Irumudi Movie: బాక్స్ ఆఫీస్ వద్ద ‘ఇరుముడి’ ప్రభంజనం ఏ స్థాయిలో కొనసాగుతూ ముందుకెళ్తుందో ప్రతీ రోజు మనం చూస్తూనే ఉన్నాం. ప్రతీ రోజు ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల నుండి నమోదయ్యే వసూళ్లను చూస్తుంటే, భవిష్యత్తులో ఇలాంటి విద్వంసం ఏ స్టార్ హీరో కి కూడా సాధ్యం అవ్వదేమో అని అనిపిస్తోంది. నిన్న ఒక్క రోజే ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల నుండి 7 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు నమోదు అయ్యాయి. వంద కోట్ల షేర్ మార్కుని నేటితో అందుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇలాంటి స్థాయి విజయాన్ని నమోదు చేసుకున్న చిత్రాన్ని బ్యాన్ చేయాలంటూ ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో ఒక డిమాండ్ ఏర్పడింది. కొన్ని విద్యార్థుల సంఘాలు, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కి ఉత్తరాలు కూడా రాశారు.
ఎందుకంటే ఈ సినిమాలో ప్రభుత్వ పాఠశాలలను కించపరిచే విధంగా సన్నివేశాలు ఉన్నాయని, వాటిని తక్షణమే తొలగించాలని, లేని పక్షం లో సినిమాని బ్యాన్ చెయ్యాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అయితే ఒక గ్రామం లోని ప్రభుత్వ పాఠశాల టీచర్ తప్పు చేసినట్టు చూపిస్తే, రాష్ట్రం లోని అన్ని పాఠశాలల్లోని టీచర్స్ ని అవమానించినట్టా?, ఇదెక్కడి విడ్డూరం చెప్పండి అంటూ సోషల్ మీడియా లో కొంతమంది నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. రీసెంట్ గా వైజాగ్ లోని ఒక పాఠశాలలో టీచర్ కి భయపడి ఒక విద్యార్థి చనిపోయాడు. అంటే ఇప్పుడు తల్లిదండ్రులందరినీ మీ పిల్లల్ని స్కూల్స్ లో చదివించకండి అని ప్రచారం చేస్తారా ఏంటి?.
గత ప్రభుత్వం లో టీచర్స్ ని మద్యం షాప్స్ ఎదురుగా కాపలా పెట్టించారు, టీచర్స్ ని ఎంతగానో అవమానించారు, అప్పుడు ఏమయ్యాయి ఈ విద్యా సంఘాలు?, అప్పుడు ఎందుకు రోడ్డు మీదకు వచ్చి ధర్నాలు చేయలేదు?, ‘ఇరుముడి’ సినిమాలో కావాలని ప్రభుత్వ పాఠశాలలను కించ పరిచే విధంగా ఏమి చూపించలేదే?, వాళ్ళ ఉద్దేశ్యం అది కాదని ఆ సినిమాని చూసిన ఎవరికైనా స్పష్టంగా అర్థం అవుతోంది, మరి అలాంటప్పుడు ఆరోపణలు చేయాల్సిన అవసరం ఏంటి? అంటూ సోషల్ మీడియా లో విశ్లేషకులు సైతం కామెంట్స్ చేస్తున్నారు. ఒక సినిమా కమర్షియల్ గా పెద్ద హిట్ అయ్యింది కాబట్టి, ఆ సినిమా పేరు ని వాడుకుంటే లైం లైట్ లోకి రావొచ్చు అనే ఉద్దేశ్యంతోనే ఈ ఆందోళనలు చేస్తున్నట్టు ఉంది కానీ, వాళ్ళ ఆందోళనల్లో ఎలాంటి అర్థం లేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్స్.