Bigg Boss 10 Telugu: ఏ మనిషిని కూడా తక్కువ అంచనా వేయకూడదు, అలా చేయడం చాలా తప్పు అని పెద్దలు అంటుంటారు. నిన్న ‘బిగ్ బాస్ 10’ గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ రోజున నరేష్ ని చూస్తే అదే అనిపించింది. చూసేందుకు చాలా చిన్నగా ఉన్నాడు , ఇతను బిగ్ బాస్ హౌస్ లో టాస్కులు ఆడగలడా అనే అనుమానాలు తన తోటి కంటెస్టెంట్స్ కి మాత్రమే కాదు , సాధారణ ప్రేక్షకులకు కూడా అనిపిస్తుంది. అలా అతన్ని తక్కువ అంచనా వేసిన ప్రతీ ఒక్కరికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాడు నరేష్. పూర్తి వివరాల్లోకి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన వంశీ , నరేష్, చరణ్ , శ్రేష్టి లకు నాలుగు గుడ్లు ఇచ్చి వాటిని పగలగొట్టమని అంటారు. షాలిని , చరణ్ లకు ఉడకబెట్టిన గుడ్లు వస్తాయి, నరేష్ , వంశీ లకు మామూలు గుడ్లు వస్తాయి.
శ్రేష్టి , చరణ్ లకు వంశీ , నరేష్ లలో ఎవరో ఒకర్ని ఎంచుకోమని చెప్తారు. చరణ్ నరేష్ ని అయితే చాలా తేలికగా ఓడించగలం అనే ఉద్దేశ్యం తో , అతన్ని ఎంచుకుంటాడు. ముగ్గురికి టాస్క్ నిర్వహించగా , అందరికంటే ముందు శ్రేష్టి టాస్క్ గెలుస్తుంది, ఆ తర్వాత నరేష్ గెలుస్తాడు. కానీ చరణ్ మాత్రం టాస్క్ ని ఫినిష్ చేయలేకపోతాడు. ఎవరైతే నరేష్ తో చాలా తేలికగా గెలవచ్చు అని చెప్పారో, వాళ్ళే నరేష్ చేతిలో ఓడిపోవడం మామూలు విషయం కాదు. ఈ ఒక్క టాస్క్ తోనే నరేష్ కి మంచి ఎలివేషన్ వచ్చింది. పిట్ట కొంచెం, కూత ఘనం లాగా అనిపించున్నాడు నరేష్. నరేష్ ఇలాగే గేమ్ ఆడుతూ ముందుకు పోతే మాత్రం కచ్చితంగా టాప్ 5 లో ఉంటాడని చెప్పొచ్చు. కానీ చరణ్ మాత్రం అంచనాలను అసలు అందుకోలేకపోతున్నాడు.
‘అగ్ని పరీక్ష 2’ ఆడిషన్స్ సమయం లో జడ్జీలతో పాటు , ప్రేక్షకులను కూడా విశేషంగా ఆకర్షించాడు చరణ్. కానీ ‘అగ్ని పరీక్ష 2’ లో నిర్వహించిన టాస్కుల్లో కూడా చరణ్ తన సత్తా చాటలేకపోయాడు. ఒక్కటంటే ఒక్క టాస్క్ లో కూడా చరణ్ గెలవలేకపోయాడు. కనీసం ‘బిగ్ బాస్’ హౌస్ లో అయినా తన సత్తా చూపిస్తాడని అనుకుంటే ఇక్కడ కూడా ఆయన నిరాశపరిచాడు. కేవలం మాటల్లో చురుకుదనం ఉంది తప్ప, ఆట లో లేదు , ఇలా ఉంటే కష్టమని , రెండు మూడు వారాలు కూడా బిగ్ బాస్ హౌస్ లో కొనసాగలేరని అంటున్నారు విశ్లేషకులు. మరి చరణ్ రాబోయే రోజుల్లో అయినా తన సత్తా చూపిస్తాడో లేదో చూడాలి.