Lagacharla Farmer : దేశానికి అన్నం పెట్టేది రైతులే. కానీ, రైతులకు.. వారి శ్రమకు గుర్తింపు, ఫలితం దక్కడం లేదు. ప్రభుత్వాల తీరుతో ఇబ్బంది పడుతున్నారు. దళారుల తీరుతో మోసపోతున్నారు. ఇటీవల రైతుల భూములు తీసుకోవడం ఉద్రిక్తతలకు దారితీస్తోంది. మల్లన్న సాగర్ భూసేకరణ సమయంలో గత బీఆర్‌ఎస్ ప్రభత్వం రైతులను, గ్రామస్తులను పోలీసులతో నిర్బంధించి భూములు లాక్కుంది. తాజాగా కాంగ్రెస్ వికారాబాద్ జిల్లా లగచర్లలో ఫార్మా సిటీ కోసం భూసేకరణకు సిద్ధమైంది. ఈ సమయంలో రైతులు అధికారులపై తిరగబడ్డారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా పట్నం మహేందర్‌రెడ్డి ఉన్నారు. పలువురు రైతులను పోలీసులు అరెస్టు చేశారు. అయితే జైల్లో ఉన్న రైతులను బేడీలు వేసి తీసుకురావడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తాజాగా హీర్యానాయక్‌ను జైలు నుంచి సంకెళ్లతో ఆస్పత్రికి తరలించారు. విమర్శలు రావడంతో జైలర్ సంజీవరెడ్డిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. సూపరింటెండెంట్ సంతోష్‌పై శాఖాపరమైన చర్యలకు జైళ్లశాఖ డీజీ సౌమ్య మిశ్రా హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి రవి గుప్తాకు లేఖ రాశారు.
ఛాతీ నొప్పితో..
హీర్యానాయక్ గురువారం ఛాతీలో నొప్పిగా ఉందని చెప్పడంతో పోలీసులు సంగారెడ్డి ఆస్పత్రికి తరలించారు.ఈ సమయంలో ఆయనకు బేడీలు వేసి ఉండడం, ఆ పొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సీఎం రేవంత్‌రెడ్డి ఫైరల్ అయ్యారు. ఘటనపై ఆరా తీశారు. సంకెళ్లు ఎందుకు వేశాలరని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమగ్ర విచారణ జరిపించాలని ఆదేశించారు. దీంతోరంగంలోకి దిగిన మల్టీజోన్–2 ఐజీ సత్యనారాయణ సంగారెడ్డికి వెళ్లి విచారణ చేపట్టారు.
రిమాండ్‌లో రైతు..
లగచర్ల ఘటన తర్వాత పలువురు రైతులను పోలీసులు అరెస్టు చేశారు. అందులో హీర్యానాయక్ కూడా ఉన్నారు. న్యాయస్థానం వారికి రిమండ్ విధించింది. దీంతో సంగారెడ్డిజైలుకు తరలించారు. బుధవారం ఛాతీలో నొప్ప రావడంతో జైలు అధికారులు ఎస్కార్క్‌తో ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షల తర్వాత జైలుకు తరలించారు. గురువారం మళ్లీ నొప్పగా ఉందనడంతో మరోమారు గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ సమయంలో చేతికి సంకెళ్లు ఉండడంతో కొందరు ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
సూపరింటెండెంట్ లేఖలో తప్పులు..
ఇదిలా ఉంటే.. హీర్యానాయక్‌ను ఆస్పత్రికి తరలించేందుకు సిబ్బందిని పంపించాలని జైలు సూపరింటెండెంట్ రాసిన లేఖలో పలు అంశాలు కలకలం రేపాయి. వాటిపై నిఘావర్గాలు ఆరాతీస్తున్నాయి. సాధారణంగా ఏసు నమోదు చేసిన పోలీసులు ఎస్కార్ట్ అడగాలి. కానీ, సూపరింటెండెంట్ వికారాబాద్ పోలీసులను కాకుండా సైబరాబాద్ పోలీసులకు లేఖ రాశారు. అందులో బాలానగర్ పీఎస్‌లో కేసు నమోదైనట్లు పేర్కొన్నారు. ఆ కేసు రోడ్డు ప్రమాదానికి సంబంధించినంది.
ఫోన్ సంభాషణ..
ఇదిలా ఉంటే లగచర్ల కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న సురేశ్ ఫోన్‌లో మాట్లాడిన విషయం కూడా బైయటకు వచ్చింది. దీనిపై జైలర్ జీవన్‌రెడ్డిని డీజీ సస్పెండ్ చేశారు. ఏ2గా ఉన్న సురేశ్ ల్యాండ్ ఫోన్ నుంచి ఎవరితోనో మాట్లాడారిని మల్లీజోన్–2 ఐజీ సత్యనారాయణ తెలిపారు. ఫోన్‌లో గుండెనొప్పి అని లాయర్లు, మీడియాకు సమాచారం ఇస్తే గంటలో బెయిల్ ఇస్తామని తెలిపాడు. మరోవైపు సూపరింటెండెంట్ లేఖపైనా విచారణ జరుపుతున్నారు.
Raj Sekhar is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Lagacharla farmer hiryanayak was taken from jail to the hospital in handcuffed and chained
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com