ఎక్కడో విజయవాడలో పుట్టాడు.. ఎటువంటి నేపథ్యం లేదు. ఇంటర్ తోనే చదువు ఆపేయాల్సి వచ్చింది. కాకపోతే తనకు మ్యాజిక్ తెలుసు. కుటుంబ బాధ్యతలు.. మరేంటో కారణాలు తెలియదు గాని హైదరాబాద్ వచ్చాడు. నేరుగా రామోజీ ఫిలిం సిటీ లోకి వాలిపోయాడు. తనకు తెలిసిన మ్యాజిక్ చేసుకుంటూ వెళ్లిపోయాడు. వారాంతపు సెలవు ఉండేది కాదు. అలానే పనిచేసుకుంటూ వెళ్ళాడు.
ఒకరోజు సంక్రాంతి ముందు అతడికి వేతనం వచ్చింది. ఆ రోజుల్లోనే అది 8000.. ఆ డబ్బులు పట్టుకొని ఆ సంతోషంతో హైదరాబాద్ నుంచి విజయవాడకు బయలుదేరాడు. ఇప్పట్లో మాదిరిగా అప్పట్లో విరివిగా బస్సులు ఉండేవి కావు. టికెట్లు కూడా ఆన్లైన్లో లభించేవి కాదు. విజయవాడ వెళ్లాలి.. మళ్లీ తిరిగి రావాలి.. ఇదే అతని మదిలో ఉంది. బస్సులు దొరకపోవడంతో లారీ ఎక్కాడు.. విజయవాడలో దిగాడు. అక్కకు.. తమ్ముడికి.. అమ్మకు.. నాన్నకు బట్టలు కొన్నాడు. వారి కళ్ళల్లో ఆనందాన్ని చూశాడు.
ఇంటర్లోనే ఇంత మెచ్యూరిటీ అంటే.. అతడి వ్యక్తిత్వం ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు. ఇంతటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్న ఆ వ్యక్తి మరెవరో కాదు బుల్లితెర సూపర్ స్టార్ సుడిగాలి సుదీర్.
సుడిగాలి సుదీర్ చలాకీగా ఉంటాడు. నవ్విస్తూ ఉంటాడు. స్పాంటేనిటీ ఉంటుంది. తన మీద పంచులు వేయించుకుంటాడు. ఎవరు ఎలా మాట్లాడినా సరే స్వీకరించగలుగుతాడు. ఒక షోలో ఒక ప్రముఖ హీరో కుమార్తె అతని రా అని పిలుస్తుంది. ప్రతి సందర్భంలోనూ కించపరచే విధంగా మాట్లాడుతూ ఉంటుంది దానిని కూడా అతడు చాలా సానుకూలంగా తీసుకుంటాడు. ఇలా తీసుకోవాలంటే చాలావరకు మానసిక దృక్పథం బలంగా ఉండాలి. అతడిలో అది పుష్కలంగా ఉంది కాబట్టి ఈరోజున బుల్లితెరను ఏలుతున్నాడు.
జీ తెలుగు.. స్టార్ మా.. ఈటీవీ.. ఇలా పేరుపొందిన ఎంటర్టైన్మెంట్ చానల్స్ లో అతడు తిరుగులేని స్థానంలో ఉన్నాడు. జీ తెలుగులో సరిగమప.. ఆట వంటి షోలను ముందుకు నడిపిస్తున్నాడు.. ఆహా ఓటీటీలో సర్కార్ షో ను తిరుగులేని స్థాయిలో లీడ్ చేస్తున్నాడు. స్టార్ మా లో పేరుపొందిన కార్యక్రమాలలో కనిపిస్తున్నాడు. ఇక ఈటీవీలో అయితే శ్రీదేవి డ్రామా కంపెనీ.. ఢీ.. జబర్దస్త్ వంటి షోలలో అతడు తిరుగులేని స్థాయిలో ఉన్నాడు.
