత్నం చేశారు , సుడిగాలి సుధీర్ కూడా కంటతడి పెట్టుకున్నాడు. అయితే ఇంతకు వర్ష చెప్పిన పూర్తి మాటలను మాత్రం ఈ ప్రోమో లో చూపించలేదు. కొంత మ్యూట్ చేసి , విచారకరమైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ని ప్లే చేశారు. మరి ఆమె ఏమి మాట్లాడిందో తెలుసుకోవాలంటే ఈ ఆదివారం వరకు ఎదురు చూడక తప్పదు. అయితే కొన్ని సార్లు విషయం ఏమి లేకపోయినప్పటికీ ప్రోమో కట్ వ్యూస్ కోసం ఇలాంటి ఎడిట్స్ చేస్తుంటారు మేకర్స్. ఇది కూడా అందులో భాగమేనా ?, లేదంటే నిజంగానే వర్ష ఏడుస్తూ మాట్లాడిందా అనేది చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper