Homeహెల్త్‌Side Sleeping Benefits: బొర్లా పడుకుంటున్నారా..? ఇవి పనిచేయవు..

Side Sleeping Benefits: బొర్లా పడుకుంటున్నారా..? ఇవి పనిచేయవు..

Side Sleeping Benefits: విద్యార్థులు, ఉద్యోగులు, గృహిణులు, వృద్దులు సైతం రకరకాల పనులతో రోజంతా బిజీగా ఉంటారు. సాయంత్రం కాగానే శరీరానికి విశ్రాంతిని ఇవ్వడానికి నిద్రపోతారు. అయితే ఎంతసేపు నిద్రపోయామన్నదే కాదు.. ఎలా నిద్రపోతున్నామనేది చాలా ఇంపార్టెంట్ అని కొందరు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చాలా వరకు కొంతమంది బోర్లా పడుకునే ప్రయత్నం చేస్తారు. ఇలా పడుకుంటే సౌకర్యాంగా ఉంటుందని అనుకుంటారు. కానీ బొర్లా పడుకోవడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అవేంటి? […]

Side Sleeping Benefits: విద్యార్థులు, ఉద్యోగులు, గృహిణులు, వృద్దులు సైతం రకరకాల పనులతో రోజంతా బిజీగా ఉంటారు. సాయంత్రం కాగానే శరీరానికి విశ్రాంతిని ఇవ్వడానికి నిద్రపోతారు. అయితే ఎంతసేపు నిద్రపోయామన్నదే కాదు.. ఎలా నిద్రపోతున్నామనేది చాలా ఇంపార్టెంట్ అని కొందరు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చాలా వరకు కొంతమంది బోర్లా పడుకునే ప్రయత్నం చేస్తారు. ఇలా పడుకుంటే సౌకర్యాంగా ఉంటుందని అనుకుంటారు. కానీ బొర్లా పడుకోవడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అవేంటి? ఎలా నిద్రిస్తే ప్రయోజనం? .

బోర్లా పడుకోవడం వల్ల పొట్టపై శరీరం సహజ స్థితిలో ఉండదు. తలను ఒక వైపుకు తిప్పి ఎక్కువసేపు ఉంచాల్సి రావడంతో మెడ కండరాలపై అధిక ఒత్తిడి పడుతుంది. అలాగే వెన్నెముక సహజ వంపు మారి నడుము నొప్పి, మెడ నొప్పి వంటి సమస్యలు రావచ్చు. ఇలా చాలా రోజులు నిద్రపోవడం వల్ల భుజాలు, కీళ్లపై కూడా అదనపు భారం పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఛాతీ, పొట్టపై ఒత్తిడి పెరగడం వల్ల శ్వాస తీసుకోవడం కొంత కష్టంగా అనిపించవచ్చు.

భోజనం చేసిన వెంటనే ఇలా పడుకోవడం వల్ల కడుపుపై ఒత్తిడి పెరిగి జీర్ణక్రియ మందగించే అవకాశం ఉంది. కొందరిలో గ్యాస్, అజీర్ణం, గుండెల్లో మంట వంటి సమస్యలు ఎక్కువయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకే రాత్రి భోజనం చేసిన వెంటనే పడుకోకుండా కనీసం రెండు నుంచి మూడు గంటల గ్యాప్ ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు.

వైద్యుల సూచన ప్రకారం.. ఎడమవైపు తిరిగి పడుకోవడం చాలా మందికి అనుకూలం. ఈ స్థితిలో కడుపు, పేగుల నిర్మాణానికి అనుగుణంగా ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు, ఆసిడ్ రిఫ్లక్స్ వచ్చే అవకాశాలు తగ్గవచ్చు. గర్భిణీలకు కూడా రక్తప్రసరణ మెరుగ్గా ఉండేందుకు ఎడమవైపు పడుకోవాలని వైద్యులు తరచూ సూచిస్తుంటారు.

నిద్రిస్తున్న సమయంలో కొంత మంది గురక పెట్టే అవకాశం ఉంటుంది. నాలుక వెనక్కి జారడం వల్ల శ్వాసనాళం కొంత మూసుకుపోయి గురక ఎక్కువగా వస్తుంది. అలాంటి సందర్భాల్లో పక్కకు తిరిగి పడుకోవడం వల్ల శ్వాసనాళం తెరిచి ఉండేందుకు సహాయపడుతుంది. దీంతో గురక తగ్గుతుంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper