Homeఆంధ్రప్రదేశ్‌Agipette Maccha: అగ్గిపెట్టె మచ్చ మరణం.. వైజాగ్ సత్య సంచలన వ్యాఖ్యలు

Agipette Maccha: అగ్గిపెట్టె మచ్చ మరణం.. వైజాగ్ సత్య సంచలన వ్యాఖ్యలు

Agipette Maccha: సోషల్ మీడియాలో విపరీతంగా పాపులర్ అయిన అగ్గిపెట్టె మచ్చ కన్నుమూశారు. తీవ్రమైన జ్వరం.. మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతున్న అతడు.. తిరుపతిలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. అతనికి మెదడులో తీవ్రమైన ఇన్ఫెక్షన్ సోకడంతో.. వైద్యులు శస్త్ర చికిత్స చేశారు. అయినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది.. సోషల్ మీడియాలో అగ్గిపెట్టె మచ్చకు విపరీతమైన పాపులారిటీ ఉంటుంది. రాయలసీమ యాసను ఆయన తనదైన శైలిలో మాట్లాడేవారు. పైగా లుంగీని ఎత్తి కట్టడంలో తన మేనరిజం చూపించేవారు. రాయలసీమ […]

Agipette Maccha: సోషల్ మీడియాలో విపరీతంగా పాపులర్ అయిన అగ్గిపెట్టె మచ్చ కన్నుమూశారు. తీవ్రమైన జ్వరం.. మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతున్న అతడు.. తిరుపతిలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. అతనికి మెదడులో తీవ్రమైన ఇన్ఫెక్షన్ సోకడంతో.. వైద్యులు శస్త్ర చికిత్స చేశారు. అయినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది..

సోషల్ మీడియాలో అగ్గిపెట్టె మచ్చకు విపరీతమైన పాపులారిటీ ఉంటుంది. రాయలసీమ యాసను ఆయన తనదైన శైలిలో మాట్లాడేవారు. పైగా లుంగీని ఎత్తి కట్టడంలో తన మేనరిజం చూపించేవారు. రాయలసీమ యాస మాట్లాడటం.. సోషల్ మీడియాలో విపరీతమైన పాపులారిటీ సొంతం చేసుకోవడంతో.. ఆయనకంటూ ప్రత్యేకమైన అభిమాన గణం ఏర్పడింది. దీంతో అనేక టీవీ షోలలో అగ్గిపెట్టె మచ్చకు అవకాశాలు వచ్చాయి. ముఖ్యంగా జబర్దస్త్.. శ్రీదేవి డ్రామా కంపెనీ షోలలో అగ్గిపెట్టె మచ్చ చేసిన సందడి మామూలుగా లేదు.

అగ్గిపెట్టె మచ్చ అనారోగ్యంతో మృతి చెందిన నేపథ్యంలో వైజాగ్ సత్య కీలక వ్యాఖ్యలు చేశారు. వైజాగ్ సత్య బృందంలో ఉండే కీలకమైన వ్యక్తులు ఇటీవల కాలంలో వరుసగా మరణిస్తున్నారు. కుర్చీ తాత.. అంతకుముందు రాకేష్ మాస్టర్.. ఇప్పుడు అగ్గిపెట్టె మచ్చ.. యముడు తన పాశాన్ని తమ బృందం మీద వదలాడని.. అందువల్లే వరుస మరణాలు చోటుచేసుకుంటున్నాయని సత్య ఆవేదన వ్యక్తం చేశారు. ” అగ్గి పెట్టె మచ్చ తీవ్రమైన జ్వరానికి గురయ్యారు. అపస్మారక స్థితిలో ఉంటే తిరుపతిలోని స్విమ్స్ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆయనకు మెదడులో ఇన్ఫెక్షన్ సోకిందని గుర్తించారు. వెంటనే ఆపరేషన్ కూడా చేశారు.. ఆపరేషన్ చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. యముడు తన పాశాన్ని మా బృందం మీద వేసినట్టు కనిపిస్తోంది. మొన్నటికి మొన్న రాకేష్ మాస్టర్ చనిపోయారు. ఆ తర్వాత కుర్చీ తాత కన్నుమూశారు.. ఇప్పుడు అగ్గి పెట్టె మచ్చ చనిపోయారు. బాధాకరం. ఈ పరిస్థితుల్లో వాళ్ల కుటుంబానికి భగవంతుడు అండగా ఉండాలని” సత్య పేర్కొన్నాడు.

అగ్గి పెట్టె మచ్చ మద్యం తాగేవాడు. ధూమపానం చేసేవాడు. అందువల్లే అతని ఆరోగ్యం ఇలా విషమించిందని వార్తలు వస్తున్నాయి. రాయలసీమ ప్రాంతంలో మారుమూల గ్రామానికి చెందిన అతడు.. పేద కుటుంబంలో జన్మించాడు. కాకపోతే సోషల్ మీడియాలో పాపులారిటీని సంపాదించుకున్నాడు. టీవీ షోలలో కనిపించేవాడు. ఆ తర్వాత కొన్ని ప్రైవేట్ కార్యక్రమాల్లో కూడా అతడు సందడి చేశాడు. చివరికి ఇలా కన్ను మూశాడు.

 

View this post on Instagram

 

A post shared by RTV News (@rtvnewsnetwork)

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper