Homeఎంటర్టైన్మెంట్Mohan Babu The Paradise: 'ది ప్యారడైజ్ ' టీజర్ లో మోహన్ బాబునే హైలెట్.....

Mohan Babu The Paradise: ‘ది ప్యారడైజ్ ‘ టీజర్ లో మోహన్ బాబునే హైలెట్.. నాని పరిస్థితి ఏంటి..?

Mohan Babu The Paradise: శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని హీరోగా తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్’ సినిమా టీజర్ రేపు రిలీజ్ అవ్వనుంది. అయితే ఈ టీజర్ లో మోహన్ బాబును హైలెట్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఈ సినిమాలో ఆయన విలన్ పాత్రను పోషిస్తున్నాడు. కాబట్టి ఆయనకంటూ డిజైన్ చేసిన క్యారెక్టర్జైజేషన్ ఏంటి అనేది ఈ టీజర్ లో చెప్పబోతున్నారట. ఆయన నటించిన సన్నివేశాలను సైతం టీజర్ లో హైలెట్ చేయడానికి దర్శకుడు సన్నాహాలు చేసుకున్నాడు. మొత్తానికైతే […]

Mohan Babu The Paradise: శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని హీరోగా తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్’ సినిమా టీజర్ రేపు రిలీజ్ అవ్వనుంది. అయితే ఈ టీజర్ లో మోహన్ బాబును హైలెట్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఈ సినిమాలో ఆయన విలన్ పాత్రను పోషిస్తున్నాడు. కాబట్టి ఆయనకంటూ డిజైన్ చేసిన క్యారెక్టర్జైజేషన్ ఏంటి అనేది ఈ టీజర్ లో చెప్పబోతున్నారట. ఆయన నటించిన సన్నివేశాలను సైతం టీజర్ లో హైలెట్ చేయడానికి దర్శకుడు సన్నాహాలు చేసుకున్నాడు. మొత్తానికైతే నానితో పాటు మోహన్ బాబు సన్నివేశాలు కూడా టీజర్ లో మనకు కనిపించబోతున్నాయి. ఏదేమైనా కూడా మోహన్ బాబు సెకండ్ ఇన్నింగ్స్ లో రాణించాలనే ప్రయత్నం చేస్తున్నాడు. రీసెంట్ గా ‘శ్రీనివాస మంగాపురం’ సినిమాలో తను కనిపించింది తక్కువ సమయమే అయినప్పటికి ప్రేక్షకులంజ్ మైమరిపింపజేశాడు. తన పాత్రలో ఉన్న ఆరాను చాలా బాగా ఎలివేట్ చేస్తూ తన మార్క్ డైలాగులను చెప్పాడు.

కాబట్టి ప్యారడైజ్ సినిమాలో కూడా ఆయన అంతకు మించిన పవర్ ఫుల్ డైలాగులతో చెప్పి మెప్పించడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. అలాగే తను యంగ్ గెటప్, ఓల్డ్ గెటప్ లో ఉన్న క్యారెక్టర్ రెండింటిని సమపాల్లో బ్యాలెన్స్ చేస్తూ నటించడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తుంది.

ది ప్యారడైజ్ టీజర్ రావడానికి మరో కొన్ని గంటల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో ఈ టీజర్ ఎలాంటి రచ్చ చేయబోతుంది. ప్రేక్షకులందరిని తన వైపు తిప్పుకుంటుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది గంటల పాటు వెయిట్ చేయాల్సిందే… ఇప్పటివరకు నాని చేసిన సినిమాలు ఒకెత్తయితే ఈ మూవీ మరొక ఎత్తుగా మారబోతుంది.

శ్రీకాంత్ ఓదెల నాని కాంబినేషన్లో దసరా సినిమా వచ్చి మంచి విజయాన్ని సాధించింది. దానికి భిన్నంగా ఈ సినిమా ఉండబోతుందట. అందులో నానిని మనం మాస్ ఎలిమెంట్స్ లో మాత్రమే చూశాం. కానీ ఈ సినిమాలో పవర్ ఫుల్ మాస్ క్యారెక్టర్ లో తను నటించడానికి సిద్ధమయ్యాడు. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా ఇప్పటికే భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. కాబట్టి ఏ రేంజ్ కలెక్షన్స్ రాబడుతుందనేది తెలియాల్సి ఉంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper