Chiranjeevi And Ram Charan: గత 50 సంవత్సరాలుగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న వారిలో మెగాస్టార్ చిరంజీవి మొదటి స్థానంలో ఉంటాడు. ఇతర ఇండస్ట్రీ నుంచి ఎదురయ్యే పోటీని సైతం తట్టుకొని తెలుగు సినిమా ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్లిన ఘనత చిరంజీవికి దక్కుతుంది. ఇప్పటివరకు ఆయన మెగాస్టార్ గా గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా తనకు ఉన్న ఆ ట్యాగ్ ను కాపాడుకుంటూ ఎప్పటికప్పుడు ప్రేక్షకులను మెప్పించగలిగే సినిమాలను చేయగలుగుతున్నాడు. తద్వారా ఆయన ఇండస్ట్రీలో నెంబర్ వన్ పొజిషన్ ను ఇప్పటికి కంటిన్యూ చేస్తున్నాడంటే మామూలు విషయం కాదు. ఇక ఇదిలా ఉంటే తను ఇప్పటి వరకు ప్రతి సినిమాకు పెద్ద ఎత్తున రెమ్యూనరేషన్లు తీసుకొని పెద్ద ఎత్తున డబ్బులైతే సంపాదించాడు. ఇక ఇలాంటి క్రమంలోనే దాదాపు చిరంజీవి దగ్గర 5000 కోట్ల వరకు ఆస్తులైతే ఉన్నాయనే వార్తలు కూడా వస్తున్నాయి… చిరంజీవి కొడుకు అయిన రామ్ చరణ్ సైతం ‘చిరుత’ సినిమాతో హీరోగా ఏంట్రా ఇచ్చాడు.
ఇప్పటివరకు ఆయన 16 సినిమాలు చేశాడు. సినిమాల పరంగా బాగానే సంపాదించాడు. అలాగే రామ్ చరణ్ ఇతర బిజినెస్ లు కూడా చూసుకుంటున్నాడు. దాని ద్వారా కూడా ఆయన భారీ మొత్తంలో ఆస్తులైతే సంపాదించినట్టుగా తెలుస్తుంది. దాదాపు రామ్ చరణ్ ఆస్తులు కూడా 4000 కోట్లకు పైనే ఉంటాయనే సమాచారమైతే అందుతుంది.
మొత్తానికైతే మెగాస్టార్ చిరంజీవి ఆస్తులతో పాటు పోటీ పడుతూ రామ్ చరణ్ కూడా బీభత్సంగా ఆస్తులను సంపాదించడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. ఈ ఏజ్ లోనే ఆయన అంతవరకు సంపాదించాడు అంటే రాబోయే రోజుల్లో మరింత ఎక్కువ ఆస్తులను సంబంధించే అవకాశం ఉంది. చిరంజీవి దగ్గర ఉన్న ఆస్తుల కంటే కూడా రామ్ చరణ్ ఎక్కువ సంపాదించే అవకాశలైతే ఉన్నాయి.
ఇక మెగా ఫ్యామిలీ హీరోలైన చిరంజీవి, రామ్ చరణ్ ఇద్దరు కూడా డబ్బులు సంపాదించడమే కాకుండా ఎక్కువగా సేవా కార్యక్రమాలను కూడా చేపడుతూ చాలామందికి సహాయం చేస్తున్నారు. అందుకే వాళ్ళంటే ప్రేక్షకులకు గౌరవం ఉంటుంది. అందుకే వాళ్ళ సినిమాలు వస్తే చాలు ప్రతి ఒక ప్రేక్షకుడు వల్ల సినిమాలను చూడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటాడు…