Mohan Babu : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకతను చాటుకోవడానికి డిఫరెంట్ జానర్స్ లో సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఒకప్పుడు ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకున్న చిరంజీవి, మోహన్ బాబు లాంటి నటులు సైతం ఐడెంటిటీ కాపాడుకుంటూ వచ్చారు… ఇక ఇదిలా ఉంటే మోహన్ బాబు ప్రస్తుతం తన కొడుకుల సినిమాల్లో తప్ప మిగతా ఏ హీరోల సినిమాల్లో కూడా నటించడం లేదు. కారణం ఏదైనా కూడా ఆయన మాత్రం ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నాడనే చెప్పాలి…
గత కొద్ది రోజులుగా మోహన్ బాబు ఇంట్లో కొన్ని గొడవలు అయితే జరుగుతున్నాయి. ఇక దానికి అనుగుణంగానే ఆయన కూడా ఒక రిపోర్టర్ మీద దాడి చేశాడు. ఇక అనంతరం ఆయన అస్వస్థతకు గురవ్వడంతో 48 గంటల పాటు గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకున్నాడు. మోహన్ బాబు తను ఎవరినైతే కొట్టాడో ఆ రిపోర్టర్ కి క్షమాపణలు చెబుతూ సోషల్ మీడియా వేదికగా ఒక నోట్ అయితే రిలీజ్ చేశాడు… రిపోర్టర్ రంజిత్ పైన చేయి చేసుకోవడాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నాను. అతనికి అతని కుటుంబ సభ్యులకి సారీ ఆయన తొందరగా కోలుకోవాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నాను అంటూ తను తన లేఖలో తెలియజేయడం తో ఇప్పుడు యావత్ సినిమా ప్రేక్షకులు మోహన్ బాబు చేసిన పనికి కొంతవరకు ఆయన మీద పాజిటివ్ ఒపినియన్ తో ఉన్నారు…ఎందుకు అంటే ఆయన ఆరోజు కొంతవరకు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు. అందువల్లే వాళ్ల మీద దాడి చేశానని చెప్పాడు. ఇక ఆయనకు ముందే ప్రాణహాని ఉందని తెలిసినా కూడా వందమంది లోపలికి ఒక్కసారే పరిగెత్తుకుంటూ రావడంతో తన మీద ఎవరైనా అటాక్ చేస్తారేమో అనే ఉద్దేశ్యంతో ఆయన అలా చేసినట్టుగా చ్చెప్పాడు.
ఇక ఏది ఏమైనా కూడా మోహన్ బాబు లాంటి నటుడు ఈ ఏజ్ లో ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కోవడం అనేది నిజంగా చాలావరకు చింతించాల్సిన విషయమే…మరి ఇప్పటికైనా వాళ్ళ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకొని అందరూ కలిసిమెలిసి ఉంటే చూడాలని మోహన్ బాబు అభిమానులు కోరుకుంటున్నారు.
కానీ వాళ్ళు మాత్రం దానికి పూర్తి విరుద్ధంగా వ్యవహరించడం ఏ ఒక్కరూ జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక ఏది ఏమైనా కూడా మంచు ఫ్యామిలీలో మళ్లీ అందరూ కలిసిపోయి మంచి రోజులు రావాలని మోహన్ బాబు అభిమానులు అలాగే తెలుగు ప్రేక్షకులు సైతం కోరుకుంటున్నారు. ఇక మోహన్ బాబు లాంటి సీనియర్ నటుడు తన కొడుకులను చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన సమయంలో వాళ్ళ మీద గొడవలకు దిగడం అనేది సరైన విషయం అయితే కాదు. ఇక ఇదిలా ఉంటే ఆయన రిపోర్టర్ కి సారి చెప్పడానికి కారణం తన కొడుకు విష్ణు అని తెలుస్తోంది. ఇక మోహన్ బాబు కి బ్యాడ్ నేమ్ రాకూడదని అలా చెప్పించినట్టుగా వార్థలైతే వస్తున్నాయి…
మరి జరిగిందేదో జరిగింది ఇక ఇప్పటినుంచి అయిన తన కొడుకులను తన ఆధీనంలో ఉంచుకొని ముందుకు సాగితే మంచిదని మరి కొంతమంది ట్రేడ్ పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు… చూడాలి మరి ఇకమీదటైన మోహన్ బాబు తన కొడుకులతో కలిసిమెలిసి ఉంటారా లేదా అనేది…