Anil Ravipudi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి… ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నీ సూపర్ సక్సెస్ లను సాధించడంతో ఇకమీదట చేయబోతున్న సినిమాల విషయంలో కూడా చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం ఆయన వెంకటేష్ – కళ్యాణ్ రామ్ లను హీరోలుగా పెట్టి ఒక మల్టీ స్టారర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను 2027 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తుండటం విశేషం… ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో మరో సక్సెస్ ని తన ఖాతాలో వేసుకుని వరుసగా 10 విజయాలను సాధించిన దర్శకుడిగా గొప్ప గుర్తింపును సంపాదించుకోవాలనే ప్రయత్నంలో అనిల్ రావిపూడి ఉన్నట్టుగా తెలుస్తోంది… నిజానికి అనిల్ రావిపూడి సినిమాలు చాలా బాగున్నప్పటికి ఒక వర్గం ప్రేక్షకులను మాత్రం ఆయన సినిమాలు పూర్తిగా మెప్పించడం లేదు. ఈయన సినిమాలో క్రింజ్ కామెడీ ఉంటుందని రొటీన్ టెంప్లేట్ లోనే సినిమాలు చేస్తున్నాడంటూ కొన్ని విమర్శలైతే ఎదుర్కొంటున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా ఆయన ప్రస్తుతం వరుస సక్సెస్ లను సాధిస్తున్నాడు కాబట్టి అతనికి మార్కెట్లో చాలా మంచి డిమాండ్ అయితే ఉంది. తన సినిమాలను చూడడానికి ప్రతి ఒక్కరు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అతనితో సినిమాలు చేయడానికి హీరోలు, ప్రొడ్యూసర్స్ ఆసక్తి చూపిస్తుండటం విశేషం…
అనిల్ రావిపూడి లాంటి దర్శకుడు అన్ని విషయాల్లో పర్ఫెక్ట్ గా ఉన్నప్పటికి ఆ రొటీన్ టెంప్లేట్ లోనే సినిమాలు చేయడం అతనికి చాలా వరకు మైనస్ అవుతుందంటూ మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఆ ఒక్క విషయంలోనే ఎందుకు తప్పులు చేస్తున్నాడు.
ఆయన మూవీస్ కి ప్రేక్షకులకు కనెక్ట్ అయినంత వరకు పర్లేదు. తేడా కొడితే మాత్రం అతని సినిమాల మీద భారీ విమర్శలు వచ్చే అవకాశాలైతే ఉన్నాయి. ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ చేసుకానీ రొటీన్ టెంప్లేట్ లో సినిమాలు చేయడం వల్ల ప్రస్తుతం ఆయన సినిమాలు ఆడుతుండొచ్చు.
కానీ ఒక మేకర్ గా ఆ సినిమాలు అతనికి పూర్తి సాటిస్ఫాక్షన్ ఇచ్చే సినిమాలైతే లేదు. ఆయన డిఫరెంట్ తరహాలో సినిమాలను ట్రై చేసినప్పుడు మాత్రమే అతను సూపర్ సక్సెస్ అవుతాడు. తను కూడా చాలా వరకు కాన్ఫిడెంట్ గా ఉంటాడని మరి కొంతమంది కామెంట్లు చేస్తుండటం విశేషం…