వాస్తవానికి సుడిగాలి సుదీర్ కు రష్మికి మధ్య ఏదో ఉందని అందరూ అనుకుంటారు. అప్పట్లో వీరు చేసిన స్కిట్లు కూడా పేలాయి. బయటికి చెప్పుకున్నట్టు వీరిద్దరూ ప్రేమికులు కాదు. మంచి స్నేహితులు. వీరిద్దరి మధ్య ఏది లేకపోయినప్పటికీ ఏదో ఉందనుకొని సృష్టించిన స్కిట్స్.. ప్రత్యేకమైన షోలు యూట్యూబ్లో సంచలనాలు సృష్టించాయి. కేవలం బుల్లితెర మీద మాత్రమే కాకుండా వెండితెర మీద కూడా సుడిగాలి సుదీర్ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇప్పటికే ఆయన అనేక చిత్రాలలో నటించారు. కొన్ని సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి..సాఫ్ట్‌వేర్ సుధీర్ (Software Sudheer) (2019) – రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ గా ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేశారు సుధీర్. ఆ తర్వాత గాలోడు (Gaalodu) (2022) – యాక్షన్ రొమాంటిక్ డ్రామా..కాలింగ్ సహస్ర (Calling Sahasra) (2023) – క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్
జీ.ఓ.ఏ.టీ (G.O.A.T – Greatest Of All Time) – నరేష్ కుప్పిలి దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ ఎంటర్‌టైనర్
హైలెస్సో (Hailesso) – సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న మరో యాక్షన్ డ్రామా సినిమా
సుధీర్ జోకర్ (Sudheer Joker) – పీఎస్ పుప్పాల దర్శకత్వంలో ప్రకటించబడిన లేటెస్ట్ చిత్రం
ఇవి కాకుండా 3 మంకీస్ (3 Monkeys) (2020), ఎందుకో ఎమో (Enduko Emo) (2018), బంతి పూల జానకి (Banthi Poola Janaki) (2016) వంటి చిత్రాల్లో కూడా ఆయన కీలక పాత్రల్లో నటించారు.
బుల్లితెర మీద నవ్వుతూ కనిపించే సుడిగాలి సుదీర్ జీవితంలో పూడ్చలేని విషాదం ఉంది.ఆ విషా దానికి కారణం ఒక అమ్మాయి. ఒక అమ్మాయిని సుడిగాలి సుదీర్ మనస్ఫూర్తిగా ప్రేమించాడు. ఆమె లోకంగా బతికాడు. ఆమె కూడా ఇతని అదే స్థాయిలో ప్రేమించింది. కానీ అప్పటికి సుధీర్ జీవితంలో స్థిరపడలేదు. అప్పటిదాకా సుదీర్ లో ఒక ప్రేమికుడు కనిపించిన ఆ అమ్మాయికి.. ఆస్తిపరుడు.. స్థితిమంతుడు కనిపించలేదు. దీంతో తల్లిదండ్రులు చూసిన సంబంధానికి ఓకే చెప్పింది. ఫలితంగా ఆమె పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. సుధీర్ గుండె పగిలినంత పని అయిపోయింది. ఆ విషాదం నుంచి ఇంతవరకు కోలుకోలేదు. ఇంతవరకు మరో అమ్మాయికి తన జీవితంలో చోటు ఇవ్వలేదు. పైగా తనకంటే చిన్నవాడైన తమ్ముడు పెళ్లి చేసుకున్నప్పటికీ.. అతడు మాత్రం ఒంటరిగానే మిగిలిపోయాడు. ఇప్పటికీ ఆమె జ్ఞాపకాలలోనే జీవిస్తున్నాడు.. ఒక షోలో సుధీర్ పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడు..” నేను ఆమెను ప్రేమించాను. కానీ ఆమెకు లైఫ్లో సెటిల్ అయిన వ్యక్తి కావాల్సి వచ్చింది. అతడిని పెళ్లి చేసుకుంది. నన్ను ఒంటరిని చేసే వెళ్ళిపోయింది. ఆమె ఎక్కడ ఉన్నా సరే ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నట్టు” సుడిగాలి సుదీర్ వ్యాఖ్యానించాడు. దీనిని బట్టి అతడి మనస్తత్వం ఏమిటో అర్థం చేసుకోవచ్చు.
తనమీద పంచులు వేసుకుంటాడు. పంచులు వేస్తే తీసుకుంటాడు. ఎవరైనా లైన్ దాటినా సరే లైట్ తీసుకుంటాడు. కానీ తను మాత్రం డౌన్ టు ఎర్త్ లాగా కనిపిస్తున్నాడు. అందుకే బుల్లితెరను కొన్ని సంవత్సరాలుగా వన్ మెన్ ఆర్మీ లాగా ఏలుతున్నాడు. సుధీర్ అంటే జస్ట్ మూడు అక్షరాలు కాదు.. బుల్లితెర మీద సునామి. కీప్ రాకింగ్.. కీప్ గోయింగ్.. కీప్ షైనింగ్.. స్మాల్ స్క్రీన్ మెగాస్టార్ సుడిగాలి సుదీర్.. సైనింగ్ ఆఫ్ ఎనబోతుల భాస్కర్.. ఓకే తెలుగు కంటెంట్ రైటర్