Look back innovation 2024: భౌగోళికంగా రాజకీయ అనిశ్చితి చోటు చేసుకోవడం.. రాజకీయంగా సమూల మార్పులు జరగడం వంటివి 2024లో అనేక సంచలనాలకు కారణమయ్యాయి. అంతర్జాతీయ సరఫరాదారులతో ఆధారపడటాన్ని అమెరికా పూర్తిగా తగ్గించుకుంది. అక్కడ కంపెనీలు దేశీయ ఉత్పత్తి సామర్ధ్యాలను పెంచుకున్నాయి.. పెరుగుతున్న డిమాండ్ కు అనుకూలంగా అక్కడ విధానాలు మారాయి. ఫలితంగా పరికరాల అద్దె, నూతన ఆవిష్కరణలు.. పాత వాటిలో ఆధునీకరణ మార్పులు వంటివి చోటు చేసుకున్నాయి.. వ్యూహాత్మక మార్పు వల్ల ప్రయోజనాలు పెరిగాయి. ఈ ఇన్నోవేషన్ థాట్ అనేది కేవలం అమెరికాకు మాత్రమే పరిమితం కాలేదు. చాలా దేశాలు వీటిని అనుసరిస్తున్నాయి. అందువల్ల మ్యానుఫ్యాక్చర్ నుంచి మొదలు పెడితే సెమీ కండక్టర్ వరకు ప్రతి దాంట్లో కొత్త కొత్త ఆవిష్కరణలు చోటుచేసుకున్నాయి.
తైవాన్ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ
అమెరికాలో సెమీ కండక్టర్ ఉత్పత్తిని పునరుద్ధరించడంలో తైవాన్ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ గణనీయమైన పురోగతి సాధించింది.. ఈ కంపెనీ 5 NM ప్రాసెస్ టెక్నాలజీని ఉపయోగించుకొని.. నెలకు 20వేల వేఫర్ లను ఉత్పత్తి చేస్తోంది. ఫలితంగా అమెరికాలో అత్యంత అధునాతన సెమీ కండక్టర్ ఫ్యాబ్ లలో ఇది ప్రథమంగా నిలిచింది..
ఇక లెనోవా కంపెనీ తన గ్లోబల్ నెట్వర్క్ విస్తరించే ప్రణాళికలను రూపొందించింది. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తిని పెంచాలని భావించింది. సౌదీ అరేబియాలో కొత్త ఉత్పాదక సామర్థ్యాన్ని కలిగి ఉన్న కంపెనీ ని ఏర్పాటు చేస్తామని వివరించింది. ఆఫ్రికాలోనూ విస్తరణకు ప్రణాళికలు రూపొందించింది. వృద్ధి, విస్తరణ కోసం లెనోవో రెండు బిలియన్ డాలర్ల జీరో కూపన్ కన్వర్టబుల్ బాండ్ ను పెట్టుబడిగా పెట్టింది.
బోస్టన్ మెటల్ గ్రీన్ ఉత్పాదక ఆవిష్కరణలో సుస్థిరతను అందించేందుకు ముందడుగు వేసింది. ఉక్కు ఉత్పత్తిలో బొగ్గు వినియోగాన్ని తగ్గించడానికి గ్రీన్ స్టీల్ ను తెరపైకి తీసుకురానుంది. 2026 నాటికి గ్రీన్ స్టీల్ ను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది.
త్రీ డి టెక్నాలజీ
మోడ్రన్ పదార్థాల అభివృద్ధి, వాటి తయారీ ఈ ఏడాది ఊపందుకుంది. ఈ పరిశ్రమలో సరికొత్త అవకాశాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రపంచంలోనే అతిపెద్ద త్రీడీ ప్రింటర్ ను మైనే యూనివర్సిటీ అందుబాటులోకి తీసుకువచ్చింది. గృహ నిర్మాణం, పునరుత్పాదక శక్తి, భారీ స్థాయి అప్లికేషన్లు ను దీని ద్వారా రూపొందించాలన్నారు.. ఈ ప్రింటర్ 96 అడుగుల పొడవు ఉన్న వస్తువులను సైతం ఉత్పత్తి చేస్తుంది. విండ్ టర్బైన్ నుంచి మొదలు పెడితే మౌలిక సదుపాయాల కోసం రూపొందించే భాగాల వరకు.. ఈ త్రీడీ ప్రింటర్ ద్వారా సృష్టించవచ్చు. త్రీడీ ప్రింటర్ బోయింగ్ సంస్థ కోసం 3D ప్రింటెడ్ వస్తువులను రూపొందించింది. దీని ద్వారా 30% సమయం ఆదాయం అయింది. మెటీరియల్ వేస్ట్ 50% తగ్గింది.
IoT, AI సాంకేతికత
IoT, AI సాంకేతికత మంత్రాల జీవిత కాలాన్ని పొడిగించింది. ఉదాహరణకి జనరల్ ఎలక్ట్రికల్స్ వంటి కంపెనీలు తమ టర్బైన్ తయారీలో ప్రిడిక్టివ్ అనలిటిక్స్ అమలు చేశాయి. తద్వారా 15% ఖర్చు తగ్గింది. ఫలితంగా మిలియన్ డాలర్ల ఖర్చు తగ్గింది.
వర్క్ ఫోర్స్ డెవలప్మెంట్ స్కిల్ ట్రైనింగ్
కొత్త సాంకేతికతను వేగంగా స్వీకరించడం వల్ల.. వస్తు ఉత్పత్తుల తయారీలో శ్రామిక శక్తి తగ్గింది. వర్క్ ఫోర్సు స్కిర్ డెవలప్మెంట్ వల్ల వస్తువుల తయారీలో వేగం పెరిగింది. మ్యానుఫ్యాక్చరింగ్ వర్క్ ఫోర్స్ స్ప్రింట్ వల్ల 160 కి పైగా సంస్థలు అధునాతనంగా వస్తువుల తయారీని చేపట్టాయి. దీనివల్ల 150 కంటే ఎక్కువ కొత్త సంస్థలు తయారీ సంబంధిత రిజిస్టర్డ్ అప్రెంటిషిప్ ప్రోగ్రామ్ లను అమలు చేయడం మొదలుపెట్టాయి. 4,700 మంది కొత్త అప్రెంటిస్ లను ఒక్కో కంపెనీ నియమించుకుంది. ఇవే కాకుండా రోబోటిక్స్, ఆటోమేషన్ వంటివి వస్తు ఉత్పత్తుల తయారీలో విశేషమైన నైపుణ్యాన్ని అందించడం ప్రారంభించాయి..