Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి హీరోగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఘరానా మొగుడు’ సినిమా భారీ విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో చిరంజీవి ఇంట్రడక్షన్ ఫైట్ కోసం ఒక భారీ విలన్ ను తీసుకురావాలని అనుకున్నారట. ఇక ఇదే క్రమంలో తమిళ్ సినిమా ఇండస్ట్రీలో అప్పటికే విలన్ గా మంచి ఫేమస్ అయిన పొన్నాం బలం ను తీసుకోమని చిరంజీవి రాఘవేంద్రరావుకు చెప్పారట. ఇంట్రడక్షన్ లో వచ్చే ఫైట్ సీక్వెన్స్ చాలా హైలెట్గా ఉంటే సినిమా మొత్తానికి అది చాలా వరకు హెల్ప్ అవుతుందనే ఉద్దేశ్యంతోనే చిరంజీవి చెప్పారట. ఇక ఇలాంటి క్రమంలో పొన్నాంబలం ఆ ఒక్క ఫైట్ కోసం 25000 రూపాయలను డిమాండ్ చేశారట.
దానికి సినిమా యూనిట్ నుంచి ఒక ఫైట్ కి 25000 ఛార్జ్ చేయడం ఏంటి అంటూ కొంతమంది కొన్ని కామెంట్లను వ్యక్తం చేసిన కూడా చిరంజీవి వాళ్ళందరితో మాట్లాడి పొన్నం బలం ఈ సినిమాలో ఉండడం వల్ల సినిమా ఫైట్ ఎక్స్ట్రాడినరీగా వస్తుందని వాళ్ళందరికి చెప్పు ఒప్పించి అతను కోరినట్టుగా 25000 రూపాయలైతే ఇప్పించారట.
1992వ సంవత్సరంలో ఒక్క ఫ్లైట్ కోసం 25000 రూపాయలను ఛార్జ్ చేసిన నటుడు కూడా తనే కావడం విశేషం… ఇక ఆ తర్వాత కూడా చిరంజీవి చేసిన చాలా సినిమాల్లో పొన్నంబలం విలన్ క్యారెక్టర్ చేశాడు. ముఖ్యంగా హిట్లర్ సినిమాలో కూడా అతనికి ఒక సపరేట్ ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది. ఇక ఏదేమైనా కూడా చిరంజీవి లాంటి నటుడు తన సినిమాలో ఎవరు ఉంటే ఆ సీక్వెన్స్ హైలెట్ అవుతుంది.
ఎవరి చేత చేయిస్తే ఆ సినిమాకి ఎక్కువ క్రేజ్ వస్తుందనేది చాలా అనుభవంతో నేర్చుకున్నాడు. కాబట్టి పొన్నాం బలం ద్వారా సినిమాలోని ఆ ఫైట్ కి స్పెషల్ ఎట్రాక్షన్ రావడమే కాకుండా ‘ఘరానా మొగుడు’ సినిమా ఇండస్ట్రీ హిట్ అవ్వడానికి కూడా ఆ ఫైట్ చాలా వరకు హెల్ప్ అయ్యిందని మాస్ ఆడియన్స్ ఆ ఫైట్ కి విపరీతంగా కనెక్ట్ అయ్యారని చెబుతుంటారు. ఇక ఇప్పటికి ఆ సినిమాని చూసే ప్రతి ఒక్కరు ఆ ఫైట్ ని మిస్ అవ్వకుండా చూస్తుంటారని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు…