Irumudi Movie: మాస్ మహారాజ రవితేజ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఇరుముడి’ బాక్స్ ఆఫీస్ వద్ద జెనెరేషనల్ బ్లాక్ బస్టర్ గా నిల్చింది అనడం లో ఎలాంటి సందేహం లేదు. చాలా సాధారణమైన అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రానికి మొదటి ఆట నుండే అద్భుతమైన పాజిటివ్ టాక్ వచ్చింది. ఆ టాక్ కి తగ్గట్టుగానే బంపర్ ఓపెనింగ్స్ ని నమోదు చేసుకొని , గత పదేళ్లుగా ఏ స్టార్ హీరో కి కూడా దక్కని అద్భుతమైన లాంగ్ రన్ ని సొంతం చేసుకుంది ఈ చిత్రం. 25 రోజుల థియేట్రికల్ రుని పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి 1 కోటి 41 లక్షల టిక్కెట్లు అమ్ముడుపోయాయి అట. ఓవరాల్ వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి 240 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యాయి.
ఈ వీకెండ్ తో 250 కోట్ల గ్రాస్ మార్కుని కూడా అందుకోబోతుంది ఈ చిత్రం. అలాంటి హిస్టారికల్ బ్లాక్ బస్టర్ ఇప్పుడు ఓటీటీ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అవుతోంది. విడుదలకు ముందు ఈ సినిమా ఓటీటీ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ సంస్థ భారీ రేట్ కి కొనుగోలు చేసింది. వాళ్ళతో పెట్టుకున్న డీల్ ప్రకారం ఎట్టి పరిస్థితిలోనూ ఈ చిత్రాన్ని నాలుగు వారాల థియేట్రికల్ రన్ తర్వాత నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ చేసుకునే అవకాశం ఇవ్వాలి. కానీ సినిమాకు థియేట్రికల్ రన్ ఇప్పటికీ తగ్గలేదు. రోజుకి సగటున 60 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు కేవలం తెలుగు రాష్ట్రాల నుండే వస్తున్నాయి. నిన్న కూడా బుక్ మై షో యాప్ లో ఈ చిత్రానికి 40 వేల టిక్కెట్లు అమ్ముడుపోయాయి. ఇంతటి బలమైన లాంగ్ రన్ ఉన్న సినిమాని 4 వారాలకే ఓటీటీ లో వదలడానికి నిర్మాతలకు కూడా ఇష్టం లేదు.
నెట్ ఫ్లిక్స్ సంస్థ ని మరో రెండు వారాలు వాయిదా వేయాల్సిందిగా రిక్వెస్ట్ చేశారు. కానీ అందుకు ఆ సంస్థ ఒప్పుకోకపోవడం తో , వేరే గత్యంతరం లేక ఈ నెల 18 నుండి ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేయబోతున్నారు మేకర్స్. ఈ వారం లో కూడా పది కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టేంత సత్తా ఉన్న సినిమా , ఓటీటీ లో విడుదల కాబోతుండడం దురదృష్టకరం. కానీ ఓటీటీ మూవీ లవర్స్ కి మాత్రం ఇదొక పండగ లాంటి వార్త అనే చెప్పాలి. తెలుగు తో పాటు, తమిళం , కన్నడ, హిందీ , మలయాళం భాషల్లో ఈ సినిమా ఈ నెల 18 నుండి నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంటుంది. చూడాలి మరి థియేటర్స్ లో ఈ రేంజ్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిన ఈ చిత్రానికి , ఓటీటీ లో ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అనేది.