Homeఎంటర్టైన్మెంట్Jabardasth Nookaraju: చిన్నప్పుడు ఒక్క యాపిల్ తినడం కోసం.. జబర్దస్త్ నూకరాజు ఎమోషనల్ కామెంట్స్..

Jabardasth Nookaraju: చిన్నప్పుడు ఒక్క యాపిల్ తినడం కోసం.. జబర్దస్త్ నూకరాజు ఎమోషనల్ కామెంట్స్..

Jabardasth Nookaraju: సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి , నేడు పెద్ద స్థాయికి చేరుకొని లగ్జరీ జీవితాలను ఎంజాయ్ చేస్తున్న సెలబ్రిటీలకు ఆ స్థానం అంత తేలికగా రాలేదు. వాళ్ళు ఇండస్ట్రీ లోకి వచ్చే ముందు చేసే పనుల గురించి చెప్తే అసలు మనం కలలో అయినా ఇలాంటి పనులు చేయగలమా?, వాళ్ళు అనుభవించిన కష్టాలతో పోలిస్తే మనం పడిన కష్టం అసలు లెక్కలోకి రాదు , ఇంకా ఎక్కువ కష్టపడాలి అనే ఆలోచన కలుగుతుంది. అంతటి […]

Jabardasth Nookaraju: సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి , నేడు పెద్ద స్థాయికి చేరుకొని లగ్జరీ జీవితాలను ఎంజాయ్ చేస్తున్న సెలబ్రిటీలకు ఆ స్థానం అంత తేలికగా రాలేదు. వాళ్ళు ఇండస్ట్రీ లోకి వచ్చే ముందు చేసే పనుల గురించి చెప్తే అసలు మనం కలలో అయినా ఇలాంటి పనులు చేయగలమా?, వాళ్ళు అనుభవించిన కష్టాలతో పోలిస్తే మనం పడిన కష్టం అసలు లెక్కలోకి రాదు , ఇంకా ఎక్కువ కష్టపడాలి అనే ఆలోచన కలుగుతుంది. అంతటి క్రింది స్థాయి నుండి వచ్చిన వాళ్ళు ఇండస్ట్రీ లో ఉన్నారు. అలాంటి వారిలో ఒకరు నూకరాజు. ‘జబర్దస్త్’ షో ద్వారా కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈయన, కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులకు తన కామెడీ టైమింగ్ తో బాగా దగ్గరయ్యాడు. జబర్దస్త్ తో పాటు , ఒకప్పుడు ఈటీవీ లో ప్రసారమైన ప్రతీ కామెడీ షో లో నూకరాజు ఉండేవాడు.

కేవలం కామెడీ చేయడమే కాదు , ఇతను అద్భుతంగా పాడగలడు కూడా. ఇలా మల్టీ టాలెంటెడ్ గా ఎంతో మంచి పేరు తెచ్చుకున్న నూకరాజు , ఇప్పుడు స్టార్ మా ఛానల్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ముందుగా ‘మ్యాడ్ ఫర్ ఈచ్ అథర్ ‘ షో లో తన ప్రేయసి ఆసియా తో కలిసి ఎంట్రీ ఇచ్చి , మంచి ఎంటర్టైన్మెంట్ ని అందించాడు. ఆ తర్వాత ఆడియన్స్ ద్వారా వచ్చిన ఓట్లతో రన్నర్ గా నిల్చిన నూకరాజు, ఇప్పుడు ‘కుకూ విత్ జాతి రత్నాలు 2’ లో జాతి రత్నం గా షో మధ్యలో ఎంట్రీ ఇచ్చి , ఆడియన్స్ ని ఒక రేంజ్ లో ఎంటర్టైన్ చేస్తున్నాడు. త్వరలోనే మొదలయ్యే ‘బిగ్ బాస్ 10’ లో ఈయనకు ఒక కంటెస్టెంట్ గా కూడా పాల్గొనే అవకాశం ఉందని అంటున్నారు. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గానే నూకరాజు ఒక టాక్ షో లో పాల్గొన్నాడు.

ఈ టాక్ షో లో తన జీవితం లో జరిగిన కొన్ని సంఘటనలను తలచుకొని బాగా ఎమోషనల్ అయ్యాడు. ఆయన మాట్లాడుతూ ‘చిన్నతనం లోనే చాలా కష్టాలను అనుభవించాను. మాది నిరుపేద కుటుంబం. చిన్న పాకలో ఉండేవాళ్ళం. వర్షం వస్తే మా ఇల్లు మొత్తం నీళ్లలో మునిగిపోయేది. తినడానికి తిండి కూడా సరిగా ఉండేది కాదు. చికెన్ తినాలంటే రెండు మూడు వారాలు ఎదురు చూసే రోజులు ఇంకా గుర్తు ఉన్నాయి. సంక్రాంతి పండుగ రోజున ప్రతీ ఒక్కరు కొత్త బట్టలు వేసుకొని ఎంజాయ్ చేస్తుంటే , మేము మాత్రం పనికి వెళ్ళేవాళ్ళం. ఇంట్లో కనీసం యాపిల్స్ కూడా కొనేవారు కాదు. కేవలం జ్వరం వచ్చినప్పుడు మాత్రమే యాపిల్స్ తినేవాళ్ళం. చేతిలో పైసా ఉండేది కాదు. మా నాన్న కి ఏదైనా రోగం వస్తే , బంగారం తాకట్టు పెట్టాల్సి వచ్చేది. అలాంటి ఎన్నో బాధాకరమైన పరిస్థితుల నుండి ఇండస్ట్రీ లోకి వచ్చాను’ అంటూ చెప్పుకొచ్చాడు నూకరాజు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper