Homeఎంటర్టైన్మెంట్Salman Khan: 70 మందికి ఒకే టాయిలెట్... జైలు జీవితాన్ని గుర్తుచేసుకున్న సల్మాన్ ఖాన్...

Salman Khan: 70 మందికి ఒకే టాయిలెట్… జైలు జీవితాన్ని గుర్తుచేసుకున్న సల్మాన్ ఖాన్…

Salman Khan: ప్రముఖ ఓటిటి సంస్థ అయిన అమెజాన్ వీడియో ప్రైమ్ వాళ్లు ‘అలయాన్స్’ అనే ఒక రియాల్టీ షో ను నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే రీసెంట్ గా ఒక ఎపిసోడ్ కి బాలీవుడ్ స్టార్ హీరో ‘సల్మాన్ ఖాన్’ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యాడు… ఇందులో తన సోదరుడు అయిన సోహైల్ ఖాన్ సైతం ఈ షోలో కంటెస్టెంట్ కావడంతో సల్మాన్ ఖాన్ పాల్గొని కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు. ముఖ్యంగా తను గతంలో కృష్ణ […]

Salman Khan: ప్రముఖ ఓటిటి సంస్థ అయిన అమెజాన్ వీడియో ప్రైమ్ వాళ్లు ‘అలయాన్స్’ అనే ఒక రియాల్టీ షో ను నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే రీసెంట్ గా ఒక ఎపిసోడ్ కి బాలీవుడ్ స్టార్ హీరో ‘సల్మాన్ ఖాన్’ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యాడు… ఇందులో తన సోదరుడు అయిన సోహైల్ ఖాన్ సైతం ఈ షోలో కంటెస్టెంట్ కావడంతో సల్మాన్ ఖాన్ పాల్గొని కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు. ముఖ్యంగా తను గతంలో కృష్ణ జింకను వేటాడినందుకు గాను ఆయన కొన్ని రోజులపాటు జైల్లో ఉన్న విషయం తెలిసిందే. ఇక ఆ జైల్లో ఉన్నప్పుడు 60 – 70 మందితో కలిసి ఒకే రూమ్ లో ఉండాల్సి వచ్చేదని వాళ్ళందరికి కలిపి ఓకే టాయిలెట్ ఉండేదని అది ఇండియన్ స్టైల్ లో ఉండే టాయిలెట్ కావడం వల్ల చాలా రకాల ఇబ్బందులను ఎదుర్కొన్నానని చెప్పాడు. అలాగే రూమ్ లో బల్లులు, నల్లులు కూడా ఉండేవని మురుగు వాసన వస్తుండదని అయినప్పటికి వాటిని తట్టుకొని జైల్లో ఒక గడ్డు పరిస్థితిని అనుభవించానని చెప్పాడు.

1988వ సంవత్సరంలో కృష్ణాజింక ను వేటాడిన కేసులో ఆయన 3 రోజులపాటు జైలుకు వెళ్లాడు. ఆ తర్వాత 2006 వ సంవత్సరంలో 6 రోజులు, 2007వ సంవత్సరంలో 6 రోజులు, 2018 వ సంవత్సరంలో 2 రోజులు ఇలా మొత్తం మీద ఆయన 18 రోజుల పాటు తన జైలు జీవితాన్ని గడిపాడు.

ఇక ఇదిలా ఉంటే ఈ షోలో ఆయన ఎదుర్కొన్న దుర్భరమైన పరిస్థితిలను గుర్తు చేసుకుంటూనే తను ఏ తప్పు చేయలేదని తన మనస్సాక్షికి తెలుసు…అందువల్లే తలెత్తుకుని జైలుకు వెళ్లి మళ్లీ తిరిగి వచ్చాను అంటూ చాలా గర్వంగా చెప్పుకున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా ప్రస్తుతం సల్మాన్ ఖాన్ సినిమాలపరంగా కొంతవరకు వెనుకబడ్డాడనే చెప్పాలి.

ప్రస్తుతం తన తోటి హీరోలందరు ముందుకు సాగుతుంటే సల్మాన్ ఖాన్ వరుస ఫెయిల్యూర్ తో సతమతమవుతున్నాడు. ఇక అలాంటి సల్మాన్ ఖాన్ ఇప్పుడు వంశీ పైడిపల్లి డైరెక్షన్లో చేస్తున్న సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించాల్సిన అవసరమైతే ఉంది. లేకపోతే మాత్రం ఆయన తన పూర్తి ఫామ్ ను కోల్పోవాల్సిన పరిస్థితి రావచ్చు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper