Homeఎంటర్టైన్మెంట్Chalaki Chanti: ఆ స్టార్ డైరెక్టర్ తండ్రి ముందు సిగరెట్ తాగినందుకు నన్ను తిట్టారు...

Chalaki Chanti: ఆ స్టార్ డైరెక్టర్ తండ్రి ముందు సిగరెట్ తాగినందుకు నన్ను తిట్టారు అంటున్న చలాకి చంటి… ఇంతకీ ఆ దర్శకుడు ఎవరంటే…

Chalaki Chanti: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు ఒక్క ఛాన్స్ వస్తే చాలు వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలనే తాపత్రయంతో ఉంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే జబర్దస్త్ తో చాలా మంచి క్రేజ్ ను సంపాదించుకున్న నటుడు చలాకీ చంటి… తన కెరియర్ స్టార్టింగ్ లో డిఫరెంట్ సినిమాల్లో తనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకున్నాడు. కానీ ఆ తర్వాత ఆయనకు పెద్దగా అవకాశాలైతే రాలేదు. కానీ ఒక స్టార్ డైరెక్టర్ డైరెక్షన్లో చేస్తున్నప్పుడు షార్ట్ […]

Chalaki Chanti: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు ఒక్క ఛాన్స్ వస్తే చాలు వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలనే తాపత్రయంతో ఉంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే జబర్దస్త్ తో చాలా మంచి క్రేజ్ ను సంపాదించుకున్న నటుడు చలాకీ చంటి… తన కెరియర్ స్టార్టింగ్ లో డిఫరెంట్ సినిమాల్లో తనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకున్నాడు. కానీ ఆ తర్వాత ఆయనకు పెద్దగా అవకాశాలైతే రాలేదు. కానీ ఒక స్టార్ డైరెక్టర్ డైరెక్షన్లో చేస్తున్నప్పుడు షార్ట్ గ్యాప్ లో పక్కకి వచ్చి సిగరెట్ తాగుతుంటే ఆ స్టార్ డైరెక్టర్ వాళ్ళ ఫాదర్ వచ్చి అక్కడ నిలబడ్డాడట. చంటి డైరెక్టర్ వాళ్ళ ఫాదర్ కి హాయ్ చెప్పకుండా తన ముందే సిగరెట్ తాగాడట. దాంతో ఆ విషయాన్ని ఆ డైరెక్టర్ వాళ్ళ ఫాదర్ దర్శకుడికి చెప్పడంతో ఆయన డైరెక్ట్ గా మా నాన్నకు హాయ్ చెప్పలేదు.. మా నాన్న ముందే సిగరెట్ తాగావు అని చెప్పకుండా దానిని మనసులో ఉంచుకొని షాట్ లో ఎంత బాగా చేసిన కూడా బాగాలేదు. మీరు బాగా చేయడం లేదు అంటూ కాసురుకున్నారట. ఇక ఆ డైరెక్టర్ ప్రవర్తించిన వైఖరి గురించి చలాకి చంటి కి తర్వాత తెలిసిందట.

నిజానికి అతను సిగరెట్ తాగుతున్నప్పుడు అక్కడికి వచ్చిన మనిషి దర్శకుడు యొక్క ఫాదర్ అని తనకు తెలియదట. అందువల్లే తను అతనికి హాయ్ చెప్పలేదని, సైలెంట్ గా తన సిగరెట్ తను తాగుతూ పక్కన ఉన్నానని చెప్పాడు. ఇలాంటి కారణాల వల్ల కూడా సినిమా ఇండస్ట్రీలో ఉన్న దర్శకులు నటులకు అవకాశాలను ఇవ్వరని అందుకే ఇండస్ట్రీలో అణిగిమనిగి ఉండాలని చాలామంది చెబుతుంటారు.

కానీ మనకు తెలియకుండా జరిగిన విషయాలకు మనం బాధ్యులం కాదని ఆయన చెబుతున్నాడు. ఇక సెట్ లో తను సిగరెట్ తాగుతున్నప్పుడు అక్కడికి వచ్చిన పెద్దాయన ఆదర్శకుడి యొక్క ఫాదర్ అని నాకు తెలియదు.

ఒకవేళ తెలిస్తే తప్పకుండా విష్ చేసే వాడిని కానీ నాకు తెలియకుండా జరిగిపోయింది. దానికి నేనేం చేయలేను అంటూ చంటి అయితే క్లారిటీ ఇచ్చాడు. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరు అనే విషయాన్ని మాత్రం ఆయన చెప్పలేదు. ఆ తర్వాత ఆ డైరెక్టర్ చేసిన సినిమాల్లో సైతం చంటికి అవకాశాలైతే ఇవ్వలేదట…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper