Sandeep Reddy Vanga: ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ డైరెక్టర్ గా మారిపోయిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా… ఆయన ప్రభాస్ తో ‘స్పిరిట్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా చాలా అద్భుతంగా వస్తుందని ఆయన రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు. ఇక దానికి తగ్గట్టుగానే తన తదుపరి సినిమా ఎవరితో చేయబోతున్నారనే విషయం మీద కూడా ఒక క్లారిటి ఇచ్చాడు. ప్రస్తుతం తను ప్రభాస్ తో సినిమా చేస్తున్నాడు. కాబట్టి ఈ సినిమా సూపర్ సక్సెస్ అయితే చిరంజీవి, ఎన్టీఆర్ లను పెట్టి ఒక భారీ మల్టీ స్టారర్ సినిమా చేయడానికి ప్రణాళికలు రూపొందించుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇది కనుక వర్కౌట్ అయితే మాత్రం ఇండస్ట్రీలో ఉన్న అన్ని రికార్డులు బ్రేక్ అయిపోతాయంటూ సందీప్ రెడ్డి వంగ అభిమానులు సైతం కామెంట్లు చేస్తున్నారు.
నిజానికి ప్రభాస్ తో చేస్తున్న స్పిరిట్ సినిమాతో 2000 కోట్లకు పైన కలెక్షన్స్ ని రాబడుతుందనే కాన్ఫిడెంట్ ను వ్యక్తం చేస్తున్న సందీప్ రెడ్డి వంగ తన తదుపరి సినిమాల విషయంలో కూడా అదే కాన్ఫిడెంట్ ను వ్యక్తం చేస్తుండడం విశేషం…చిరంజీవి, ఎన్టీఆర్ కాంబినేషన్ అంటే మామూలుగా ఉండదు. ఇంతకుముందు కూడా సందీప్ రెడ్డివంగా చిరంజీవితో ఒక సినిమా చేయబోతున్నాడు అంటూ వార్తలు వచ్చాయి. కానీ అవేవీ కార్య రూపం దాల్చలేదు.
కానీ ఇప్పుడు మాత్రం పక్కాగా సందీప్ రెడ్డివంగా చిరంజీవి – జూనియర్ ఎన్టీఆర్ లతో సినిమా చేయబోతున్నాడు తొందరలోనే అనౌన్స్మెంట్ కూడా రాబోతుందనే విషయం అయితే చాలా క్లారిటీగా తెలుస్తుంది… ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాల్లో బోల్డ్ కంటెంట్ ఎక్కువగా ఉంది. కాబట్టి స్పిరిట్ సినిమా విషయంలో ఆయన ఎలాంటి ప్రణాళికలను రూపొందించుకొని ముందుకు సాగుతున్నాడు.
ఈ సినిమాలో కూడా అలాంటి బోల్డ్ సీన్స్ ఉన్నాయా లేదా అనేది తెలియాల్సి ఉంది. చిరంజీవి – ఎన్టీఆర్ తో సినిమా అంటే అది పక్కా కమర్షియల్ ఫార్మాట్ లోనే ఉండాలి. అందులో బోల్డ్ సీన్స్ ఉంటే చిరంజీవి ఒప్పుకోడు కాబట్టి చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేయాల్సిన అవసరమైతే ఉందని కొంతమంది సినిమా విమర్శకులు సైతం కామెంట్స్ చేస్తున్నారు…