Homeఎంటర్టైన్మెంట్Sudigali Sudheer: అనిల్ రావిపూడి ని దాటేసిన సుడిగాలి సుధీర్ రెమ్యూనరేషన్.. ఇది మామూలు మాస్...

Sudigali Sudheer: అనిల్ రావిపూడి ని దాటేసిన సుడిగాలి సుధీర్ రెమ్యూనరేషన్.. ఇది మామూలు మాస్ కాదు!

Sudigali Sudheer: బుల్లితెర పై బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఎవరు అని అడిగితే, ప్రతీ ఒక్కరు క్షణం కూడా ఆలోచించకుండా చెప్పే పేరు సుడిగాలి సుధీర్. ‘జబర్దస్త్’ లో తన కామెడీ టైమింగ్ తో ఈయన కోట్లాది మంది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. ఆ షో నుండి ఎంత మంది కమెడియన్స్ ఇండస్ట్రీ కి వచ్చినా , సుధీర్ స్థానం ఎంతో స్పెషల్ అనే చెప్పాలి. అంతే కాదు బుల్లితెర నుండి వెండితెర కి షిఫ్ట్ అయిన […]

Sudigali Sudheer: బుల్లితెర పై బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఎవరు అని అడిగితే, ప్రతీ ఒక్కరు క్షణం కూడా ఆలోచించకుండా చెప్పే పేరు సుడిగాలి సుధీర్. ‘జబర్దస్త్’ లో తన కామెడీ టైమింగ్ తో ఈయన కోట్లాది మంది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. ఆ షో నుండి ఎంత మంది కమెడియన్స్ ఇండస్ట్రీ కి వచ్చినా , సుధీర్ స్థానం ఎంతో స్పెషల్ అనే చెప్పాలి. అంతే కాదు బుల్లితెర నుండి వెండితెర కి షిఫ్ట్ అయిన నటీనటులకు పెద్దగా లైఫ్ ఉండదని అందరూ అంటుంటారు. కానీ సుధీర్ పరిస్థితి వేరు , సరైన కథ తో ప్రేక్షకుల ముందుకొస్తే కుంభస్థలాన్ని బద్దలు కొట్టేంత స్టామినా ఇతనికి ఉంది. ఇకపోతే రీసెంట్ గా ఆయన యాంకర్ అవతారం ఎత్తిన సంగతి తెలిసిందే. సుధీర్ యాంకర్ అంటే , ఇతనేమి చేయగలడు లే అని అంతా అనుకున్నారు.

కానీ కట్ చేస్తే ఇప్పుడు ఆయన యాంకర్ ప్రదీప్ కి పోటీగా తయారయ్యాడు. ఆ రేంజ్ డిమాండ్ ని సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఆయన ఈటీవీ లో ‘ది ఫ్యామిలీ స్టార్స్ 2’, జీ తెలుగు ‘సరిగమప’ వంటి షోస్ కి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. జీ తెలుగు లో సుధీర్ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు. వరుసగా షోస్ మీద షోస్ చేస్తూ ఫుల్ బిజీ గా మారిపోయాడు. ఇకపోతే ఈయనకు పోటీగా ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి కూడా తయారు అయ్యాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఏడాదికి కనీసం రెండు మూడు షోస్ లో అయినా ఆయన కనిపిస్తుంటాడు. సుధీర్ తో కలిసి రీసెంట్ డ్రామా జూనియర్స్ సీజన్ ని పూర్తి చేసిన అనిల్ రావిపూడి, ఇప్పుడు సరిగమప షో కూడా చేస్తున్నాడు. అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే , ఈ షో కి అనిల్ రావిపూడి కంటే సుడిగాలి సుధీర్ నే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడట.

ఒక్కో ఎపిసోడ్ కి సుధీర్ 4 – 5 లక్షల రూపాయిల రేంజ్ రెమ్యూనరేషన్ తీసుకుంటుండగా, అనిల్ రావిపూడి నాలుగు లక్షల రూపాయిలు తీసుకుంటున్నాడట. ‘ది ఫ్యామిలీ స్టార్స్ 2’ కి కూడా సుధీర్ ఇదే రేంజ్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు సమాచారం. ఏది ఏమైనా అనిల్ రావిపూడి ని మించి రెమ్యూనరేషన్ తీసుకోవడమంటే సాధారణమైన విషయం కాదు , హీరో గా సుధీర్ రెండు మూడు హిట్స్ అందుకుంటే ఇక ఆయన రేంజ్ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. తమిళనాడు లో శివ కార్తికేయన్ ఎలా అయితే ఎదిగాడో, సుధీర్ కి కూడా అలా ఎదిగే ఛాన్స్ ఉందని అంటున్నారు విశ్లేషకులు , మరి ఆ రేంజ్ కి వేళ్తాడో లేదో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper